E-Paper
Advertisement

ఒడిశాలో అరాచకం.. బైక్‌పై వెళ్తూనే మహిళ జుట్టు పట్టుకుని పిడిగుద్దులు.. వీడియో వైరల్!

ఒడిశాలో అరాచకం.. బైక్‌పై వెళ్తూనే మహిళ జుట్టు పట్టుకుని పిడిగుద్దులు.. వీడియో వైరల్!
Advertisement

Viral Video: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో పట్ట పగలు అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తి చేసిన అరాచకం చూస్తుంటే సభ్య సమాజం ఎటు వెళ్తుందో అర్ధం కావడం లేదు. నడి రోడ్డుపై బైక్ నడుపుతూనే.. తన వెనుక కూర్చొన్న మహిళపై అతను ప్రదర్శించిన పైశాచికత్వం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది.

సాధారణంగా రద్దీగా ఉండే భువనేశ్వర్ రోడ్లపై ఒక వ్యక్తి బైక్ నడుపుతున్నాడు. అయితే ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా అతను సైకోలా మారిపోయాడు. బండి నడుపుతూనే వెనుక ఉన్న మహిళ జుట్టు పట్టుకుని బలంగా లాగుతూ, మరో వైపు ఆమె ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. ఆమె తప్పించుకోవాలని చూసినా వదలకుండా దాడిని కొనసాగించాడు. చుట్టుపక్కల జనం ఉన్నా లెక్క చేయకుండా అతను చేసిన ఈ అమానుషం అక్కడే ఉన్న ఒక వాహనదారుడి కెమెరాలో రికార్డ్ అయ్యింది.

Advertisement

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘ ప్రేమ లేక బంధం పేరుతో ఇలాంటి వేధింపులను భరించవద్దు’ అని, ప్రమాదకరమైన బంధాల నుంచి మహిళలు వెంటనే బయటకు రావాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వీడియో ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతనిపై విచారణ జరుగుతోంది. అయితే ఆ బాధితురాలు ఎవరు? వారి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఆ మహిళ భద్రతపై ప్రస్తుతం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడికి కఠిన శిక్ష పడాలని సామాన్యులు కోరుతున్నారు.

Advertisement

Also Read: హైదరాబాద్‌లో భయానక ఘటన.. బైక్‌ను ఢీకొట్టి బాధితుడిని 2 కి.మీ ఈడ్చుకెళ్లిన కారు

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×