E-Paper
Advertisement

IndiGo: సాధారణ స్థితికి విమాన సేవలు.. క్షమించాలంటూ ఇండిగో సీఈవో ప్రకటన!

IndiGo: సాధారణ స్థితికి విమాన సేవలు.. క్షమించాలంటూ ఇండిగో సీఈవో ప్రకటన!
Advertisement

IndiGo CEO Pieter Elbers Apology: గత వారం రోజులు ఇండిగోలో కొనసాగుతున్న సంక్షోభం మీద ఆ సంస్థ సీఈవో పీటర్ ఎల్పర్స్ స్పందించారు. తాజా పరిణామాలపై ప్రయాణీకులకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. గత 20 ఏళ్లలో ఇలాంటి ఘోర పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదన్న ఆయన.. ఇబ్బందులు పడిన ప్రయాణీకులందరికీ పేరు పేరునా క్షమాపణలు చెప్పారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కావని హామీ ఇచ్చారు.

సాధారణ స్థితికి ఇండిగో సేవలు-  సీఈవో పీటర్  

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇండిగో సేవలు సాధారణ స్థితికి చేరకున్నాయని ఇండిగో సీఈవో పీటర్ ఎల్పర్స్ ప్రకటించారు. సంక్షోభం కారణంగా వేలాది మంది ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారని, అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణులు చెప్తున్నట్లు ప్రకటించారు. “అత్యవసర పనుల మీద వెళ్లే వేలమంది ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  దానికి మేము క్షమాపణ చెప్తున్నాము.  ఇక మీదట ఇండిగో విమాన సేవల్లో ఎటువంటి అసౌకర్యం కలిగే ప్రసక్తి ఉండదు. మెరుగైన సేవలు అందించేందుకు ఇండిగో సిబ్బంది అంతా కష్టపడి పని చేస్తున్నారు. ప్రయాణికులే ఇండిగో  సంస్థకు ప్రథమ ప్రాధాన్యత. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం” అని పీటర్ ఎల్పర్స్ తెలిపారు.

లక్షలాది మందికి పూర్తి రీఫండ్

Advertisement

అటు విమాన టికెట్లు బుక్ చేసుకున్న లక్షలాది మంది ప్రయాణీకులకు ఇప్పటికే పూర్తి రీఫండ్ చెల్లించినట్లు పీటర్ ఎల్పర్స్ తెలిపారు. ప్రయాణీకుల బ్యాగేజీని వారి నివాసాలకు చేర్చినట్లు తెలిపారు.  మిగిలిన మరికొన్ని బ్యాగేజీలను వారి ఇళ్లకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Read Also: ఇండిగోపై యాక్షన్ షురూ, 5% విమానాలను తగ్గించాలని కేంద్రం ఆదేశం!

అందుబాటులోకి 1800 విమానాలు

Advertisement

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విమాన సర్వీసులు నడిపిస్తున్నట్లు పీటర్ ఎల్పర్స్ తెలిపారు. “డిసెంబర్ ఐదవ తేదీన 700 ఫ్లైట్లు మాత్రమే నడపగలిగాము. నిన్న, ఈరోజు మొత్తం 18 వందల ఫ్లైట్లను అందుబాటులోకి తెచ్చాం. 138 గమ్య స్థానాలకు ఇండిగో ప్రయాణాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ పూర్తి సహకారంతో ముందుకు వెళ్తున్నాము.  ఈ సంఘటనల నుంచి గుణపాఠం నేర్చుకున్నాం. మరెప్పుడూ ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రయాణీకులకు భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం” అని సీఈవో పీటర్స్ ఎల్బర్స్ ప్రయాణీకులకు హామీ ఇచ్చారు.

Read Also: ఇండిగో దొంగ సాకులు? డీజీసీఏ షోకాజ్ నోటీసులకు ఏం సమాధానం ఇచ్చిందంటే?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×