E-Paper
Advertisement

Love Marriage: సీక్రెట్‌గా రిజిస్టర్ పెళ్లిచేసుకోవానుకునే ప్రేమికులకు బిగ్ షాక్, తల్లిదండ్రులకు చెప్పాల్సిందే

Love Marriage: సీక్రెట్‌గా రిజిస్టర్ పెళ్లిచేసుకోవానుకునే ప్రేమికులకు బిగ్ షాక్, తల్లిదండ్రులకు చెప్పాల్సిందే
Advertisement

ఇప్పుడు ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువైపోయాయి. అందులోనూ తల్లిదండ్రులకు చెప్పకుండా పారిపోయి రిజిస్టర్ పెళ్లిళ్లు చేసుకుంటున్నవారు ఎంతో మంది. వారందరికీ గుజరాత్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. గుజరాత్‌లో పెళ్లి రిజిస్ట్రేషన్ విధానంలో పెద్ద మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ప్రేమ వివాహాలు లేదా కుటుంబ అనుమతి లేకుండా జరిగే పెళ్లిలకు కొత్త నిబంధనలు తీసుకురాబోతున్నారు. గుజరాత్ ప్రభుత్వం రూపొందిస్తున్న ఈ మార్పులు అమల్లోకి వస్తే, పెళ్లి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసిన వెంటనే తల్లిదండ్రులకు సమాచారం వెళ్లే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

అమ్మాయి పేరెంట్స్ కి చెప్పాల్సిందే
ప్రస్తుతం పెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జంటలు అవసరమైన పత్రాలు సమర్పిస్తే, కొన్ని రోజుల్లో సర్టిఫికేట్ జారీ అవుతుంది. కానీ కొత్త ప్రతిపాదన ప్రకారం, దరఖాస్తు చేసిన వెంటనే ఒక నోటిఫికేషన్ వ్యవస్థ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందేలా డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయి తల్లిదండ్రులకు ఈ సమాచారం చేరేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు. వాట్సాప్ లేదా ఇతర మొబైల్ మెసేజ్ సేవల ద్వారా అలర్ట్ పంపే విధానం పరిశీలనలో ఉందని తెలుస్తోంది.

Advertisement

Also read: Danger zone Jobs: ఏఐ వల్ల ఈ ఉద్యోగాలకు ఎసరు, వీరి జాబ్స్ అంత సేఫ్ కావు

ఇప్పటివరకు పెళ్లి రిజిస్ట్రేషన్ వేగంగా పూర్తయిపోతుంది. కొత్త నియమాల ప్రకారం దరఖాస్తు చేసిన తర్వాత సుమారు 30 నుంచి 40 రోజుల గ్యాప్ ఉండే అవకాశం ఉంది. ఈ గ్యాప్ సమయంలో అధికారులు వివరాలు ధృవీకరించడంతో పాటు, అవసరమైతే కుటుంబ సభ్యులు అభ్యంతరాలు తెలపడానికి అవకాశంఇస్తారు. దీంతో మోసపూరిత వివాహాలు లేదా బలవంతపు పెళ్లిలను తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

భద్రత కోసమే
ఈ మార్పులు చేయడానికి ప్రభుత్వం చెబుతున్న ప్రధాన కారణం భద్రత. ఇటీవల కొన్ని సందర్భాల్లో తప్పుడు వివరాలతో పెళ్లి చేసుకునే ఘటనలు, మోసపూరిత వివాహాలు, గుర్తింపు సమస్యలు బయటపడ్డాయి. వాటిని అడ్డుకునేందుకు ఈ మార్పులు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. అలాగే కుటుంబ సభ్యులకు తెలియకుండా జరిగే వివాహాల వల్ల ఏర్పడే వివాదాలు తగ్గుతాయని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను కుటుంబ భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలని యోచిస్తున్నారు.

అయితే ఈ విధానంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని మహిళల రక్షణకు అనుకూలమని, కుటుంబాలకు ముందుగానే సమాచారం ఉండటం వల్ల సమస్యలు తగ్గుతాయని అంటున్నారు. ముఖ్యంగా మైనర్ వివాహాలు, మోసం చేసే పెళ్లిలను అరికట్టడంలో ఇది ఉపయోగపడుతుందని సామాజిక సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. కుటుంబ సహకారం పెరగడం వల్ల వివాహాలపై నమ్మకం పెరుగుతుందని కూడా వారు చెబుతున్నారు. మరోవైపు న్యాయ నిపుణులు, వ్యక్తిగత స్వేచ్ఛపై పని చేసే సంస్థలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇద్దరు పెద్దవాళ్లు స్వచ్ఛందంగా పెళ్లి చేసుకోవడం వారి హక్కు అని, కుటుంబ అనుమతి లేకపోయినా వివాహం చేసుకునే స్వేచ్ఛను రాజ్యాంగం ఇస్తుందని వారు గుర్తుచేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వడం, వ్యక్తిగత గోప్యతను బయటపెట్టడమేనని విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ వ్యతిరేకత ఉన్న జంటలకు ఇది ఇబ్బందులు కలిగించవచ్చని అంటున్నారు.

ప్రస్తుతం ఈ నిబంధనలు ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. ప్రభుత్వం అధికారికంగా అమలు తేదీ ప్రకటించలేదు. అయితే డిజిటల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థను బలోపేతం చేయడం, పెళ్లి ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చడం కోసం త్వరలోనే ఈ సేవలు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రజాభిప్రాయం కూడా పరిశీలించే అవకాశముంది.

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×