E-Paper
Advertisement

ఆడపిల్లని తెలిస్తే చంపేస్తారా? సూర్యాపేట జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ రట్టు

ఆడపిల్లని తెలిస్తే చంపేస్తారా? సూర్యాపేట జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ రట్టు
Advertisement

Gender Test: పిల్లల కోసం గుళ్లు, ఆస్పత్రులు తిరిగే వాళ్లు కొందరైతే.. పుట్టబోయే పిల్లలను కడుపులోనే చంపేసే వాళ్లు ఇంకొందరు. అమ్మాయి అని తేలితే చాలు.. నెలలు నిండకుండానే నూరేళ్లు నిండిపోయేలా చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో బయటపడిన అక్రమ లింగ నిర్ధారణ సెంటర్ వ్యవహారం కలకలం రేపింది. తిరుమలగిరిలోని బాలాజీ ప్రైవేట్ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్ష చేస్తున్నట్లు సమాచారం అందడంతో.. డీఎంహెచ్‌వో వెంకటరమణ, వైద్యాధికారులు తనిఖీలు చేశారు.

Advertisement

ఆస్పత్రిలో స్కానింగ్ మెషీన్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఆస్పత్రి అనుమతి గడువు ముగిసినా.. రెన్యూవల్ చేయనట్లు గుర్తించారు. ఆస్పత్రితో పాటు నిర్వాహకుడిపైనా కేసు నమోదు చేశారు. మొన్నటికి మొన్న జనగామలో అబార్షన్ వికటించి గర్భిణి చనిపోయింది. ఇప్పుడు సూర్యాపేటలో ఇలా! కఠిన చట్టాలున్నా వీళ్లకు బుద్ధి ఎందుకు రావట్లేదనేదే బిగ్ క్వశ్చన్. రోజుకో లింగ నిర్ధారణ సెంటర్ బయటకొస్తుంటే.. డీఎంహెచ్‌వోలు ఏం చేస్తున్నారు? అధికారులు సీరియస్‌గా ఉన్నట్లా? లేనట్లా?

Tags

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×