E-Paper
Advertisement

Siddipet Accident: స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తి స్పాట్ డెడ్

Siddipet Accident: స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తి స్పాట్ డెడ్
Advertisement

Siddipet Accident: సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి శివారులోని రాజీవ్ రహదారిపై ఒక ప్రైవేట్ పాఠశాల బస్సు బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.

జగదేవ్‌పూర్ మండలానికి చెందిన ఆళ్ళకుంట రమేష్ (48), మరో వ్యక్తి మల్లయ్య (70) కలిసి బైక్‌పై వెళ్తుండగా.. వేగంగా వచ్చిన ప్రైవేట్ పాఠశాల బస్సు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు రమేష్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించారు. మల్లయ్యకు తీవ్ర గాయాలు కావడంతో అతని పరిస్థితి విషమంగా మారింది.

Advertisement

స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన మల్లయ్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన పై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో జగదేవ్‌పూర్ మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also Read: పోలీస్ జీప్‌ను ఎత్తుకెళ్లి.. చెరువులో దాక్కొని సైకో వీరంగం

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×