E-Paper
Advertisement

అడివి శేష్ ‘డెకాయిట్ ‘ సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతంటే?

అడివి శేష్ ‘డెకాయిట్ ‘ సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతంటే?
Advertisement

Dacoit Movie: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్(Adivi Sesh) చేసేది చాలా తక్కువ సినిమాలు అయినప్పటికీ ఈయన మాత్రం ఎంతో విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకు శేష్ నటించిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. వరుస హిట్ సినిమాలకు ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈయన త్వరలోనే డెకాయిట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీ తెలుగు హిందీ తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

‘డెకాయిట్ ‘ సెన్సార్ పూర్తి..

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు .ఇందులో భాగంగానే తాజాగా విడుదలైన టీజర్ సినిమా పట్ల భారీ అంచనాలను పెంచేసాయి. ఈ టీజర్ వీడియో పై టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ కూడా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేయడం సినిమాకు మరింత ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. విడుదలకు సిద్ధమైన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.

యాక్షన్ థ్రిల్లర్ గా డెకాయిట్…

Advertisement

సెన్సార్ బోర్డు ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ తో పాటు రన్ టైం కూడా ఖరారు చేశారు. ఈ సినిమా చూసినా అనంతరం సెన్సార్ సభ్యులు చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా 2:32 నిమిషాల నిడివిని ఖరారు చేశారు. యాక్షన్ థ్రిల్లర్ గా,ఉత్కంఠ భరితమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ కావడంతో మంచి ఆదరణ లభిస్తుంది. ఇక ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహించగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శేష్ జోడిగా మృణాళ్ ఠాకూర్ ..

Advertisement

ఇక ఈ సినిమాకు బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.ఈ సినిమాలో నటుడు సునీల్, ప్రకాష్ రాజ్ బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ వంటి తదితరులు కీలకపాత్రలలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో శేష్ జోడిగా మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur)హీరోయిన్ గా నటించారు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఏ విధమైనటువంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాలి అంటే ఏప్రిల్ 10వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే. అడివి శేష్ మేజర్ సినిమా తరువాత పలు సినిమాలలో క్యామియో పాత్రలలో నటించారు కానీ పూర్తిస్థాయి హీరోగా నటించిన చిత్రం డెకాయిట్ కావటం విశేషం.

Also Read: ప్రదీప్ రంగనాథన్ ‘లైక్’ సెన్సార్ పూర్తి… రన్ టైం డీటెయిల్స్ ఇవే!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×