E-Paper
Advertisement

Viral Video: ఒంటెను ఢీకొన్న కారు.. పాపం ఎటూ కదల్లేని పరిస్థితిలో ?

Viral Video: ఒంటెను ఢీకొన్న కారు.. పాపం ఎటూ కదల్లేని పరిస్థితిలో ?
Advertisement

Viral Video: తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు మాత్రం తెగ హల్ చల్ చేస్తుంటాయి. తాజాగా రాజస్థాన్ లో జరిగిన ఓ సంఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై వెళుతున్న ఓ ఒంటెను కారు ఢీకొట్టింది. దీంతో ఒంటె చాలా సేపు కారులో ఇరుక్కుపోయింది.

రాత్రివేళ రోడ్డుపై ఓ ఒంటె వెళుతుంది. ఈ తరుణంలో ఓ కారు స్పీడ్ గా వస్తుంది. దీంతో ఒంటెను చూసి కారును అదుపు చేయలేకపోవడంతో ఒక్కసారిగా ఒంటెను కారు ఢీకొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒంటెను కారు ఢీ కొట్టిన అనంతరం కారు చాలా వరకు డ్యామేజ్ అయింది. కారు ముందు భాగంలో ఒంటె ఇరుక్కుపోయింది. దీంతో ఒంటె ఎటూ కదలలేని పరిస్థితికి వెళ్లింది.

Advertisement

కారులో ఒంటె ఇరుక్కుపోవడంతో కదలలేక అరుపులు పెట్టడం ప్రారంభించింది. ఇది రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్ జిల్లాలో వెలుగుచూసింది. కారు విండ్ స్క్రీన్ లో ఒంటె ఇరుక్కున వీడియోను పలువురు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. అయితే వెంటనే అటవీ శాఖ అధికారులు రావడంతో గంటల తరబడి కష్టపడి క్రేన్ సహాయంతో ఒంటెను బయటకు తీసారు. అయితే ఈ ఘటనలో ఒంటెకు స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే దానికి చికిత్స అందించి తిరిగి అడవిలో వదిలిపెట్టారు.

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×