E-Paper
Advertisement

పాక్‌లో విమానం అదృశ్యం.. వీడిన మిస్టరి, వాళ్లంతా ఏమయ్యారు?

పాక్‌లో విమానం అదృశ్యం.. వీడిన మిస్టరి, వాళ్లంతా ఏమయ్యారు?
Advertisement

Pak Plane Crash Update: అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తూ అదృశ్యమైన పాకిస్థాన్ కార్గో విమానం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విమానం సముద్రంలో కూలినట్లు పాకిస్థాన్ విమానయాన అధికారులు వెల్లడించారు. ఈ మేరకు విమానానికి చెందిన శకలాలను గుర్తించినట్లు ప్రకటించారు. అయితే, విమానంలో ఉన్న ఐదుగురు సిబ్బంది ఆచూకీ మాత్రం ఇప్పటికీ తెలియలేదు.

కరాచీ నుంచి షార్జాకు బయల్దేరిన విమానం

కే2 ఎయిర్‌ వేస్‌ కు చెందిన బోయింగ్ 737 కార్గో విమానం మంగళవారం రాత్రి కరాచీ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ లోని షార్జాకు బయలుదేరింది. ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికే పైలట్ నావిగేషన్ సిస్టమ్‌లో సమస్య తలెత్తినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చాడు. అధికారులు వెంటనే అవసరమైన మార్గదర్శకాలు అందించినప్పటికీ, కొద్ది నిమిషాల్లోనే విమానం వేగంగా కిందికి దిగడం ప్రారంభించింది. రాత్రి సుమారు 9:21 గంటల సమయంలో విమానంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు ఉన్న సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఆ తర్వాత రాడార్‌పై కూడా విమానం కనిపించలేదు. దీంతో అత్యవసరంగా గాలింపు చర్యలు ప్రారంభించారు.

Advertisement

సముద్ర మార్గం ద్వారా దాదాపు 12 గంటల పాటు గాలించిన తర్వాత, అరేబియా సముద్ర తీరంలోని ఒర్మారా ప్రాంతానికి దక్షిణంగా సుమారు 53 నాటికల్ మైళ్ల దూరంలో విమాన శకలాలను అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతం కరాచీకి పశ్చిమంగా సుమారు 360 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఇంకా లభించని సిబ్బంది ఆచూకీ

శకలాలు లభ్యమైనప్పటికీ, విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురు సిబ్బంది ఆచూకీ ఇంకా లభించలేదు. వారిని గుర్తించేందుకు సముద్రంలో సహాయక బృందాలు నిరంతరం గాలింపు కొనసాగిస్తున్నాయి. ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నావిగేషన్ వ్యవస్థలో వచ్చిన లోపమే ప్రమాదానికి కారణమా? లేక మరేదైనా సాంకేతిక సమస్య తలెత్తిందా? అనే కోణాల్లో విచారణ సాగుతోంది.

Advertisement

ఈ ఘటనతో పాకిస్థాన్‌లో జరిగిన గత పెద్ద విమాన ప్రమాదం మరోసారి గుర్తుకు వస్తోంది. 2020లో పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక ప్రయాణికుల విమానం కరాచీ విమానాశ్రయం సమీపంలో కూలిపోయింది. ఆ ప్రమాదంలో విమానంలో ఉన్న 99 మందిలో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడగా, మిగిలిన వారంతా మృతి చెందారు. తాజా కార్గో విమాన ప్రమాదంపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. సిబ్బంది క్షేమంగా దొరుకుతారా? ప్రమాదానికి అసలు కారణం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతే తెలిసే అవకాశం ఉంది.

Read Also: షాకింగ్.. ఒకే రన్‌వేపై ఎదురెదురుగా 2 విమానాలు.. తృటిలో తప్పిన పెనుముప్పు!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×