E-Paper
Advertisement

PM Modi in Jordan: జోర్డాన్ లో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. స్వయంగా కారు డ్రైవ్ చేసిన యువరాజు

PM Modi in Jordan: జోర్డాన్ లో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. స్వయంగా కారు డ్రైవ్ చేసిన యువరాజు
Advertisement

PM Modi in Jordan: ప్రధాని మోదీ జోర్డాన్ లో పర్యటిస్తున్నారు. అయితే ఇక్కడో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రధాని మోదీ ఓ కారులో ప్రయాణించారు. ఇందులో అంత స్పెషల్ ఏముందనుకుంటున్నారా? ఈ కారును డ్రైవ్ చేసింది జోర్డాన్ యువరాజు అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా. అందుకే ఈ రైడ్ చాలా స్పెషల్. జోర్డాన్‌లోని మ్యూజియానికి ప్రధాని మోదీని యువరాజు స్వయంగా కారులో తీసుకెళ్లారు. ఈ యువరాజు మరో స్పెషాలిటీ ఏంటంటే.. ప్రవక్త మొహమ్మద్ కుటుంబంలోని 42వ తరానికి ప్రత్యక్ష వారసుడు అల్ హుస్సేన్‌ బిన్ అబ్దుల్లా. అలాంటి వ్యక్తి మోదీని స్వయంగా రైడ్‌కు తీసుకెళ్లడం ఇప్పుడు ఓ సెన్సేషన్‌ను క్రియేట్ చేస్తుంది. అంతేకాదు ఇరు దేశాల మధ్య బంధం ఎంత బలంగా ఉందనే దానికి ఈ రైడ్ ఓ ఉదాహరణ మారింది.

రైడ్ స్పెషాలిటీస్ ఏంటంటే?

ఈ రైడ్‌కు రెండు స్పెషాలిటీస్ ఉన్నాయి. మోదీ విజిట్ చేసిన మ్యూజియం… జోర్డాన్‌లోని రాస్‌ అల్‌ ఐన్‌ జిల్లాలో ఉంది. ఇది దేశంలోనే అతి పెద్ద మ్యూజియం కాగా ఇందులో అత్యంత ముఖ్యమైన పురావస్తు, చారిత్రక కళాఖండాలు ఉంటాయి. అల్‌ హుస్సేన్ బిన్ అబ్దుల్లా జోర్డాన్ సింహాసనానికి వారసుడు. 2009 నుంచి దేశానికి యువరాజుగా ఉన్నారు. జోర్డాన్‌కు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు, ప్రాంతీయ వేదికలు ఆయనే నిర్వహిస్తున్నారు. క్రౌన్ ప్రిన్స్ హుస్సేన్ జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో చదివారు. యూకేలోని రాయల్ మిలిటరీ అకాడమీ శాండ్‌హర్స్ట్‌లో మిలటరీ ట్రైనింగ్ పొందారు.

Advertisement

ప్రధాని మోడీ జోర్డాన్‌లో పూర్తి స్థాయిలో పర్యటించడం ఇదే మొదటిసారి. 2018లో జోర్డాన్‌లో పర్యటించినప్పటికీ అది పూర్తి స్థాయి పర్యటన కాదనే చెప్పాలి. పాలస్తీనా నుంచి భారత్‌కు వస్తున్న సమయంలో జోర్డాన్‌లో పర్యటించారు మోదీ. కానీ ఇప్పుడు పూర్తిస్థాయిలో రెండు రోజుల పాటు జోర్డాన్‌లో పర్యటిస్తూ చర్చలు జరుపుతున్నారు.

Advertisement

Also Read: MGNREGA Name Change: ఉపాధి హామీ పేరు మార్పుపై భగ్గుమన్న కాంగ్రెస్.. పార్లమెంట్‌లో వినూత్న నిరసన, రేపు దేశవ్యాప్త ఆందోళన

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×