E-Paper
Advertisement

వీధులను ముంచెత్తిన బీరు వరద.. ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిన ఘటన గురించి మీకు తెలుసా?

వీధులను ముంచెత్తిన బీరు వరద.. ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిన ఘటన గురించి మీకు తెలుసా?
Advertisement

London Beer Flood 1814: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వింత ఘటనలు జరిగాయి. వాటిలో ఒకటి బీరు వరద. ఏకంగా ఓ నగరంలో వీధులన్నీ బీరుతో నిండిపోయాయని చెబితే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ, ఇది ముమ్మాటికీ నిజం. 1814లో ఇంగ్లాండ్ రాజధాని లండన్‌ లో ఈ ఘటన జరగింది. అంతేకాదు, చరిత్రలో ‘లండన్ బీర్ ఫ్లడ్’గా గుర్తింపు పొందింది. ఈ ఘటనలో ఏకంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతకీ అసలు ఈ ఘటన ఎలా జరిగిందంటే..

1814లో ఏం జరిగింది?

లండన్‌లో మిక్స్ అండ్ కంపెనీ అనే ప్రముఖ మద్యం కంపెనీ ఉంది. అక్కడ పెద్ద మొత్తంలో బీరును తయారు చేసి, దాదాపు 22 అడుగుల ఎత్తున్న పెద్ద చెక్క డబ్బాల్లో నిల్వ చేసేవారు. ఒక్కో డబ్బాలో లక్షల లీటర్ల బీరు నిల్వ ఉండేది. 1814 అక్టోబర్ 17న ఆ బ్రూవరీలో ప్రమాదం జరిగింది. అనుకోకుండా ఒక భారీ చెక్క డబ్బాపై ఉన్న ఇనుప రింగ్ ఊడిపోవడంతో ఒత్తిడి ఒక్కసారిగా పెరిగింది. కొద్ది సేపటికే ఆ డబ్బా పేలిపోయింది. దాని ప్రభావం పక్కనే ఉన్న మరికొన్ని భారీ నిల్వ డబ్బాలపైనా పడింది. అవి కూడా వరుసగా పగిలిపోయాయి.

బీర్ల వరదలో మునిగి 8 మంది మృతి

Advertisement

ఈ ప్రమాదంతో ఒకేసారి దాదాపు 3,20,000 గ్యాలన్లకు పైగా, అంటే సుమారు 1.47 మిలియన్ లీటర్ల బీరు బయటకు వచ్చేసింది. అంత భారీ పరిమాణంలో బీరు ఒక్కసారిగా బయటకు రావడంతో వరదలా వీధుల వైపు దూసుకెళ్లింది. రోడ్లన్నీ బీరుతో నిండిపోయాయి. బీరు ప్రవాహం చాలా వేగంగా రావడంతో సమీపంలోని పేదవారి ఇళ్లపై తీవ్ర ప్రభావం పడింది. కొన్ని ఇళ్ల గోడలు కూలిపోయాయి. ఇళ్లలో ఉన్న వారికి తప్పించుకునే అవకాశం కూడా దక్కలేదు. ఈ విషాద ఘటనలో మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు, సహాయక బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించాయి.  అయితే, అప్పటికే పెద్ద మొత్తంలో నష్టం జరిగింది.

బ్రూవరీల భద్రత కోసం ప్రత్యేక చర్యలు

ఈ ఘటన తర్వాత బ్రూవరీల భద్రతపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. భారీ నిల్వ ట్యాంకుల నిర్మాణం, వాటి బలం, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం లాంటి అంశాలపై అధికారులు కొత్త నిబంధనలను తీసుకొచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం మాత్రమే కాకుండా బ్రూవరీకి కూడా భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. లక్షల లీటర్ల బీరు వృథా కావడంతో పాటు, భవనాలు, నిల్వ వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత సంస్థ తిరిగి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. చరిత్రలో ఎన్నో విచిత్రమైన ప్రమాదాలు జరిగినా, వీధుల్లో నీటికి బదులుగా బీరు వరదలా పారడం మాత్రం అత్యంత అరుదైన సంఘటనగా నిలిచిపోయింది.

Advertisement

Read Also: పక్షులతో యుద్ధం చేసి ఓడిపోయిన దేశం.. ఈ ఆసక్తికర చరిత్ర మీకు తెలుసా?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×