E-Paper
Advertisement

Indian Railway: నేవీ ఆఫీసర్ భార్యను రైల్లో నుంచి తోసి చంపిన టీసీ, ఇదీ అసలు కథ!

Indian Railway: నేవీ ఆఫీసర్ భార్యను రైల్లో నుంచి తోసి చంపిన టీసీ, ఇదీ అసలు కథ!
Advertisement

ఉత్తర ప్రదేశ్ లోని ఎటావా సమీపంలో పాట్నా- ఆనంద్ విహార్ ప్రత్యేక రైలు నుంచి నేవీ అధికారి భార్యను తోసి చంపేసినందుకు టికెట్ ఎగ్జామినర్ మీద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. టీటీఈ ఆమెను కదులుతున్న రైలు నుండి బయటకు తోసివేసినట్లు మృతురాలి కుటుంబం ఆరోపించింది. వారి ఫిర్యాదు మేరకు ఎటావాలోని ప్రభుత్వ రైల్వే పోలీసు కార్యాలయంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడిందని అధికారులు తెలిపారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

తాజాగా ఈ ఘటనపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఘటన జరిగిన రోజు అదే కోచ్ లో ఉన్న ప్రయాణీకులను విచారించారు. వారు రైల్వేకు లిఖితపూర్వకంగా ఇచ్చిన వాంగ్మూలాలలో కనీసం ఐదుగురు తోటి ప్రయాణికులు టీటీఈ సమర్థించినట్లు అధికారులు తెలిపారు. మరొక రైలు టికెట్ తీసుకోవడంతో జనరల్ కంపార్ట్‌ మెంట్‌ కు వెళ్లాలని తను చెప్పాడని, ఆమె స్వయంగా కదులుతున్న రైలు నుంచి దూకిందని వెల్లడించారు.

Advertisement

బాధితురాలు ఆర్తి యాదవ్ గత మంగళవారం ఉదయం 7:30 గంటలకు కాన్పూర్ నుంచి పాట్నా-ఆనంద్ విహార్ ప్రత్యేక రైలులోని స్లీపర్ కోచ్ ఎక్కింది. ఉదయం 9:30 గంటలకు, ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్  సంతోష్ కుమార్ కోచ్‌ లోకి  వెళ్లారు.  టికెట్ చూపించమని కోరారని తోటి ప్రయాణీకులు చెప్పారు. “ఆ మహిళ తన దగ్గర మరొక రైలు టికెట్ ఉందని చెప్పింది. TTE ఆమెను జనరల్ కోచ్‌కి వెళ్లమని చెప్పింది. తర్వాత ఆ మహిళ తాను తదుపరి స్టేషన్‌లో దిగుతానని చెప్పింది” అని ఆర్తి యాదవ్ ప్రయాణిస్తున్న స్లీపర్ కోచ్ లోని 4వ నంబర్ బెర్త్‌ లో ఉన్న ప్రయాణికురాలు అంచల్ శ్రీవాస్తవ రైల్వేకు చెప్పారు. “TTE మళ్ళీ ఆమెను జనరల్ కోచ్‌కి మారమని చెప్పారు. ఆ సమయంలో అతడిని ఆమె బెదిరించింది. ఆ తర్వాత తన బ్యాగ్ తీసుకొని స్టేషన్ సమీపంలో రైలు నుంచి దూకింది” అని మరో ప్రయాణికుడు రాజ్ వైభవ్ సింగ్ వెల్లడించారు.  కోచ్ డోర్ ఆమె కూర్చున్న బెర్త్‌ కు దగ్గరగా ఉండటంతో ఆమె తన ఆధార్ కార్డును టీటీఈ వైపు విసిరి, తన బ్యాగ్ తీసుకొని రైలు నుండి దూకిందన్నారు.

టీటీఈ తోసి చంపేశాడని ఆరోపిస్తున్న బాధితురాలి భర్త

అటు నేవీలో పని చేస్తున్న యాదవ్ భర్త అజయ్ సింగ్, వాగ్వాదం తర్వాత టీటీఈ ఆమెను వేగంగా వెళ్తున్న రైలు నుంచి బయటకు తోశారని ఆరోపించారు. “టీటీఈ ఆమెను కదులుతున్న రైలు నుంచి బయటకు తోశారు. ఆమె బ్యాగ్ మృతదేహం నుంచి 4 కి.మీ దూరంలో దొరికింది. ఆమె మొబైల్ ఫోన్ లేదు. ఆమె వీపు తీవ్రంగా గాయపడింది, ముందు భాగంలో ఎటువంటి గాయం గుర్తులు లేవు. ఇది అత్యంత దుర్మార్గం” అని సింగ్ ఆరోపించారు. ఈ కేసును పారదర్శకంగా విచారణ చేయాలి GRPని ఆయన కోరారు.

టీటీఈ ఏం చెప్పారంటే?

Advertisement

అటు ఈ ఘటనపై టీటీఈ వివరణ ఇచ్చారు. “బాధితురాలు వేరొక రైలు (నం. 02563)కు సంబంధించి AC క్లాస్ టికెట్ కొనుగోలు చేసింది. ఆ సమయంలో నేను  ఆమెను జనరల్ కోచ్‌కి మారమని చెప్పాను.  ఆ తర్వాత ఆమె తన ఆధార్ కార్డును నాపై విసిరి, తన బ్యాగ్‌ను తీసుకొని రైలు నుండి దూకింది” అని టీటీఈ కుమార్ వెల్లడించారు.

Read Also: పెళ్లి ఒకరితో.. ‘సంతానం’ మరొకరితో.. ఉగాండాలో కూలుతోన్న వందలాది కాపురాలు!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×