E-Paper
Advertisement

Tuvalu: ఈ దేశం వారంలో 3 రోజులు మాత్రమే కనిపిస్తుంది, మిగతా రోజులు మాయం.. ఎందుకంటే?

Tuvalu:  ఈ దేశం వారంలో 3 రోజులు మాత్రమే కనిపిస్తుంది, మిగతా రోజులు మాయం.. ఎందుకంటే?
Advertisement

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు కనుమరుగు కాబోతున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ దేశాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. అలాంటి వాటిలో ఒకటి టువాలు దేశం. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నది ఈ చిన్న ద్వీప దేశం. ఇది 9 పగడపు దీవుల  సమూహం. హవాయి, ఆస్ట్రేలియా మధ్య ఉంటుంది. రాజధాని ఫునాఫుటి. ఈ దేశంలో జనాభా సుమారు 11 వేలు. 1978లో యునైటెడ్ కింగ్‌ డమ్ నుంచి స్వతంత్రం పొందింది. వాతావరణ మార్పులతో పెరుగుతున్న సముద్ర మట్టాల కారణంగా ఈ దేశం కనుమరుగయ్యే ప్రమాదంలో ఉంది.

మూడు రోజులకు ఓ విమానం

భూమ్మీద అతి తక్కువ మంది సందర్శించే దేశాల్లో టువాలు ఒకటి. ఇక్కడికి ప్రతి మూడు రోజులకు ఒక విమానం మాత్రమే వస్తుంది. పర్యాటక మౌలిక సదుపాయాలు దాదాపుగా లేవు. ఈ దేశం మొత్తం ఒక పెద్ద విమానాశ్రయం కంటే చిన్నదిగా ఉంటుంది. పెరుగుతున్న సముద్ర మట్టాల కారణంగా కనుమరుగయ్యే మొదటి దేశాలలో ఇది ఒకటిగా మారవచ్చని శాస్త్రవేత్తలు  హెచ్చరిస్తున్నారు.

ఆస్ట్రేలియాకు వలసపోతున్న ప్రజలు

Advertisement

వాతావరణ మార్పుల కారణంగా టువాలు కనుమరుగైపోతుంటే, ఆస్ట్రేలియా ఆ ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇస్తూ అండగా నిలిచే ప్రయత్నం చేస్తోంది. టువాలు పౌరులకు ఆస్ట్రేలియా ఆశ్రయం కల్పిస్తోంది. వాతావరణ మార్పులతో ముంపునకు గురవుతున్న తమ పౌరులకు గౌరవప్రదమైన వలస అవకాశం కల్పించాలని ఆదేశం చేసిన విజ్ఞప్తి మేరకు.. 2023 నుంచి ఆస్ట్రేలియాకు ఆ దేశ ప్రజలకు అనుమతిస్తున్నారు. టువాలు పౌరులకు ప్రత్యేక వీసాలు జారీ చేస్తున్నారు. ఈ వీసా ద్వారా వారు ఆస్ట్రేలియాలో నివసించే అవకాశం కల్పిస్తున్నారు. వారు అక్కడ చదువుకోవచ్చు. పని చేసుకోవచ్చు. అర్హత సాధించిన వారికి ఆస్ట్రేలియా పౌరసత్వం కూడా లభిస్తుంది. వీళ్లు అక్కడికి విద్య, వైద్య బీమా, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుబాటులోకి వస్తాయి.

Read Also: యుద్ధ సమయంలో సంపన్నులు తలదాచుకొనే దేశాలివే.. ఈ ప్రాంతాలు అంత సేఫా?

టువాలు గురించి..

Advertisement

టువాలు ఓషియానియాలోని పాలినేషియన్ ప్రాంతంలో, ఫిజీకి ఉత్తరంగా ఉంటుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంతో కూడిన రాజ్యాంగ రాచరికం ఉంటుంది. అక్కడి ప్రజలు టువాలువాన్, ఇంగ్లీష్ మాట్లాడుతారు. అక్కడ తువాలువాన్ డాలర్, ఆస్ట్రేలియన్ డాలర్ కరెన్సీ ఉంటుంది. అక్కడి ప్రజలు చేపల వేట, కొబ్బరి చెట్లు ప్రధాన ఆధారంగా జీవిస్తున్నారు. టువాలు ప్రపంచంలోనే అత్యంత చిన్న, అత్యంత తక్కువ జనాభా కలిగిన దేశాలలో ఒకటి. ఇక్కడికి ఫిజీ నుంచి విమానాలు వస్తుంటాయి. ఫునాఫుటి అంతర్జాతీయ విమానాశ్రయం  ఆ దేశంలో ప్రధాన విమానాశ్రయం.  ఫిజీ నుంచి టువాలుకు ప్రయాణం సుమారు 3 గంటల సమయం పడుతుంది.

Read Also: యుద్ధ సమయంలో సంపన్నులు తలదాచుకొనే దేశాలివే.. ఈ ప్రాంతాలు అంత సేఫా?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×