E-Paper
Advertisement

Iran Attack: భారత్‌కు వస్తున్న కార్గో షిప్‌పై ఇరాన్ అటాక్.. స్పాట్‌లో 20 మంది సిబ్బంది..?

Iran Attack: భారత్‌కు వస్తున్న కార్గో షిప్‌పై ఇరాన్ అటాక్.. స్పాట్‌లో 20 మంది సిబ్బంది..?
Advertisement

పశ్చిమ ఆసియాలో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. యూఏఈ నుంచి గుజరాత్‌కు బయల్దేరిన థాయి‌లాండ్‌ కార్గో షిప్‌ ‘మయూరీ నారీ’పై ఇరాన్ భీకర దాడికి దిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఖలీఫా పోర్టు నుంచి సరుకుతో బయల్దేరిన ఈ నౌకను వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయి. సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో ఆకస్మికంగా జరిగిన ఈ దాడితో నౌకలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ తామే దాడి చేశామని ఇరాన్ అధికారికంగా ప్రకటించడం అంతర్జాతీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ప్రేషియస్ షిప్పింగ్ కంపెనీకి చెందిన ఈ భారీ నౌక గుజరాత్‌లోని కండ్లా పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. మార్గమధ్యంలో జరిగిన ఈ ప్రమాదం వల్ల నౌక ప్రయాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. దాడి సమాచారం అందిన వెంటనే స్పందించిన రక్షణ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. నౌకలో ఉన్న మొత్తం 23 మంది సిబ్బందిలో 20 మందిని సురక్షితంగా కాపాడగలిగారు. మరో ముగ్గురు సిబ్బంది ఆచూకీ మాత్రం ఇంకా లభ్యం కాలేదు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Advertisement

హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ప్రాంతం. అటువంటి చోట ఒక వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేయడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా పశ్చిమ దేశాలతో విభేదాల నేపథ్యంలో ఇరాన్ ఇటువంటి చర్యలకు పాల్పడుతుంటుంది. అయితే నేరుగా థాయ్‌లాండ్ నౌకను లక్ష్యంగా చేసుకోవడం వెనుక గల అసలు కారణాలను విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నౌకలోని సరుకు వివరాలు లేదా ఇతర భద్రతా కారణాల దృష్ట్యా ఈ అటాక్ జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఘటనపై అంతర్జాతీయ నౌకాయాన సంస్థలు స్పందిస్తున్నాయి. నౌకలోని మిగిలిన సిబ్బంది క్షేమంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గల్లంతైన ముగ్గురి కోసం అధునాతన పరికరాలతో గాలిస్తున్నారు. సముద్ర గర్భంలో ఏదైనా ప్రమాదానికి గురయ్యారా..? లేదా..? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. గుజరాత్ కండ్లా పోర్టు అధికారులు కూడా ఈ ఉదంతంపై అప్రమత్తమయ్యారు. షిప్పింగ్ కంపెనీ ప్రతినిధులు ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

Advertisement

ఈ దాడి ప్రభావం అంతర్జాతీయ సముద్ర రవాణా మార్గాలపై పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. ఇలాంటి దాడులు వాణిజ్య రంగాన్ని దెబ్బతీస్తాయి. ఇరాన్ వైఖరి వల్ల సముద్ర ప్రయాణాలు భారంగా మారుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఘటనపై మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మయూరీ నారీ నౌక భద్రతపై కంపెనీ యాజమాన్యం దృష్టి సారించింది. సిబ్బందిని స్వదేశానికి చేర్చే ప్రయత్నాలు వేగవంతం చేశారు.

ALSO READ: Cooking Gas Saving Tips: గ్యాస్ సిలిండర్ కొరత ఉన్నా చింత లేదు.. ఈ 5 పద్ధతులతో వంట చేయడం చాలా ఈజీ!

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×