E-Paper
Advertisement

Vande Bharat Train Sleeper: వందేభారత్ స్లీపర్ లో బ్లాంకెట్స్ కు కవర్లు, ఇక ఈజీగా ఉతికేయొచ్చు!

Vande Bharat Train Sleeper: వందేభారత్ స్లీపర్ లో బ్లాంకెట్స్ కు కవర్లు, ఇక ఈజీగా ఉతికేయొచ్చు!
Advertisement

Vande Bharat Sleeper Removable Blankets: సుదూర రాత్రి ప్రయాణాల కోసం రూపొందించిన వందేభారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వచ్చింది. గత వందే భారత్ సేవల మాదిరిగా కాకుండా,  ఇందులో పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ స్లీపర్ బెర్త్‌ లను తీసుకొచ్చారు. అత్యంత వేగం, లేటెస్ట్ డిజైన్, సాంకేతికతను సాంప్రదాయ రాత్రి రైళ్ల పరేషన్స్ తో మిళితం చేస్తుంది. రాత్రిపూట రైలు ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా చేయాలనే లక్ష్యంలో భాగంగా వీటిని ప్రారంభించారు. ఇక ఈ రైల్లో ప్రయాణీకులకు చక్కటి బ్లాంకెట్స్ అందిస్తున్నారు. ఈజీగా తొలగించే దుప్పటి కవర్లను అందిస్తున్నారు. తాజాగా ఈ రైల్లోని దుప్పట్లకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈజీగా తొలగించే బ్లాంకెట్ కవర్స్

సుకాంత్ షా అనే వ్లాగర్ షేర్ చేసిన ఈ వీడియోలో .. వందేభారత్ స్లీపర్ రైల్లోని దుప్పట్ల గురించి వివరించాడు. ఇది సాధారణ రైల్లో ఉండే దుప్పట్లతో పోల్చితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. దీనికి బ్లూ, గ్రీన్ డిజైన్ ను కలిగి ఉన్నాయి. దుప్పట్లను వాష్ చేయడంలో ఇబ్బంది లేకుండా భారతీయ రైల్వే దుప్పటి కవర్లను అందిస్తున్నట్లు వివరించాడు. ఈ దుప్పటి కవర్ల మీద నార్తర్న్ ఫ్రాంటియర్ రైల్వే (NFR) అధికారిక లోగోను ప్రింట్ చేసినట్లు వెల్లడించాడు. ఈ దుప్పటి కవర్లు తొలగించేలా ఉన్నాయి. వేర్వేరు ప్రయాణీకులకు ఇవ్వడానికి ముందు మార్చుకోవడానికి, శుభ్రపరచడానికి వీలు కల్పిస్తాయి. వందే భారత్ ప్రయాణీకుల కోసం ప్రీమియం లినెన్ కిట్‌లో భాగంగా వీటిని అందిస్తున్నట్లు చెప్పాడు. ఈ కిట్ లో కవర్‌తో కూడిన దిండు, బెడ్‌ షీట్, హ్యాండ్ టవల్ కూడా ఉన్నాయని వివరించాడు.

Advertisement

వందే భారత్ స్లీపర్ రైలు గురించి..  

వందేభారత్ స్లీపర్ రైలు 1A, 2A, 3A కోచ్‌లతో పూర్తిగా ఏసీ స్లీపర్ కోచ్ లను కలిగి ఉంటుంది. రాత్రిపూట మెరుగైన సౌకర్యం కోసం రూపొందించబడిన ఆధునిక, కుషన్డ్ బెర్త్‌ లు ఉన్నాయి. సాంప్రదాయ స్లీపర్ రైళ్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. తక్కువ శబ్దం వచ్చేలా ఆటోమేటిక్ డోర్లు, సీలు చేసిన గ్యాంగ్‌వేలు ఉన్నాయి. బయో వాక్యూమ్ టాయిలెట్లు, మెరుగైన పరిశుభ్రత ప్రమాణాలు ఉన్నాయి. ఛార్జింగ్ పాయింట్లు, రీడింగ్ లైట్లు, డిజిటల్ సమాచార ప్రదర్శనలు, CCTV నిఘా, మెరుగైన భద్రతా వ్యవస్థలు ఉన్నాయి. టికెట్ ధరలో ఆన్‌ బోర్డ్ క్యాటరింగ్ సౌకర్యం ఉంటుంది.

వందే భారత్ స్లీపర్ ఛార్జీలు

Advertisement

వందే భారత్ స్లీపర్ ఛార్జీలు రాజధాని, మెయిల్, ఎక్స్‌ ప్రెస్ స్లీపర్ రైళ్ల కంటే ఎక్కువగా ఉంటాయి.  టికెట్ ధరలో సాధారణంగా భోజనం, ఆన్‌ బోర్డ్ సేవలు ఉంటాయి. కన్ఫార్మ్ టికెట్లు మాత్రమే అందిస్తాయి. AC సౌకర్యం లేదు. ఖరీదైనది అయినప్పటికీ, వేగం, సౌకర్యం, మరింత ఆధునిక రాత్రిపూట ప్రయాణ అనుభవం కోసం ఎక్కువ డబ్బులు చెల్లించడానికి ప్రయాణీకులు ఏమాత్రం వెనుకాడ్డం లేదు. మొత్తంగా వందేభారత్ స్లీపర్ రైలు భారతీయ రైల్వేలో సరికొత్త మైలు రాయిగా నిలిచింది.

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×