E-Paper
Advertisement

Ustaad Bhagat Singh Box Office: ‘ధురంధర్ 2’ దెబ్బకు ‘ఉస్తాద్’ విలవిల.. పవన్ మ్యాజిక్ పనిచేయలేదా?

Ustaad Bhagat Singh Box Office: ‘ధురంధర్ 2’ దెబ్బకు ‘ఉస్తాద్’ విలవిల.. పవన్ మ్యాజిక్ పనిచేయలేదా?
Advertisement

Ustaad Bhagat Singh Box Office: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అంటే బాక్సాఫీస్ దగ్గర పూనకాలు రావాలి.. రికార్డులు తిరగరాయాలి. కానీ, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ‘గబ్బర్ సింగ్’ మ్యాజిక్‌ని రిపీట్ చేస్తాడనుకున్న హరీష్ శంకర్, పవన్ కెరీర్‌లోనే ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్‌ను ఫ్యాన్స్‌కు గిఫ్ట్‌గా ఇచ్చినట్టు కనిపిస్తోంది. పండగ సీజన్, లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ ఉన్నా.. సినిమా రెండో రోజే కుప్పకూలిపోవడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ‘హాట్ టాపిక్’ అయింది.

80 శాతం డ్రాప్.. మైత్రీ సైలెన్స్ వెనుక అసలు కథ ఇదేనా?

Advertisement

తొలిరోజు ఏపీలో టికెట్ రేట్ల పెంపు పుణ్యమా అని దేశవ్యాప్తంగా రూ. 34.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఉస్తాద్, రెండో రోజుకు వచ్చేసరికి ఏకంగా 80 శాతం పడిపోయింది. రెండో రోజు వసూళ్లు చూసి బయ్యర్లు బెంబేలెత్తిపోతున్నారు. సాధారణంగా పవన్ సినిమా అంటే వారం రోజులు హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తాయి, కానీ ఇక్కడ రెండో రోజే థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఇప్పటివరకు అధికారికంగా కలెక్షన్లు ప్రకటించడానికి మైత్రీ మూవీ మేకర్స్ సాహసించకపోవడం చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది.

‘ఓజీ’ ని కొడుతుందనుకుంటే.. ‘ధురంధర్’ దెబ్బకు ఖాళీ!

Advertisement

ఈ సినిమా పవన్ గత చిత్రం ‘ఓజీ’ రికార్డులను ఈజీగా క్రాస్ చేస్తుందని అందరూ అంచనా వేశారు. కట్ చేస్తే, రెండో రోజుకే ఉస్తాద్ చేతులెత్తేశాడు. దీనికి తోడు నేటి నుంచి ‘ధురంధర్-2’ తెలుగు వెర్షన్ కూడా థియేటర్లలోకి రావడంతో ‘ఉస్తాద్’ కు ఉన్న కాస్తో కూస్తో స్పేస్ కూడా కనుమరుగయ్యేలా ఉంది. ఒక పక్క మాస్ సినిమా అంటూ ప్రచారం చేసినా, థియేటర్ల దగ్గర జనాలు కనిపించకపోవడం మేకర్స్ కి పెద్ద షాకే .

పవన్ ఇక సినిమాలు వదిలేయాల్సిందేనా ?

ఇక “నేను ఫ్యాన్‌ని, ఫ్యాన్స్‌కు ఏం కావాలో నాకు తెలుసు” అంటూ హరీష్ శంకర్ చేసిన స్టేట్‌మెంట్స్ ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి. కేవలం ఎలివేషన్లు, పాతకాలపు రీమేక్ కథలతో పవన్ కాలాన్ని వృథా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “ఇలాంటి అవుట్ డేటెడ్ సినిమాలు చేసే బదులు పవన్ సినిమాలు చేయకపోవడమే బెటర్” అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు. పొలిటికల్ గా బిజీగా ఉన్న పవన్, ఇలాంటి అరకొర స్క్రిప్టులతో సినిమాలు చేయడం వల్ల ఆయన ఇమేజ్ డ్యామేజ్అవుతోందన్నది విశ్లేషకుల మాట. ఇక  బాక్సాఫీస్ లెక్కలు చూస్తుంటే నిర్మాతలకు భారీ నష్టాలు తప్పేలా లేవు. మొత్తానికి ‘ఉస్తాద్’ బాక్సాఫీస్ ప్రయాణం మొదటి వారానికే ముగిసిపోయేలా కనిపిస్తోంది. ఇది హరీష్ శంకర్ ఫెయిల్యూరా? లేక ప్రేక్షకులు పవన్ సినిమాలకి మొహం చాటేస్తున్నారా? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చ!

also read:Dhurandhar vs Deepika: ‘ధురంధర్’ వర్సెస్ దీపికా… ఈ జంట మధ్య గ్యాప్ పెరిగిందా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×