E-Paper
Advertisement

బీచ్ లవర్స్ కోసం పాండిచ్చేరి స్పెషల్.. బడ్జెట్, బ్యూటీ కలగలిపిన 5 హాట్‌స్పాట్స్!

బీచ్ లవర్స్ కోసం పాండిచ్చేరి స్పెషల్.. బడ్జెట్, బ్యూటీ కలగలిపిన 5 హాట్‌స్పాట్స్!
Advertisement

Top 5 beaches in Pondicherry: సముద్రపు చల్లటి గాలి, ఉరికే అలల హోరు, పక్కనే ఫ్రెంచ్ కాలనీల వైబ్స్.. వీకెండ్ దొరికితే చాలు మైండ్ రిఫ్రెష్ చేసుకోవడానికి పాండిచ్చేరి పర్ఫెక్ట్ డెస్టినేషన్! ఫ్రెండ్స్‌తో పిచ్చిగా ఎంజాయ్ చేయాలన్నా, లేదా పార్ట్‌నర్‌తో కలసి సన్‌సెట్ చూస్తూ ప్రశాంతంగా గడపాలన్నా ఇక్కడి బీచ్‌లు సూపర్ ఆప్షన్. బీచ్ లవర్స్ అందరినీ కట్టిపడేసేలా ఉండే పాండిచ్చేరిలోని టాప్ 5 బీచ్‌లు ఏంటో, అక్కడ ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ దొరుకుతుందో ఇప్పుడు చూద్దాం!

1. ప్రోమినేడ్ బీచ్ (Promenade Beach):

పాండిచ్చేరి హార్ట్ లాంటిది ఈ ‘ప్రోమినేడ్ బీచ్’. దీనిని రాక్ బీచ్ అని కూడా పిలుస్తారు. సముద్రం ఒడ్డున నల్లటి రాళ్లతో ఉండే ఈ బీచ్‌ పొడవునా నడవడం ఒక వేరే లెవల్ ఫీల్ ఇస్తుంది. సాయంత్రం వేళల్లో ఇక్కడ వెహికిల్స్ అనుమతించరు, కాబట్టి ప్రశాంతంగా వాకింగ్ చేస్తూ కాఫీ తాగడం లేదా వేడి వేడి స్నాక్స్ తింటూ అలలను చూడటం ఇక్కడి ప్రత్యేకత.

Advertisement

హైలైట్: రాక్ వాక్, మహాత్మా గాంధీ విగ్రహం, ఫ్రెంచ్ కేఫ్‌లు.

2. ప్యారడైజ్ బీచ్ (Paradise Beach):

పేరుకు తగ్గట్టే ఇది నిజంగానే ఒక ‘స్వర్గం’! ఈ బీచ్‌కి వెళ్లాలంటే చుట్టూ మ్యాంగ్రోవ్ అడవుల గుండా బోట్ రైడ్ చేయాల్సి ఉంటుంది. పసుపు పచ్చని ఇసుక దిబ్బలు, స్వచ్ఛమైన నీటితో ఈ బీచ్ ఎంతో అందంగా కనిపిస్తుంది. సిటీ రద్దీకి దూరంగా ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఇది బెస్ట్ స్పాట్.

Advertisement

హైలైట్: చున్నంబార్ బోట్ హౌస్ నుంచి బోట్ రైడ్, వాటర్ స్పోర్ట్స్, బీచ్ వాలీబాల్.

3. సెరెనిటీ బీచ్ (Serenity Beach):

అడ్వెంచర్, సర్ఫింగ్ అంటే.. ఇష్టమున్న కుర్రాళ్లకు ‘సెరెనిటీ బీచ్’ ఒక పారడైజ్. ఇక్కడ సముద్రపు అలలు కాస్త బలంగా వస్తాయి. అందుకే సర్ఫింగ్ నేర్చుకోవడానికి, చేయడానికి దేశ విదేశాల నుంచి టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. ఉదయాన్నే ఇక్కడ సూర్యోదయం చూడటం, ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు దిగడం క్రేజీగా ఉంటుంది.

హైలైట్: సర్ఫింగ్ స్కూల్స్, సన్‌రైజ్ వ్యూ, ప్రశాంతమైన వాతావరణం.

4. ఆరోవిల్ బీచ్ (Auroville Beach):

ఆరోవిల్ ఆశ్రమానికి సమీపంలో ఉండే ఈ బీచ్ తన సహజత్వానికి, ప్రశాంతతకు పేరుగాంచింది. ఈ బీచ్‌లో రద్దీ చాలా తక్కువగా ఉంటుంది. ఇసుక తిన్నెలపై కూర్చొని సముద్రపు అలల శబ్దం వింటూ మెడిటేషన్ చేసుకోవడానికి లేదా మైండ్ రిలాక్స్ చేయడానికి ఇది చాలా బెస్ట్ ప్లేస్.

హైలైట్: సీ షెల్స్ (సముద్రపు గుల్లలు) ఏరుకోవడం, సూర్యాస్తమయం, ప్రశాంతమైన వాతావరణం.

Also Read: రూ.10వేలలోపే యూరప్ వైబ్స్! ఇండియాలోని ఈ ప్లేస్‌లు అస్సలు మిస్ అవ్వొద్దు!

5. వీరపట్టినం బీచ్ (Veerampattinam Beach):

పాండిచ్చేరిలోని అతిపెద్ద తీరప్రాంత గ్రామాల్లో ఒకటైన వీరపట్టినంలో ఉన్న ఈ బీచ్ ఇంకా ఎక్కువ మందికి తెలియని ఒక ‘హిడెన్ జెమ్’. స్థానిక జాలరుల జీవన విధానం, సాంప్రదాయ పడవలు, విశాలమైన ఖాళీ తీరం ఇక్కడ కనిపిస్తాయి. నిశ్శబ్దంగా, ప్రకృతికి దగ్గరగా సమయం గడపాలనుకునే వారికి ఇది బెస్ట్.

హైలైట్: నాటు పడవలు, విలేజ్ వైబ్స్, తక్కువ రద్దీ.

డెయిలీ రొటీన్ లైఫ్, ఆఫీస్ స్ట్రెస్ నుంచి బ్రేక్ తీసుకుని మైండ్ రిఫ్రెష్ చేసుకోవాలనుకుంటే.. పాండిచ్చేరి ట్రిప్ ప్లాన్ చేయండి. ఈ 5 బీచ్‌లలో గడిపే ప్రతి నిమిషం మీ జీవితంలో ఒక తీపి గుర్తుగా మిగిలిపోతుంది.

Tags

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×