E-Paper
Advertisement

ఈ అత్త ఎంత మంచివారో.. తన కోడలి కోసం ఏం చేశారో చూడండి!

ఈ అత్త ఎంత మంచివారో.. తన కోడలి కోసం ఏం చేశారో చూడండి!
Advertisement

Viral News: సాధారణంగా అత్త-కోడళ్లకు నిమిషం కూడా పడదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఎప్పుడూ ఏదోక విషయం మీద కస్సు బుస్సు అనుకుంటూనే ఉంటారన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ ఓ అత్త మాత్రం తన కోడలిపై ఉన్న అపార ప్రేమను చాటుకున్నారు. బెంగళూరులో ఉన్న కోడలి కోసం బిహార్ నుంచి సూట్ కేసులో పెద్ద ఎత్తున మామిడి పండ్లను పంపారు. ఇందుకు సంబంధించి దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇన్ స్టాగ్రామ్ యూజర్ శ్రేయా.. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ‘అత్తగారితో మాల్దా మామిడి అంటే ఇష్టం అని మాముల్గా అన్నాను’ అనే క్యాప్షన్ తో ఈ వీడియో ను శ్రేయా పోస్ట్ చేశారు. దీంతో వీడియోలో పదుల సంఖ్యలో ఉన్న మాల్దా మామిడి పండ్లను సూట్ కేసులో ఆమె అత్త సర్దడం కనిపించింది. ఆ తర్వాత ఆ సూట్ కేస్ ఇంటికి చేరగానే.. దాన్ని ఫ్రిజ్ లో దాచుకున్న విజువల్స్ ను శ్రేయా చూపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి దృశ్యాలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Advertisement

Also Read: ఏపీలో మెగా డ్రోన్ నెట్‌వర్క్.. కిలోమీటరుకు 10 పైసలే.. ఇక గాల్లోనే సరుకు రవాణా!

ఈ వీడియోను చూసిన నెటిజన్లు శ్రేయా అత్తపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఇలాంటి అత్తగారు దొరకడం నిజంగా అదృష్టం’ అని కామెంట్స్ చేస్తున్నారు. ‘డైమండ్స్, బంగారు నగలు ఉన్న సూట్‌కేస్ కంటే ఈ మామిడి పండ్ల సూట్‌కేస్ ఎంతో విలువైనది. ఇందులో స్వచ్ఛమైన ప్రేమ ఉంది’ అని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. బిహార్‌కు చెందిన ఈ అత్త.. కోడలిపై చూపించిన ప్రేమ, అప్యాయత ప్రస్తుతం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.

Advertisement

Also Read: తెలంగాణలో బీజేపీ నయా స్కెచ్.. అధికారం కోసం ఎంట్రీ ఇస్తున్న అగ్ర వ్యూహకర్త..?

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×