E-Paper
Advertisement

మాన్సూన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 డెస్టినేషన్స్ మిస్ అవొద్దు!

మాన్సూన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 డెస్టినేషన్స్ మిస్ అవొద్దు!
Advertisement

Most Beautiful Monsoon Destinations: చాలామంది సమ్మర్ హాలీడేస్ ను ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. వర్షాకాలాన్ని పర్యటనలకు అనువైన సమయంగా భావిస్తున్నారు. ఈ సీజన్ ప్రకృతి ప్రేమికులకు అత్యంత ఇష్టమైన కాలంగా మారుతోంది. వర్షాలతో కూడిన వెదర్, ఉప్పొంగే జలపాతాలు, పచ్చని అడవులు, పొగమంచుతో కప్పుకున్న లోయలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా యువత ఎక్కువ సెలవుల కంటే రెండు,  మూడు రోజుల  చిన్న ట్రిప్స్‌ కు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో వర్షాకాలం కూడా ఇప్పుడు ప్రధాన ట్రావెల్ సీజన్‌గా మారుతోంది.

వర్షాకాలంలో వెళ్లాల్సిన క్రేజీ ప్లేసెస్

వర్షాకాలంలో సందర్శించడానికి దేశంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ఈ 5 గమ్యస్థానాలను అస్సలు మిస్ కాకూడదు. ఇంతకీ అవేంటంటే..

1.లోనావాలా(మహారాష్ట్ర)

Advertisement

ముంబై, పుణెకు సమీపంలో ఉన్న లోనావాలా వర్షాకాలంలో పూర్తిగా పచ్చని ప్రకృతి అందాలతో నిండిపోయి ఉంటుంది. భారీ వర్షాలతో జలపాతాలు ఉప్పొంగుతాయి. భూషి డ్యామ్, టైగర్ పాయింట్, లయన్స్ పాయింట్, తుంగర్లి సరస్సు ఈ కాలంలో మరింత అందంగా కనిపిస్తాయి.

2.కూర్గ్(కర్ణాటక)

కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందిన కూర్గ్ వర్షాకాలంలో మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. పొగమంచుతో కప్పుకున్న కొండలు, పచ్చని అడవులు, అబ్బే జలపాతం, రాజాస్ సీట్, మడికేరి కోట సహా పలు ప్రాంతాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

3.మున్నార్(కేరళ)

Advertisement

తేయాకు తోటలతో ప్రసిద్ధి చెందిన మున్నార్ వర్షాకాలంలో అందమైన ప్రపంచంలా కనిపిస్తుంది. ఎరవికులం నేషనల్ పార్క్, మట్టుపెట్టి డ్యామ్, పాట్స్ సరస్సు, టాటా టీ మ్యూజియం, కొలుక్కుమలై టీ ఎస్టేట్ లాంటి ప్రదేశాలు కనువిందు చేస్తాయి.

4.ఉదయ్‌పూర్(రాజస్థాన్)

వేసవిలో మండిపోయే ఉదయ్‌ పూర్, వర్షాకాలంలో చల్లని వాతావరణంతో ఆకట్టుకుంటుంది. వర్షాలతో సరస్సులు నిండిపోవడంతో ప్రకృతి అందం మరింత పెరుగుతుంది. సిటీ ప్యాలెస్, పిచోలా సరస్సు, ఫతే సాగర్ సరస్సు, మాన్‌ సూన్ ప్యాలెస్ అద్భుతంగా అలరిస్తాయి.

5.చిరపుంజి(మేఘాలయ)

ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ఒకటైన చిరపుంజి, ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం లాంటిది. ఇక్కడి వంతెనలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. వర్షాకాలంలో ఇవి మరింత అద్భుతంగా కనిపిస్తాయి.

బెస్ట్ ట్రావెల్ సీజన్‌గా..

వర్షాకాలం ట్రిప్ అంటే.. కేవలం ఒక ప్రదేశాన్ని చూడటం మాత్రమే కాదు, ప్రకృతిని మరింత దగ్గరగా ఆస్వాదించడం కూడా. తక్కువ రద్దీ, చల్లని వాతావరణం, పచ్చని పరిసరాలు, జలపాతాల అందాలు ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. ఒకప్పుడు ఆఫ్ సీజన్‌గా భావించిన వర్షాకాలం ఇప్పుడు బెస్ట్ ట్రావెల్ సీజన్‌గా మారుతోంది. మీరు కూడా ఈ మాన్సూన్‌ లో  చిన్న ట్రిప్ ప్లాన్ చేస్తే, ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం లభిస్తుంది.

Read Also: భారతీయ పర్యాటకులకు గుడ్ న్యూస్.. వీసా లేకుండానే థాయిలాండ్ టూర్!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×