E-Paper
Advertisement

Hayathnagar Land Issue: భూ వివాదం.. కర్రలతో తలలు పగిలేలా కొట్టుకున్న గ్రామస్తులు, వీడియో వైరల్

Hayathnagar Land Issue: భూ వివాదం.. కర్రలతో తలలు పగిలేలా కొట్టుకున్న గ్రామస్తులు, వీడియో వైరల్
Advertisement

హైదరాబాద్ హయత్‌నగర్ పరిధిలోని పాపయ్య గూడా ప్రాంతంలోని సర్వే నంబర్లు 216, 218, 219లోని 20 ఎకరాల భూమి వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో గడ్డం రాజు అనే వ్యక్తి కర్రల దాడి కారణంగా తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆయనను హయత్‌నగర్‌లోని ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం  రాజు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ దాడి మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

పోలీసుల పరిశీలనలో, రాజును చంపడానికి ప్రత్యర్థి వర్గానికి చెందిన హరి శంకర్ యాదవ్ 20 లక్షల రూపాయల సుపారీ ఇచ్చారని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. హరి శంకర్ యాదవ్ సుపారీ గురించి మాట్లాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు దాడి దృశ్యాలు, సుపారీ వీడియోలను ఆధారంగా పరిశీలిస్తున్నారు. పోలీసులు సవివరంగా నిందితులను గుర్తించి, చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ ఘర్షణ భూ హక్కుల వివాదాలపై ఉన్న ఆందోళనను మరింత పెంచింది.

Advertisement

 

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×