E-Paper
Advertisement

వందేభారత్ రైలులో షాకింగ్ ఘటన.. ఫుడ్ మానేసిన ప్రయాణికులు!

వందేభారత్ రైలులో షాకింగ్ ఘటన.. ఫుడ్ మానేసిన ప్రయాణికులు!
Advertisement

Vande Bharat Food Controversy:  ఇండియాలో ప్రీమియం రైళ్లుగా గుర్తింపు తెచ్చుకున్న వందేభారత్ రైళ్లలో అందించే ఫుడ్ విషయంలో ప్రయాణీకుల నుంచి తీవ్ర స్థాయిలో ఫిర్యాదులు వస్తున్నాయి. పెద్ద మొత్తంలో ఖర్చు చేసి వందేభారత్ లో ప్రయాణిస్తుంటే, అందులో అందించే ఫుడ్ అత్యంత దారుణంగా ఉందని ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ వందేభారత్ రైళ్లలో ప్రయాణీకులకు అందించిన ఫుడ్ లో ఏకంగా పురుగులు రావడంతో, కోచ్ లోని వాళ్లంతా ఫుడ్ తినడమే మానేశారు.

వందేభారత్ ఫుడ్ లో పురుగులు, రూ. 10 లక్షల జరిమానా

అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ ప్రెస్‌ లో ప్రయాణికుడికి అందించిన భోజనంలో పురుగు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే క్యాటరింగ్ సేవలపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) చర్యలు చేపట్టింది. సదరు క్యాటరింగ్ సంస్థపై రూ.10 లక్షల భారీ జరిమానా విధించింది.

సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

Advertisement

ఈ ఘటనకు సంబంధించి..  ప్రయాణికుడు తనకు వడ్డించిన ఆహారంలో పురుగు కనిపించిందని ఫోటోలు, వివరాలతో సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన కోచ్‌ లోనే ఇలాంటి ఘటనలు మరికొన్ని జరిగాయని, దీంతో ప్రయాణికులు భోజనం చేయడం మానేసారని  ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాసేపట్లోనే ఈ పోస్టు వైరల్ అవడంతో నెటిజన్లు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే ఫుడ్ క్వాలిటీ, పరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

క్షమాపణలు చెప్పిన IRCTC

Advertisement

ఈ ఘటనపై IRCTC స్పందించింది. జరిగిన ఘటనపై క్షమాపణలు చెప్పింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించింది. సదరు క్యాటరింగ్ సంస్థకు రూ.10 లక్షల జరిమానా విధించడమే కాకుండా, వారి కాంట్రాక్టును రద్దు చేసే ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు వెల్లడించింది. అంతేకాకుండా, ఫుడ్ తయారు చేసే కిచెన్ ను సీల్ చేసి, పూర్తిస్థాయి శుభ్రపరిచే చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.

రైల్వే ఫుడ్ మీద తీవ్ర చర్చ

ఈ ఘటనతో ప్రయాణికుల భద్రత, ఆహార నాణ్యతపై మరోసారి చర్చ మొదలైంది. చాలా మంది వినియోగదారులు రైల్వే మరింత కఠినంగా తనిఖీలు చేయాలని సూచించారు. ముఖ్యంగా, ఫుడ్ క్వాలిటీ, గడువు తేదీలు, పరిశుభ్రత లాంటి  అంశాలను పర్యవేక్షించడానికి ప్రత్యేక ఇన్‌స్పెక్టర్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. రైల్వే కేవలం సంఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందించడం కాకుండా, ముందుగానే నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. కొందరు రైలు ప్రయాణాల్లో బయట ఇచ్చే ఆహారం కంటే ఇంటి నుండి తీసుకెళ్లడం మంచిదన్నారు. మరికొందరు అవసరమైతే నమ్మకమైన ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా ఆర్డర్ చేసుకోవడం మంచిదంటున్నారు.

Read Also: అన్నవరం దగ్గర రైల్లో ప్రసవించిన గర్భిణీ, రైల్వే సిబ్బందిపై నెటిజన్ల ప్రశంసలు!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×