E-Paper
Advertisement

Mynampally Hanumanth Rao: కాంగ్రెస్‌లో BRS కోవర్టులు.. మైనంపల్లి సంచలనం

Mynampally Hanumanth Rao: కాంగ్రెస్‌లో BRS కోవర్టులు.. మైనంపల్లి సంచలనం
Advertisement

కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో BRS కోవర్టులు ఉన్నారేమోనన్న బలమైన అనుమానం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మెదక్, సిద్దిపేట జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో BRS కోవర్టులు ఉన్నారని స్పష్టం చేశారు.

ఈ కోవర్టు వ్యవస్థ లేకపోతే రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేదని మైనంపల్లి అభిప్రాయపడ్డారు. ఈ కోవర్టులు కాంగ్రెస్ పార్టీలో ఉండే బదులు BRS లోకి వెళ్లిపోతేనే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో ఏది జరిగినా వెంటనే పక్కకు వెళ్లి BRS నేతలకు సమాచారం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

మెదక్, సిద్దిపేట జిల్లాల్లో కొంతమంది ఉద్యోగులు మంత్రి హరీష్ రావుకి పూర్తిగా మద్దతు ఇస్తున్నారని మైనంపల్లి ఆరోపించారు. తాము ఏ విషయం మాట్లాడినా ఆ వెంటనే సమాచారం హరీష్ రావుకు చేరుతోందని అన్నారు. బ్యాలెట్ ఓటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిందని.. దేశంలోనూ బ్యాలెట్ ఓటింగ్ ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

అయినప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా 62 శాతం సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందని మెదక్ జిలాల్లో 75 శాతం సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారని ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కడుతున్నారని మైనంపల్లి ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

 

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×