E-Paper
Advertisement

Sankranthi Movies: టైర్ 1 హీరోలను వెంటాడుతున్న ఉన్న సంక్రాంతి సెంటిమెంట్.. రిలీజ్ చేస్తే డిజాస్టర్ వైపే..!

Sankranthi Movies: టైర్ 1 హీరోలను వెంటాడుతున్న ఉన్న సంక్రాంతి సెంటిమెంట్.. రిలీజ్ చేస్తే డిజాస్టర్ వైపే..!
Advertisement

Sankranthi Movies: సంక్రాంతి అంటే టాలీవుడ్‌కు ఒకప్పుడు బంగారు పండుగ. పెద్ద హీరోల సినిమాలు ఈ పండుగకు వస్తే విజయమేనని అందరూ నమ్మేవారు. కానీ గత మూడు సంవత్సరాలుగా ఆ నమ్మకం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు సంక్రాంతి అంటేనే టాప్ హీరోలకు భయం మొదలైంది.

మహేష్ బాబు తో మొదలైన సెంటిమెంట్..!

2024లో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతికి విడుదలైంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కథ, స్క్రీన్‌ప్లే బలహీనంగా ఉండటంతో సినిమా ఫ్లాప్‌గా మారింది. దీంతో నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చాయి.

Advertisement

తర్వాత 2025లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ చేంజెర్ వచ్చింది. ఇది పాన్ ఇండియా స్థాయిలో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. కానీ సినిమా విడుదలైన తర్వాత మెగా అభిమానులే అసంతృప్తి వ్యక్తం చేశారు. అతి హైప్, బలహీనమైన కథ కారణంగా ఈ సినిమా కూడా పెద్ద డిజాస్టర్ అయింది.

ఈ సంవత్సరం కూడా అదే సంగతి..!

ఇప్పుడు 2026లో ప్రభాస్ నటించిన ది రాజా సాబ్..
పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ కూడా దాటలేకపోతోంది. నిర్మాతలకు 100 నుంచి 150 కోట్ల వరకు నష్టాలు వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

ఇలా వరుసగా మూడు సంవత్సరాలు టియర్-1 హీరోల సినిమాలు సంక్రాంతికి ఫ్లాప్ కావడంతో, ఇప్పుడు పెద్ద హీరోలు ఈ సీజన్‌కు రావాలంటే రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఒక తప్పు సినిమా వస్తే కేవలం కలెక్షన్లకే కాదు, హీరో బ్రాండ్ విలువకూ నష్టం జరుగుతోంది.

అయితే సంక్రాంతి పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పలేం. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ లాంటి వారు కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని, కంట్రోల్ బడ్జెట్‌తో సినిమాలు చేస్తే ఇంకా ఈ సీజన్‌లో సేఫ్‌గా ఉన్నారు. అలాగే మధ్యస్థ హీరోల సినిమాలు కూడా మంచి కంటెంట్‌తో వస్తే హిట్లు అవుతున్నాయి.

ఇవన్నీ చూసిన తర్వాత ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇకపై సంక్రాంతి విజయాన్ని కేవలం స్టార్ ఇమేజ్‌తో సాధించలేం. మంచి కథ, సరైన దర్శకుడు, ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉంటేనే విజయం సాధ్యం. ఈ పాఠాన్ని టాలీవుడ్ పెద్ద హీరోలు ఇప్పుడిప్పుడే బాగా అర్థం చేసుకుంటున్నారు.

ALSO READ: Karate Kalyani: కరాటే కళ్యాణి పై దాడి యత్నం..పోలీసుల ముందే దాడి చేసిన నిందితులు

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×