E-Paper
Advertisement

LPG Crisis: ఫుడ్ సర్వీసెస్ పై ఎల్పీజీ క్రైసిస్ ఎఫెక్ట్, క్లారిటీ ఇచ్చిన ఇండియన్ రైల్వే!

LPG Crisis: ఫుడ్ సర్వీసెస్ పై ఎల్పీజీ క్రైసిస్ ఎఫెక్ట్, క్లారిటీ ఇచ్చిన ఇండియన్ రైల్వే!
Advertisement

దేశ వ్యాప్తంగా ఎల్పీజీ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. ఎల్పీజీ క్రైసిస ఎఫెక్ట్ ఇండియన్ రైల్వే మీద ఉంటుందా? అనే అంశంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. రైల్వే స్టేషన్లు, రైళ్లలో ఆహారం, క్యాటరింగ్ సేవలు LPG కొరత వల్ల ప్రభావితం కావని రైల్వే అధికారులు తెలిపారు. ఒకవేళ ప్రభావం ఏదైనా ఉంటే, 20 రోజుల తర్వాతే ఉండవచ్చని తెలిపింది. ” ఎల్పీజీ కొరత కారణంగా క్యాటరింగ్ కొంతవరకు ప్రభావితమవుతుంది. ఇబ్బంది కలగకుండా మేము మా వంతు కృషి చేస్తున్నాము. రైల్వే బోర్డు నుంచి తదుపరి మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నాము” అని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు.

రైల్వే ప్రాంగణాలలో LPG వాడకం నిషేధం

శిలాజ ఇంధన ఆధారిత శక్తి నుంచి దూరంగా ఉండాలనే భారతీయ రైల్వేల దూరదృష్టి కారణంగా LPG సంక్షోభం తలెత్తినా ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడుతోంది. రైల్వే ఐదు సంవత్సరాల క్రితం రైళ్లలో, అన్ని రైల్వే ప్రాంగణాలలో LPG ఆన్‌ బోర్డ్ ప్యాంట్రీ కార్ల వాడకాన్ని నిషేధించాయి. అదే సమయంలో విద్యుత్ కుకింగ్ మౌలిక సదుపాయాలను క్రమంగా అభివృద్ధి చేసింది. ఈ నేపథ్యంలో కొంత మేర మాత్రమే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

Advertisement

అటు ప్రభుత్వం భారత రైల్వేలకు రాయితీలు అందించాలని క్యాటరింగ్ కాంట్రాక్టర్లు కోరుతున్నారు. వంటశాలలకు అవసరమైనంతవరకు LPG గ్యాస్ సరఫరాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందించాలంటున్నారు. ప్రయాణీకులు ఎలాంటి ఇబ్బంది పడకుండా చూడాలంటున్నారు. మరికొంత మంది కాంట్రాక్టర్లు ఈ ప్రభావం పెద్దగా ఉండదంటున్నారు. అయితే, ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని రైల్వేను కోరుతున్నారు. “స్నాక్స్ అందుబాటులో ఉంటాయి.  కానీ,  సంక్షోభం ఇలాగే కొనసాగితే భోజనం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆన్‌ బోర్డ్ రైళ్లలో సరఫరా చేయబడిన భోజనం ఎక్కువగా బేస్ కిచెన్‌లు, వివిధ ప్రదేశాలలోని క్లౌడ్ కిచెన్‌ల నుండి వస్తుంది. అవి LPG లేదా PNGని ఉపయోగిస్తున్నాయి. ఈ సరఫరా ప్రభావితమైతే, క్యాటరింగ్ సేవలు ప్రభావితం కావచ్చన్నారు.

ప్రయాణీకులపై భారం మోపొద్దు!

అటు గ్యాస్ ధరల పెంపు భారాన్ని ప్రయాణీకుల మీద మోపకూడదని జాతీయ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ మాజీ సభ్యుడు శైలేష్ గోయల్ అన్నారు. “ధరల పెరుగుదల కారణంగా కొరత భారాన్ని ప్రయాణికులపై వేయకూడదు. రైలు ఆహారం ప్రయాణంలో భాగం. ఎటువంటి రాజీ ఉండకూడదు. ప్రత్యామ్నాయ వంట ఇంధనాలకు మారమని రైల్వేలు బేస్ కిచెన్ కాంట్రాక్టర్లకు సూచించాలి” అన్నారు.

99.4 శాతం విద్యుదీకరణ

Advertisement

అటు LPG, ఆయిల్ కొరత కారణంగా రైళ్ల ఆపరేషన్లు ప్రభావితం కావని అధికారులు తెలిపారు. ఎందుకంటే చాలా వరకు రైళ్లు విద్యుత్తుతో నడుస్తున్నాయి. మొత్తం డీకార్బనైజేషన్ దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఇండియాలో 99.4 శాతం విద్యుదీకరణ ద్వారా రైల్వే ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ప్రధాన లైన్ల నుంచి చాలా డీజిల్ ఇంజిన్లు ఎలక్ట్రిక్ ఇంజిన్లతో భర్తీ చేయబడ్డాయన్నారు.

Read Also: వందే భారత్ రైల్ కోచ్‌లను ఎలా తయారు చేస్తారో చూడాలని ఉందా? ఇదిగో వీడియో!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×