E-Paper
Advertisement

Dubai Tour Package: IRCTC దుబాయ్ టూర్, తక్కువ ఖర్చుతో ఎంజాయ్ చేయండి గురూ!

Dubai Tour Package: IRCTC దుబాయ్ టూర్, తక్కువ ఖర్చుతో ఎంజాయ్ చేయండి గురూ!
Advertisement

దుబాయ్‌ పర్యటనకు వెళ్లాలని భావిస్తున్నారా? ఖర్చు ఎక్కువ అవుతుందని టెన్షన్ పడుతున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్. IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా దుబాయ్ అందాలను చూసి ఎంజాయ్ చేసి రావచ్చు. మొత్తం ఆరు రోజుల పాటు కొనసాగే ఈ టూర్ కోసం ప్యాకేజీని ప్రారంభించింది.  ఈ ఆరు రోజుల్లో ఎడారి దేశం అందమైన దృశ్యాలను ఆస్వాదించే అవకశం కాల్పిస్తోంది. ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీకి ఎంత డబ్బు చెల్లించాల్సి? టూర్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఫిబ్రవరిలో దుబాయ్ టూర్ ప్రారంభం

భారతీయులు ఎక్కువగా ఇష్టపడే డెస్టినేషన్స్ లో దుబాయ్ ఒకటి. ప్రతి ఒక్కరు కనీసం ఒక్కసారి అయినా దుబాయ్ కి వెళ్లిరావాలని భావిస్తారు. అయితే, కొంత మందికి ఖర్చు సమస్య, మరికొంత మందికి ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని IRCTC కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. దుబాయ్‌ పర్యటన కలను  చిరస్మరణీయం చేసేందుకు సిద్ధం అయ్యింది. దుబాయ్ కి వెళ్లాలని కలలుగనే వారు ఎడారి దేశంలో ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 2026లో దుబాయ్ కి వెళ్లేలా IRCTC స్పెషల్ దుబాయ్ టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. ఇది  దుబాయ్‌ను సందర్శించడానికి ఒక సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది. ఈ ప్రత్యేక ప్యాకేజీలో అబుదాబి పర్యటన కూడా ఉండటం విశేషం.

దుబాయ్ ప్యాకేజీలో ఏ ప్రదేశాలు చూడవచ్చంటే?  

Advertisement

IRCTC స్పెషల్ దుబాయ్ టూర్ ప్యాకేజీలో భాగంగా పలు ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తోంది. అబుదాబిలోని బుర్జ్ ఖలీఫా, మిరాకిల్ గార్డెన్, మెరీనా క్రూయిజ్ రైడ్, బెల్లీ డాన్స్‌ తో గాలా డిన్నర్, ఫ్యూచర్ మ్యూజియం, హిందూ టెంపుల్, ఫెరారీ వరల్డ్ వంటి ప్రదేశాలను చూసి ఎంజాయ్ చేసేలా ప్యాకేజీని రూపొందించింది. ఈ పర్యటన ఫిబ్రవరి 13న ప్రారంభమవుతుంది. ఆరు రోజుల పాటు కొనసాగుతోంది.

సోషల్ మీడియా వేదికగా ప్రకటన

ఈ ప్రత్యేక దుబాయ్ టూర్ ప్యాకేజీ గురించి IRCTC సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దుబాయ్, అబుదాబి పర్యటనను అద్భుతంగా ఆస్వాదించవచ్చని వెల్లడించింది. ఈ టూర్ ప్యాకేజీ 5 రాత్రులు, 6 పగళ్ల పాటు కొనసాగనుంది. ఈ ప్రత్యేక ట్రిప్ లక్నో నుంచి ప్రారంభం అవుతుందని IRCTC ప్రకటించింది. ఒక్కో టికెట్ ధర రూ. రూ. 106,000 నుంచి ప్రారంభం అవుతుంది.

టూర్ ప్యాకేజీ ధరల వివరాలు

Advertisement

దుబాయ్ స్పెషల్ ప్యాకేజీకి సంబంధించి సింగిల్ షేరింగ్ కు రూ. 1,34,600 టికెట్ ఉంటుంది. డబుల్ షేరింగ్ విషయానికి వస్తే, రూ.1,08,000 ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 1,06,000 ఉంటుంది. 5 నుంచి 11 సంవత్సరాల వయసున్న పిల్లలకు బెడ్ తో అయితే రూ. 96,500 ఉంటుంది. అదే వయసు ఉన్న పిల్లలకు బెడ్ లేకుండా అయితే, రూ. 83,800గా ఉంటుందని IRCTC ప్రకటించింది. ఈ పర్యటనకు సంబంధించి ప్యాకేజీని ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకోవాలని సూచించింది. దుబాయ్ టూర్ కు ఎక్కువ డిమాండ్ ఉన్న నేపథ్యంలో వీలైనంత త్వరగా టికెట్స్ బుక్ చేసుకోవాలని IRCTC అధికారులు సూచించారు.

Read Also: సంక్రాంతికి మరో రెండు ప్రత్యేక రైళ్లు, గుడ్ న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×