E-Paper
Advertisement

PSL లో బాల్ టాంపరింగ్..జ‌మాన్‌, షాహీన్ షా, ర‌వూఫ్ పై బ్యాన్..? బ‌జారున ప‌డ్డ‌ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు

PSL లో బాల్ టాంపరింగ్..జ‌మాన్‌, షాహీన్ షా, ర‌వూఫ్ పై బ్యాన్..? బ‌జారున ప‌డ్డ‌ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు
Advertisement

Ball Tampering in PSL 2026:   పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరువు మరోసారి అంతర్జాతీయంగా పోయింది. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ( PSL 2026 ) జరుగుతున్న నేపథ్యంలో తెరపైకి బాల్ టాంపరింగ్ ( Ball Tampering in PSL 2026) వ్యవహారం వచ్చింది. లాహోర్ ఖలందర్స్ ప్లేయర్ ఫఖ‌ర్ జమాన్ ( Fakhar Zaman) బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డాడు. ఇదంతా కెప్టెన్ షాహీన్ అఫ్రిది ( Shaheen Shah Afridi), హారిస్ రవూఫ్ ( Haris Rauf ) ఆధ్వర్యంలో జరిగినట్లు వీడియో బయటకు వచ్చింది. లాహోర్ ఖలందర్స్ vs కరాచీ కింగ్స్ మ‌ధ్య ఆదివారం రోజున మ్యాచ్ జ‌రుగ‌గా, ఈ సంఘ‌ట‌న‌పై చోటు చేసుకుంది. అయ‌తే, క్రికెట్ రూల్స్ ప్ర‌కారం, బాల్ టాంప‌రింగ్ పెద్ద నేరం.. దీంతో ఈ ముగ్గురిపై చర్యలు తీసుకునే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: MI vs KKR Toss Fixing: వివాదంగా టాస్..తెర‌పైకి ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు, KKRపై ముంబై విజ‌యం

PSL లో బాల్ టాంపరింగ్ క‌ల‌క‌లం

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. వ్యూయర్ షిప్ తగ్గినప్పటికీ, మ్యాచ్ లు మాత్రం అద్భుతంగా ముందుకు సాగుతున్నాయి. అయితే ఈ టోర్నమెంట్ లో భాగంగా ఆదివారం లాహోర్ ఖలందర్స్ vs కరాచీ కింగ్స్ ( Lahore Qalandars vs Karachi Kings) మధ్య ఆరో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కరాచీ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన లాహోర్ 20 ఓవర్లలో 128 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబడింది కరాచీ. అయితే చివ‌రి ఓవ‌ర్ లో ల‌హోర్ ప్లేయర్లు బాల్ టాంపరింగ్ కు పాల్పడిన నేపథ్యంలో అదనంగా ఐదు పరుగులు సంపాదించి సులభంగా కరాచీ కింగ్స్ విజయం సాధించింది.

కరాచీ ఛేజింగ్ చేస్తున్న సమయంలో చివరి ఓవర్ లో 14 పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలో లాహోర్ బౌలర్ హరిస్ వ‌పూఫ్ బౌలింగ్ చేసేందుకు వచ్చాడు. ఇక ఓవర్ ప్రారంభం కాకముందు లాహోర్ కెప్టెన్ షాహీన్ షా, ఫఖ‌ర్ జమాన్, హరిస్ ర‌వూఫ్ ముగ్గురు చివరి ఓవర్ పై ప్లాన్ సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ఫ‌ఖ‌ర్ జ‌మాన్‌ బంతిని తీసుకొని, టాంపరింగ్ కు పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది. ఇందులో ఈ ముగ్గురు ఆటగాళ్లు బాల్ టాంపరింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇక ఆన్ ఫీల్డ్ అంపైర్లు దీన్ని పసిగట్టారు. అసలు దొంగతనం బయటపడడంతో లాహోర్ ఖలందర్స్ కు ఐదు పరుగుల పెనాల్టీ కూడా విధించారు. అలాగే ఫఖ‌ర్ జమాన్ పై లెవెల్ 3 కింద పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛార్జ్ కూడా వేసింది. అటు ఐదు పరుగుల పెనాల్టీ ఎదుర్కొన్న లాహోర్ ఖలందర్స్ దారుణంగా ఓడిపోయింది.

జ‌మాన్‌, షాహీన్ షా, ర‌వూఫ్ పై బ్యాన్..?

Advertisement

పాకిస్తాన్ ప‌రువు తీసేలా వ్య‌వ‌హ‌రించిన జ‌మాన్‌, షాహీన్ షా, ర‌వూఫ్ పై బ్యాన్ ఒక మ్యాచ్ నిషేధం ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ సంఘ‌ట‌న‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విచార‌ణ ప్రారంభించింది. 48 గంట‌ల్లో దీనిపై నివేదిక త‌యారు చేసి, చ‌ర్య‌లు తీసుకోనుంది. ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం, జ‌మాన్‌, షాహీన్ షా, ర‌వూఫ్ ల‌పై ఒక మ్యాచ్ ఆడ‌కుండా నిషేధం విధించే అవ‌కాశం క‌నిపిస్తోంది. షాహీన్ షా కెప్టెన్సీ కూడా తొలగించే ప్ర‌మాదం కూడా ఉంటుంది.

Also Read: PSL లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం..అర్ధ‌రాత్రి హోట‌ల్ గ‌దిలోకి 4 గురు దుండ‌గులు..షాహీన్‌, సికంద‌ర్ పై 2 ఏళ్ల బ్యాన్

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×