E-Paper
Advertisement

IRCTC Ladakh Tour Package: తక్కువ ఖర్చుతో లడాఖ్ టూర్ ప్యాకేజీ, IRCTC సూపర్ ఆఫర్!

IRCTC Ladakh Tour Package: తక్కువ ఖర్చుతో లడాఖ్ టూర్ ప్యాకేజీ, IRCTC సూపర్ ఆఫర్!
Advertisement

IRCTC Ladakh Tour Package 2026: టూరిస్టులకు ఇష్టమైన డెస్టినేషన్ లడాఖ్. అద్భుతమైన పర్వత ప్రకృతి దృశ్యాలు, స్వచ్ఛమైన సరస్సులు, అలరించే టిబెటన్ బౌద్ధ సంస్కృతికి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. లడఖ్‌ ను తరచుగా లిటిల్ టిబెట్ గా పిలుస్తారు. లడాఖ్ ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా కొనసాగుతోంది. ఇక్కడ అత్యంత ఎత్తైన కనుమలు, ట్రెక్కింగ్ ప్లేసెస్,  గడ్డకట్టిన నదులను దాటే అందమైన మార్గాలు ఆకట్టుకుంటాయి. మీరు కూడా లడఖ్‌ను సందర్శించాలనుకుంటే, IRCTC మీ కోసం క్రేజీ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

కనుమల భూమిగా ప్రసిద్ధి..

కనుమల భూమిగా ప్రసిద్ధి చెందిన లడఖ్.. యాత్రికులకు ఎల్లప్పుడూ ఆకట్టుకుంటుంది. ఎటు చూసినా ప్రకృతి అందాలు ఆహా అనిపిస్తాయి. పర్వతాలు, నదులు, లోయలు, మంచుకొండలు కనువిందు చేస్తాయి. ఈ లిటిల్ టిబెట్ లో వెహికల్స్ వెళ్లే అత్యంత ఎత్తైన కనుమలు ఆహా అనిపిస్తాయి. గడ్డకట్టిన నదులపై ట్రెక్కింగ్ చేస్తూ పర్యాటకులు ఎంతో ఎంజాయ్ చేస్తారు.

లడఖ్ టూర్ ప్యాకేజీ వివరాలు..

Advertisement

లడఖ్ పర్యటన ఢిల్లీ నుంచి ప్రారంభం అవుతుంది. లడఖ్ పర్యటన కోసం రూ. 47,900 చెల్లించాల్సి ఉంటుంది. ఈ టూర్ మొత్తం 6 రాత్రులు, 7 పగళ్ళ పాటు కొనసాగుతుంది. ఈ IRCTC టూర్ ప్యాకేజీలో హోటల్ వసతి, భోజనం అందిస్తారు.

లడఖ్‌లోని చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా లడఖ్‌ లోని షామ్ వ్యాలీ – లేహ్, శాంతి స్థూపం, లేహ్ ప్యాలెస్, హాల్ ఆఫ్ ఫేమ్, గురుద్వారా పత్తర్ సాహిబ్, మాగ్నెటిక్ హిల్, అల్చి మఠం, సింధు, జాన్ స్కార్ నదులు, దీక్షిత్, హండర్ గ్రామాలు, నుబ్రా వ్యాలీ, తుర్తుక్ వ్యాలీ, సియాచిన్ యుద్ధ స్మారక చిహ్నం, థాంగ్ జీరో పాయింట్, సాంస్కృతిక ప్రదర్శన, పాంగోంగ్ సరస్సు, థిక్సే మఠం, షే ప్యాలెస్, రాంచో కా స్కూల్ సందర్శన ఉంటుంది.

Advertisement

Read Also: ఐఆర్సీటీసీ స్పెషల్ ఆఫర్, జస్ట్ రూ. 30 వేలల్లో క్రేజీ టూర్ ప్యాకేజీలు!

లడాఖ్ టూర్ టిక్కెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే?

IRCTC వారి ఈ టూర్ ప్యాకేజీ గురించి వివరంగా తెలుసుకోవాలంటే, రైల్వే అధికారిక వెబ్ సైట్ లో (www.irctctourism.com) సందర్శించాలి.  టికెట్లు కూడా అక్కడే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

Read Also: ప్రపంచంలో అత్యంత పొడవైన బీచ్ లు ఇవే, జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×