E-Paper
Advertisement

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్
Advertisement

Raghavender Reddy: బిగ్ టీవీ (Big TV) ఛానల్స్ గ్రూప్ చైర్మన్ వెన్నం విజయ్ భాస్కర్ రెడ్డి గారి పితృవియోగం పట్ల ఆ గ్రామంలో పెను విషాదం నెలకొంది. ఆయన తండ్రి వెన్నం రాఘవేందర్ రెడ్డి గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. బుధవారం రాత్రి కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే గ్రామంలో నిశ్శబ్దం అలుముకుంది. దీంతో ఆ గ్రామస్తులందరూ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

రాఘవేందర్ రెడ్డి కేవలం ఒక వ్యక్తిగా కాకుండా.. గ్రామానికి ఒక పెద్ద దిక్కుగా ఉండేవారని స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆయన మరణం పూడ్చలేని లోటు అని.. ఊరి సమస్యల పరిష్కారంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారని వారు గుర్తుచేసుకుంటున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తనవంతు సాయం అందించే గుణవంతుడని గ్రామస్తులు కొనియాడుతున్నారు.

Advertisement

ముఖ్యంగా ఆయన రాజకీయ ప్రస్థానంలో చేసిన సేవలను ప్రజలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఆయన టీడీపీలో ఉన్న సమయంలో గ్రామానికి కరెంటు సౌకర్యం కల్పించడం, రోడ్ల నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారని.. పేదరికంలో ఉన్న సుమారు 50 నుండి 60 కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపారని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో తలెత్తే ఎలాంటి వివాదాలనైనా, సమస్యలనైనా సామరస్యంగా పరిష్కరించే మధ్యవర్తిగా ఆయన పేరుగాంచారన్నారు.

ఆయనలోని మంచితనం, నిస్వార్థ సేవ గ్రామంలోని ప్రతి ఇంటితోనూ ఒక విడదీయలేని అనుబంధాన్ని ఏర్పరిచిందని.. “మా ఊరి అభివృద్ధిలో ఆయన పాత్ర మరువలేనిది” అంటూ గ్రామస్తులు ఎమోషనల్ అవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, విజయ్ భాస్కర్ రెడ్డి గారి కుటుంబానికి గ్రామస్తులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

Advertisement

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×