E-Paper
Advertisement

వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా.. హైదరాబాద్ వాసులకు అదిరిపోయే కొత్త ప్యాకేజీ..!

వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా.. హైదరాబాద్ వాసులకు అదిరిపోయే కొత్త ప్యాకేజీ..!
Advertisement

Telangana Tourism: తెలంగాణ పర్యాటక శాఖ ఒక కొత్త ఒక రోజు యాత్రా, పర్యావరణ పర్యటన ప్యాకేజీని ప్రారంభించబోతుంది. ఈ పర్యటన ఈనెల 7నుండి ప్రారంభమై, ప్రతి శుక్రవారం నిర్వహించబడుతుంది.హైదరాబాద్ – చిల్కూర్ బాలాజీ ఆలయం – ఎక్స్‌పీరియం ఎకో పార్క్ – కొత్తవాల్‌గూడ ఎకో టూరిజం పార్క్ – హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (టీజీటీడీసీ), చిల్కూర్ బాలాజీ ఆలయం, రమణీయమైన ఎక్స్‌పీరియం ఎకో పార్క్, మరియు కొత్తగా అభివృద్ధి చేసిన కొత్తవాల్‌గూడ ఎకో టూరిజం పార్క్‌లను కలుపుకొని కొత్తగా ఒకరోజు యాత్రా,పర్యావరణ పర్యటన ప్యాకేజీని ప్రవేశపెడుతున్నది.

ప్రత్యేక ప్యాకేజీ..

ఆధ్యాత్మికత, ప్రకృతి, వినోదం,కుటుంబానికి అనువైన అనుభవాల యొక్క పరిపూర్ణ సమ్మేళనాన్ని సందర్శకులకు అందించడానికి ఈ ప్యాకేజీ ప్రత్యేకంగా రూపొందించింది. ఇది హైదరాబాద్ నుంచి వారాంతపు విహారానికి ఒక ఆదర్శవంతమైన యాత్రగా నిలుస్తుంది.

Advertisement

Alao Read: గల్ఫ్ యుద్ధంతో పాకిస్తాన్ బిజినెస్.. శాంతి కబుర్ల పేరుతో ఆయుధాలు అమ్ముతున్న పాక్!

యాత్ర షెడ్యూల్..

ఉదయం 7గంటలకు – సికింద్రాబాద్‌లోని యాత్రినివాస్ నుంచి బయలుదేరుతుంది. ఉదయం 7:15 గంటలకు – బేగంపేట్‌లోని పర్యాటక భవన్ నుంచి, 7:30గంటలకు – బషీర్‌బాగ్‌లోని సీఆర్ఓ నుంచి, 8గంటలకు తారామతి బారాదరిలో అల్పాహారం, 9 గంటలకు చిల్కూర్ బాలాజీ ఆలయంలో దర్శనం, 11:30 గంటలకు – ఎక్స్‌పీరియం ఎకో పార్క్ సందర్శన, మధ్యాహ్నం 2గంటలకు శాకాహార భోజనం, మధ్యాహ్నం 3:30 గంటలకు కొత్తవాల్‌గూడ ఎకో టూరిజం పార్క్ సందర్శన, సాయంత్రం 5:30 గంటలకు హై-టీ, రాత్రి7 గంటలకు బషీర్‌బాగ్‌లోని సీఆర్ఓ కి చేరుట ఈ యాత్ర సౌకర్యవంతమైన మినీ ఎయిర్-కండిషన్డ్ వాహనంలో నిర్వహించబడుతుంది.

ధరలు..

Advertisement

ప్యాకేజీలో ఇవి.. రానుపోను ఏసీ రవాణా అల్పాహారం శాకాహార భోజనం హై-టీ ఎక్స్పీరియం ఎకో పార్క్ ప్రవేశ టిక్కెట్లు కొత్తవాల్‌గూడ ఎకో టూరిజం పార్క్ ప్రవేశ టిక్కెట్లు టోల్, పార్కింగ్ ఛార్జీలు అనుభవజ్ఞుడైన టూర్ గైడ్ సేవలు
ప్యాకేజీ టారిఫ్: పెద్దలకు ఒక్కొక్కరికి రూ.2,100, పిల్లలకు ఒక్కొక్కరికి రూ.1,800గా అధికారులు నిర్ణయించారు. బుకింగ్‌లు ,మరిన్ని వివరాల కోసం, దయచేసి సమీపంలోని తెలంగాణ టూరిజం బుకింగ్ ఆఫీస్‌ను 9848126947, 9848125720, 9848306435, https://tgtdc.in/package/Chilkur-Experium-Kothwalguda లో బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Also read: ఎర్రబస్సు రాదన్న చోటకు ఎయిర్‌పోర్ట్.. చంద్రబాబు మాస్ కౌంటర్

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×