E-Paper
Advertisement

దేశంలోనే లార్జెస్ట్ లగ్జరీ రిసార్ట్, అమ్మో.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయా?

దేశంలోనే లార్జెస్ట్ లగ్జరీ రిసార్ట్, అమ్మో.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయా?
Advertisement

Taj Umiam Resort: మేఘాలయలోని ఉమియామ్ సరస్సు సమీపంలో తాజ్ గ్రూప్ అతిపెద్ద లగ్జరీ రిసార్ట్ ను నిర్మిస్తోంది. తాజ్ ఉమియామ్ రిసార్ట్ & స్పా పేరుతో దీనిని నిర్మిస్తోంది. ఈ రిసార్ట్ ఈశాన్య భారత పర్యాటక రంగంలో కీలక ప్రాజెక్ట్‌ గా మారనుంది. సుమారు రూ. 330 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించబడుతున్న ఈ 5 స్టార్ రిసార్ట్, లగ్జరీ హాస్పిటాలిటీ రంగంలో కొత్త ప్రమాణాలను పరిచయం చేయబోతోంది. తాజ్ గ్రూప్ ఆధ్వర్యంలోని ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్(IHCL) దీనిని నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ మేఘాలయలో ఏర్పాటు కాబోతోతున్నఅతిపెద్ద హాస్పిటాలిటీ ప్రాజెక్ట్‌ గా గుర్తింపు తెచ్చుకోబోతోంది.

మియామ్ సరస్సు తీరంలో ఏర్పాటు

ఈ లగ్జరీ రిసార్ట్ రి భోయ్ జిల్లాలోని అందమైన ఉమియామ్ సరస్సు తీరంలో నిర్మాణం జరుపుకుంటుంది. ఈ ప్రాంతం ఇప్పటికే ప్రకృతి సౌందర్యం, ప్రశాంత వాతావరణంతో ప్రసిద్ధి చెందింది. అలాంటి ప్రదేశంలో ఈ స్థాయి లగ్జరీ రిసార్ట్ నిర్మాణంతో  పర్యాటకులకు మరింత ఆకర్షణీయమైన ఎక్స్ పీరియెన్స్ ను అందించబోతోంది. ముఖ్యంగా, ప్రకృతి మధ్యలో ఆహ్లాదకర లగ్జరీ వాతావరణాన్ని కోరుకునే పర్యాటకులకు ఈ రిసార్ట్ అద్భుతమైన ఎంపికగా మారబోతోంది.

90 శాతం స్థానికులకే ఉద్యోగాలు

Advertisement

ఈ ప్రాజెక్ట్ కేవలం లగ్జరీ హోటల్ నిర్మాణమే కాకుండా, స్థానిక ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేయనుంది. ఇందులో పని చేసే సిబ్బందిలో సుమారు 90 శాతం స్థానికులకే ఉపాధి కల్పించాలని తాజ్ గ్రూప్ నిర్ణయించింది. దీని వల్ల స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అలాగే, ప్రాంతీయ అభివృద్ధికి కూడా తోడ్పాటు లభించనుంది.

తాజ్ ఉమియామ్ రిసార్ట్‌ ను పూర్తిగా కొత్త ప్రదేశంలో నిర్మించకుండా, ఇప్పటికే ఉన్న ఆర్కిడ్ లేక్ రిసార్ట్ స్థలాన్నే అభివృద్ధి చేసి ఆధునిక రూపంలో తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. దీంతో ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఈజీ అవుతుంది. అదే సమయంలో, పర్యావరణానికి అనుకూలంగా అభివృద్ధి చేయడానికి కూడా అవకాశం ఉంటుంది.

అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో..

Advertisement

ఈ రిసార్ట్ లక్ష్యం కేవలం వసతి కల్పించడం మాత్రమే కాదు. మేఘాలయ ప్రకృతి అందాలను ఆస్వాదించేలా, అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో కూడిన అనుభవాన్ని అందించేలా నిర్మిస్తున్నారు. ప్రపంచ స్థాయి సేవలు, అత్యాధునిక సౌకర్యాలు,   ప్రశాంతమైన వాతావరణం కలిపి పర్యాటకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందించడానికి ఈ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది.

తాజ్ ఉమియామ్ రిసార్ట్ ప్రారంభమైతే, మేఘాలయ పర్యాటక రంగంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఇది కేవలం రాష్ట్రానికే కాదు, మొత్తం ఈశాన్య భారతదేశానికి కూడా లగ్జరీ టూరిజం విషయంలో కీలక పాత్ర పోషించే ప్రాజెక్ట్‌ గా నిలువనుంది.

Read Also: ప్రపంచంలో అతిపెద్ద హోటల్.. అమ్మో, అన్ని వేల రూమ్స్ ఉన్నాయా?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×