E-Paper
Advertisement

క్షణాల్లో తత్కాల్ టిక్కెట్ బుకింగ్, కటకటాల్లోకి సూపర్ యాప్ క్రియేటర్!

క్షణాల్లో తత్కాల్ టిక్కెట్ బుకింగ్, కటకటాల్లోకి సూపర్ యాప్ క్రియేటర్!
Advertisement

Super Tatkal Controversy: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్. అత్యవసర ప్రయాణాల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ టిక్కెట్లను బుక్ చేయాలంటే తల ప్రాణం తోకకు రావడం ఖాయం. బుకింగ్ విండో ఓపెన్ అయిన క్షణాల్లో టిక్కెట్లు అయిపోతాయి. అయితే, ఈ టిక్కెట్ల బుకింగ్ వెనుక పెద్ద స్కామ్ ఉందని వినియోగదారులు ఆరోపిస్తుంటారు. అయితే, కేరళలోని కోజికోడ్ కు చెందిన యువ కోడర్ ఎస్ యువరాజా.. ఈజీగా తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకునే ఓ యాప్ క్రియేట్ చేశాడు. దాని పేరు సూపర్ తత్కాల్. ఈ యాప్ ద్వారా ప్రయత్నిస్తే క్షణాల్లో తత్కాల్ టిక్కెట్లు బుక్ అవుతాయి. అయితే, ఈ యాప్ క్రియేట్ చేసినందుకు రైల్వే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

రైల్వే చట్టాన్ని ఉల్లంఘిస్తూ, IRCTC బుకింగ్ వ్యవస్థను మిస్ లీడ్ చేస్తూ, చట్టవిరుద్ధమైన సాఫ్ట్‌ వేర్ ను  ఉపయోగించినందుకు ఈ ఐఐటీ ఖరగ్ పూర్ విద్యార్థిని అరెస్ట్ చేశారు. అంతేకాదు, అతడు తయారు చేసిన సూపర్ తత్కాల్ యాప్‌ను నిషేధించారు. గూగుల్ ప్లే స్టోర్ లోని సూపర్ తత్కాల్, సూపర్ తత్కాల్ ప్రో యాప్ ల సర్వీసులను నిలిపివేశారు. యువరాజా తయారు చేసిన ఈ యాప్స్ సాధారణ వినియోగదారుల కంటే వేగంగా తత్కాల్ టిక్కెట్లను పొందేందుకు సాయపడుతాయి. టిక్కెట్ బుకింగ్ ప్రక్రియను ఆటోమేటిక్ గా మార్చి ఈజీగా బుక్ అయ్యేలా చేస్తాయి. సాధారణంగా తత్కాల్ టిక్కెట్స్ బుకింగ్ విండో ఓపెన్ అయిన తర్వాత ప్రయాణీకుల వివరాలను ఫిల్ చేసే లోగా టిక్కెట్లు బుక్ అయిపోతాయి. అయితే, ఇతడు తయారు చేసిన యాప్ లో ఆటో ఫిల్ కారణంగా ఈజీగా వివరాలన్నీ నింపబడుతాయి. ఆ తర్వాత పేమెంట్ చేసి వెంటనే బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే, చట్ట విరుద్ధమైన సాఫ్ట్ వేర్ ద్వారా టిక్కెట్లు బుక్ చేస్తున్నారంటూ అతడిని అరెస్ట్ చేశారు.

సూపర్ తత్కాల్ నిషేధానికి కీలకమైన కారణాలు

Advertisement

⦿ IRCTC వ్యవస్థను తప్పుదారి పట్టించడం: సూపర్ తత్కాల్ యాప్  అనేది సాధారణ వినియోగదారు పరిమితులను దాటి వేగంగా టిక్కెట్లను బుక్ చేసింది. ఈ విధానం వల్ల కామన్ ట్రావెలర్స్ కు టిక్కెట్ బుకింగ్ అవకాశం లేకుండా చేసింది.

⦿ చట్టవిరుద్ధమైన పని: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారు ఆ యాప్‌ను చట్టవిరుద్ధమైనదిగా భావించారు. నిబంధనలను అతిక్రమించి తత్కాల్ టిక్కెట్లను బుక్ చేయడాన్ని నేరంగా భావించి  ఐఐటి ఖరగ్‌పూర్ గ్రాడ్యుయేట్ అయిన డెవలపర్ ఎస్. యువరాజను అరెస్టు చేశారు.

Advertisement

⦿ అనధికారిక ఆటోమేషన్: ఈ సాఫ్ట్‌ వేర్, అధికారులు బాట్ లాంటి ఆటోమేటెడ్ బుకింగ్‌ వ్యవస్థగా నిర్ణయించారు. టికెట్ రాకెటీరింగ్‌ ను అరికట్టడానికి దీనిని బ్యాన్ చేశారు.

⦿ నిషేధిత సాఫ్ట్‌ వేర్ వాడకం: బుకింగ్ ప్రక్రియను మిస్ లీడ్ చేయడానికి, వేగవంతం చేయడానికి ఏదైనా సాఫ్ట్‌ వేర్‌ ను ఉపయోగించడం రైల్వే చట్టం ప్రకారం చట్టవిరుద్ధమని IRCTC వెల్లడించింది.

ఈ యాప్ తత్కాల్ బుకింగ్ సమయంలో వివరాలను ఆటోమేటిక్ గా నింపడం, క్యాప్చాను లేకుండా చేయడం లాంటి విధానాలతో ఈ యాప్ బాగా పాపులర్ అయ్యింది. అయితే, బుకింగ్ సిస్టమ్‌ లలోకి అనధికారిక, మోసపూరిత ప్రవేశాన్ని దర్యాప్తు సంస్థలు తప్పుబట్టాయి. ఆ తర్వాత ఈ యాప్ ను బ్యాన్ చేయడంతో పాటు క్రియేటర్ ను అరెస్ట్ చేశారు.

Read Also:  ఊటీ-మెట్టుపాళయం సమ్మర్ స్పెషల్ షురూ, నీలగిరి అందాలు చూసేయండి!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×