E-Paper
Advertisement

Viral Video: రైలులో సీటు కోసం గొడవ.. ఈ ఆంటీకి ఆస్కార్ ఇవ్వాల్సిందే, చివరిలో మిస్ కావద్దు!

Viral Video: రైలులో సీటు కోసం గొడవ.. ఈ ఆంటీకి ఆస్కార్ ఇవ్వాల్సిందే, చివరిలో మిస్ కావద్దు!
Advertisement

భారతీయ రైల్వే ద్వారా నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం, ఆహ్లాదకరంగా ప్రయాణించే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా మంది రైల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతారు. అయితే, కొన్ని రైళ్లలో రకరకాల కారణాలతో గొడవలు జరుగుతుంటాయి. వీటిలో ఎక్కువగా సీట్లు సంబంధించిన పంచాయితీలే ఉంటాయి. కొన్ని ఫుడ్ క్వాలిటీ గుర్తించి కొట్లాటలు కూడా చూశాం. తాజాగా రైల్లో తల్లీ కూతురు చేసిన హంగామాకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

రీసెంట్ గా ఓ తల్లీ కూతురు రైలు ఎక్కారు. వారిద్దరికి స్లీపర్ క్లాస్ లో లోయర్ బెర్తులు ఉన్నాయి. కానీ, ఆ అమ్మాయి తల్లి, వేరొక ప్రయాణీకుడికి సంబంధించిన మిడిల్ బెర్త్ లో కూర్చుంది. కాసేపు ఫర్వాలేదు అని అసలు సీటు కలిగిన వ్యక్తి అనుకున్నాడు. అయితే, కాసేపటి తర్వాత తన బిడ్డ కూర్చోవడానికి వీలుగా సీటు ఖాళీ చేయమని కోరాడు. అసలు స్టోరీ అప్పుడే మొదలయ్యింది. సీటు ఇవ్వనంటూ మొండికేసింది. తాను మిడిల్ బెర్త్ లోనే కూర్చుంటానని చెప్పింది.

టీసీకి విషయం చెప్పిన ప్రయాణీకుడు

Advertisement

తన సీటు ఆక్రమించుకుని, తల్లీ బిడ్డ కలిసి తననే బెదిరిస్తున్నరని సదరు ప్రయాణీకుడు టీసీకి ఫిర్యాదు చేశాడు. వెంటనే అక్కడికి చేరుకున్న టీసీ సీటు ఇవ్వాలని ఆమెకు సూచించాడు. కానీ, ఆమె ఇచ్చేది లేదంటూ పెద్ద సీన్ క్రియేట్ చేసింది. తల్లీ బిడ్డ కలిసి సదరు ప్రయాణీకుడి మీదికి దూసుకెళ్లారు. చివరకు ఇద్దరూ కలిసి ఆ ప్రయాణీకుడి మీద చేయి చేసుకున్నారు. చెంపదెబ్బ కొట్టారు. సదరు ప్రయాణీకుడు ఆమెను నెట్టివేయడంతో సదరు తల్లి ఆస్కార్ లేవెల్ లో యాక్టింగ్ చేసింది. ప్రాణాలు పోతున్నట్లు యాక్టింగ్ చేసింది.  చివరకు వారి పోరు తట్టుకోలేక, ముండన్ వేడుక(కేశాఖండన వేడుక) కోసం హరిద్వార్ కు వెళ్తున్న సదరు ప్రయాణీకుడు మధ్యలోనే దిగిపోయాడు.

నెట్టింట వీడియో వైరల్, స్పందించిన రైల్వే

Advertisement

అటు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసి నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. కేటాయించిన సీటులో కాకుండా ఇతరల సీట్లో కూర్చోవడమే కాకుండా, వారి మీద దౌర్జన్యం చేయడం నిజంగా దారుణం అంటున్నారు. కామన్ సెన్స్ లేని ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. భారత్ లో రూల్స్ ను గౌరవించడం మానేసి, బల ప్రయోగం ద్వారా ఏదైనా సాధించేద్దాం అనే ఆలోచనలో కొంత మంది ఉన్నారని, అలాంటి వారికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడాలన్నారు. అటు ఈ ఘటనపై రైల్వే స్పందించింది.  RPF,  విజయవాడ డివిజన్, దక్షిణ మధ్య రైల్వే, GRPతో పాటు విజయవాడ, గుంతకల్ కంట్రోల్‌ లోని ఇన్‌స్పెక్టర్లకు సమాచారం అందించింది.  ఆ రైలును గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

Read Also: ఇండియన్ రైల్వేపై LPG ఎఫెక్ట్, క్యాటరింగ్ సేవలు బంద్?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×