E-Paper
Advertisement

30 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ‘ఆపద్బాంధవుడు’ హీరోయిన్!

30 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ‘ఆపద్బాంధవుడు’ హీరోయిన్!
Advertisement

Meenakshi Seshadri Returns: మీనాక్షి శేషాద్రి..90ల నాటి వెండితెర డ్రీమ్ గర్ల్.తన అభినయంతోనూ అందంతోనూ కోట్లాది మంది అభిమానులని సంపాదించుకున్నఈ సీనియర్ నటి మళ్ళీ మోహానికి రంగు వేసుకోనుందట.అవును..ప్రస్తుతం 62 ఏళ్ల వయసున్న ఈ వెటరన్ భామ దాదాపు ముపై ఏళ్ల తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న వార్త ఇపుడు సోషల్ మీడియాలో హట్ న్యూస్ అయిపొయింది.

‘నానావతి వర్సెస్ నానావతి’ అనే  వెబ్ సిరీస్ ద్వారా

Advertisement

అయితే మీనాక్షి ఎంట్రీ ఈ సారి సినిమా ద్వారా కాకుండా ఒక వెబ్ సిరీస్ ద్వారా జరుగుతుండటం ఇక్కడ విశేషం. అవును.. ‘నానావతి వర్సెస్ నానావతి’ అనే ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుందట మీనాక్షి.

also read :ఒకే హీరోకి కూతురిగా, లవర్‌గా, తల్లిగా నటించిన సీనియర్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Advertisement

ఈ అలనాటి అందాల భామ విషయానికి వస్తే 1983లో వచ్చిన ‘హీరో’ సినిమాతో వెండితెరకు పరిచయమైన మీనాక్షి శేషాద్రి, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.ఒక రకంగా 1980, 90ల కాలంలో దామోదర్, ఘాతక్, ఘాయల్, శహన్‌షా వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలతో హిందీ చిత్రసీమను ఒక ఊపు ఊపిందనే చెప్పాలి.

1992 అక్టోబర్ 9న విడుదలైన ‘ఆపద్బాంధవుడు’ 

ముఖ్యంగా 1993లో వచ్చిన ‘దామిని’ సినిమాలో ఆమె నటన ఇప్పటికీ ఎవర్ గ్రీన్.అలా అని కేవలం బాలీవుడ్ లోనే కాదండోయ్ ..టాలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేసింది ఈ అందాల భామ. అలా మెగాస్టార్ చిరంజీవితో కలిసి 1992 అక్టోబర్ 9న విడుదలైన ‘ఆపద్బాంధవుడు’ చిత్రంలో ఆమె నటించిన తీరుని ఇప్పటికీ ఎంతో మంది ప్రశంసిస్తూ ఉంటారు కూడా.

also read :నన్ను ఒంటరిగా హోటల్ రూమ్‌కు రమ్మన్నారు.. సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్

కళా తపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా మీనాక్షి కెరీర్ లో ఒక స్పెషల్ ఫిలిమ్ అనే చెప్పాలి. అయితే అంతకుముందే 1988లో నాగార్జున సరసన ‘ఆఖరి పోరాటం’ మూవీలో కూడా నటించి మెప్పించింది మీనాక్షి.

చివరి సినిమాగా 1996లో వచ్చిన ‘ఘాతక్’

అయితే అలా వారు సినిమాలతో బిజీగా ఉన్నా మీనాక్షి 1995లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ హరీష్ మైసూర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని సినిమా రంగానికి గుడ్ బై చెప్పడం గమనార్హం.ఇక చివరిగా ఆమెనటించిన చివరి సినిమాగా 1996లో వచ్చిన ‘ఘాతక్’ నిలిచిపోయింది. ఆ తర్వాత భర్తతో కలిసి యూఎస్‌లోని టెక్సాస్‌కు వెళ్లిపోయిన మీనాక్షి, అక్కడ ‘చేతనా డ్యాన్స్ అకాడమీ’ స్థాపించి భరతనాట్యం, కథక్, కూచిపూడి వంటి భారతీయ సాంప్రదాయ నృత్యాలను విదేశీయులకు నేర్పిస్తూ కాలం గడిపారు. అయితే పిల్లలు పెద్దవారై పోవడంతో నటనపై ఇష్టాన్ని చంపుకోలేక మళ్ళీ ఇలా ఎంట్రీ ఇస్తుందన్న మాట.

చూడాలి మరి ఓటీటీ కంటెంట్‌ రాజ్యమేలుతున్న ఈ రోజులల్లో ‘నానావతి వర్సెస్ నానావతి’తో మీనాక్షి ఎలాంటి సంచలనం స్ప్రుష్టిస్తుందో !

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×