E-Paper
Advertisement

Onion Garlic Row: ఉల్లి పెట్టిన లొల్లి.. భార్యకు విడాకులిచ్చిన భర్త, ఇంత చిన్న కారణానికే?

Onion Garlic Row: ఉల్లి పెట్టిన లొల్లి.. భార్యకు విడాకులిచ్చిన భర్త, ఇంత చిన్న కారణానికే?
Advertisement

చిన్న చిన్న కారణాలకే వివాహ బంధాలు కుప్పకూలిపోతున్నాయి. తాజాగా అహ్మదాబాద్ లో జరిగిన ఘటన చూస్తే, ఆశ్చర్యం కలగక మానదు. ఉల్లిపాయ గురించి చెలరేగిన వివాదం కారణంగా 22 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పడింది. తాజాగా ఆ దంపతులకు గుజరాత్ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?   

అహ్మదాబాద్ కు చెందిన దంపతులకు 2002లో వివాహం జరిగింది. కొంతకాలం వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరి సంసారం కొనసాగింది. ఆ తర్వాత భార్య స్వామి నారాయణను కొలవడం మొదలుపెట్టింది. నిష్టగా పూజలు చేయడం ప్రారంభించింది. ఆ సమయంలోనే ఆమె వంటకాల్లో ఉల్లిపాయలను ఉపయోగించకూడదని నిర్ణయించింది. ఇంట్లో కూడా ఇకపై వాటిని వాడకూడదని చెప్పింది. అయితే, ఆమె భర్త, అత్త మాత్రం ఉల్లిపాయలను తినడం ఆపలేదు. ఎంత వద్దని చెప్పినా వినిపించుకోలేదు.

తరచుగా కుటుంబంలో వివాదం  

Advertisement

ఉల్లిపాయల కారణంగా తరచుగా వారి కుటుంబంలో వివాదాలు జరిగేవి. నెమ్మదిగా భార్య.. భర్త, అత్త వేర్వేరుగా వంటలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ వేర్పాటు మరింత ముదిరింది. ఇంట్లో ఉద్రిక్తత పెరగడం ప్రారంభమైంది. నెమ్మదిగా వివాహ బంధానికి బీటలువారడం మొదలు పెట్టాయి. చివరికి భార్య తన బిడ్డతో కలిసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. 2013లో, భర్త విడాకులు కోరుతూ అహ్మదాబాద్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన భార్య ఆహారపు అలవాట్లను తమ మీద రుద్దడం క్రూరత్వం అని ఆరోపించాడు. 2024లో ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసి, భరణం చెల్లించాలని ఆదేశించింది.

హైకోర్టును ఆశ్రయించిన భార్య

ఫ్యామిలీ కోర్టు ఆదేశాన్ని భార్య సవాలు చేయడంతో కేసు గుజరాత్ హైకోర్టుకు వెళ్లింది. భర్త తన మతపరమైన ఆహార పరిమితులను కించపరిచాడని ఆరోపించింది. ఉల్లిపాయ, వెల్లుల్లి తినడం నిరంతర సంఘర్షణకు కారణం అయ్యిందని భర్త వాదించాడు. ఉల్లిపాయలు,  వెల్లుల్లి లేకుండా ఆమె కోసం వంట చేసినా, చీటికి మాటికి గొడవలు పడేదని చెప్పాడు. ఈ గొడవల కారణంగా తాను ఒకసారి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని చెప్పాడు.

Advertisement

Read Also: గ్రోక్‌ను రూ.2 వేలు అప్పు అడిగిన నెటిజన్.. దాని సమాధానం తెలిస్తే షాకవుతారు!

విడాకులు మంజూరు చేసిన న్యాయస్థానం

హైకోర్టు విచారణ సందర్భంగా, భార్య విడాకులు తీసుకునేందుకు ఒప్పుకుంది. భర్తకు భరణం చెల్లించాలని న్యాయస్థానం చెప్పింది. ఆ భరణాన్ని కోర్టులో వాయిదాల పద్దతిలో జమ చేయాలని అంగీకరించింది. చివరకు కోర్టులో విడాకులకు పరస్పరం అంగీకరించడంతో, హైకోర్టు భార్య పిటిషన్‌ను కొట్టివేసి విడాకులను సమర్థించింది. చిన్న గొడవకు విడాకులు తీసుకోవడం ఏంటని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

Read Also: గ్రోక్‌ను రూ.2 వేలు అప్పు అడిగిన నెటిజన్.. దాని సమాధానం తెలిస్తే షాకవుతారు!

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×