// // Viral Video: బెంగళూరు రోడ్ల గుంతలపై వినూత్న నిరసన, ఏకంగా పోర్షే కారుపై సిమెంట్ కలిపి.. -->
E-Paper
Advertisement

బెంగళూరు రోడ్ల గుంతలపై వినూత్న నిరసన, ఏకంగా పోర్షే కారుపై సిమెంట్ కలిపి..

బెంగళూరు రోడ్ల గుంతలపై వినూత్న నిరసన, ఏకంగా పోర్షే కారుపై సిమెంట్ కలిపి..
Advertisement

Bengaluru Pothole Fix Goes Viral: బెంగళూరులో జరిగిన ఓ ఆసక్తికర ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. సిటీలోని గుంతల సమస్యను అధికారులు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ ఓ వ్యాపారవేత్త చేసిన పనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇంతకీ అసలు ఆయన ఏం చేశారంటే…

బెంగళూరుకు చెందిన అఖిల్ హేమాద్రి బెంగళూరులో వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. తను ఉండే ప్రాంతంలో రోడ్డు దెబ్బతిన్నది. సరిచేయాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అనుకున్నారు. తాజాగా ఆఫీస్ కు వెళ్లే సమయంలో ఆయన ఓ షాకింగ్ పని చేశారు. రోడ్డు మీద ఉన్న గుంతల దగ్గర తన విలాసవంతమైన పోర్షే కారును ఆపాడు. దానికి బోనెట్ మీద సిమెంట్, కంకర, నీళ్లు వేసి మిక్స్ చేశారు. ఆ సిమెంట్ ను తీసుకెళ్లి గుంతను పూడ్చారు. ఆ తర్వాత కారు బోనెట్ మీద ఉన్న ప్రొటెక్షన్ పేపర్ ను తొలగించి కారుకు ఎలాంటి నష్టం కలగలేదని చూపించారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement

సోషల్ మీడియాలో వీడియో వైరల్

అటు ఈ వీడియో కాసేపట్లోనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. కొందరు, ప్రభుత్వం కోసం ఎదురు చూడకుండా స్వయంగా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించడాన్ని ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలపై బాధ్యత తీసుకోవాలని ఆయన ఇచ్చిన సందేశం బాగుందని మరికొంత మంది అన్నారు. ఇంకొంత మంది దీనిని కేవలం ప్రచారం కోసం చేసిన పీఆర్ స్టంట్‌ గా అభివర్ణించారు. అయితే, ఈ వీడియో మీద చర్చ పక్కదోవ పట్టినట్లు కనిపించడంతో  హేమాద్రి స్వయంగా ఈ వీడియో వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. తన కంపెనీ బ్రాండ్‌ ను ప్రమోట్ చేయడం, అలాగే కార్లపై ఉపయోగించే ప్రొటెక్షన్ పేపర్ బలాన్ని చూపించడమే లక్ష్యమన్నారు. ప్రజల్లో బాధ్యత పెంచడం కూడా తన ఉద్దేశమని చెప్పారు. “మన పరిసరాలను మనమే కాపాడుకుంటే, దేశం కూడా మెరుగవుతుంది” అనే సందేశాన్ని ఇవ్వాలని భావించానని ఆయన వెల్లడించారు.

డీకే వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్న నెటిజన్లు

Advertisement

అటు ఈ ఘటన నేపథ్యంలో బెంగళూరులో గుంతల సమస్య మరోసారి చర్చకు వచ్చింది. గతంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బెంగళూరులో గుంతలు లేవని చేసిన వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అయ్యాయి.  మొత్తం మీద, ఒక చిన్న సమస్యను పరిష్కరించడానికి చేసిన ఈ వినూత్న ప్రయత్నం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఇది నిజంగా బాధ్యతతో చేసిన చర్యనా?  లేదా ప్రచారం కోసం చేసిన స్టంటా? అన్నది పక్కన పెడితే, ఈ ఘటన ప్రజల్లో అవగాహన పెంచిందన్న విషయం మాత్రం నిజం.

Read Also: వామ్మో ఇదేం రెస్టారెంట్ రా బాబూ.. దయ్యాల వడ్డనకు బుడ్డోడు జడుసుకున్నాడు!

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×