E-Paper
Advertisement

Flights Cancelled: గల్ఫ్ లో యుద్ధ కల్లోలం.. ఆకాశంలోకి ఎగరని విమానాలు!

Flights Cancelled: గల్ఫ్ లో యుద్ధ కల్లోలం.. ఆకాశంలోకి ఎగరని విమానాలు!
Advertisement

అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతిదాడులతో గల్ఫ్ దేశాలు అల్లకల్లోలం అవుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు 48 మంది టాప్ లీడర్స్ ను హతమార్చిన అమెరికా-ఇజ్రాయెల్ సేనలు, ఇంకా ఆదేశంలో పెద్ద ఎత్తున బాంబింగ్ చేస్తున్నాయి. ఇరాన్ టాప్ లీడర్ చనిపోయినా, ఆ దేశం నుంచి ప్రతి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా మిసైల్స్ తో విరుచుకుపడుతోంది. అటు ఇరాన్ కు మద్దతుగా హౌతీలు ఇజ్రాయెల్, అమెరికా నౌకలపై దాడుదలు చేస్తున్నాయి. మొత్తంగా భీకరదాడులతో గల్ఫ్ దేశాలు అల్లాడుతున్నాయి.

స్తంభించిన విమాన ప్రయాణాలు

గల్ఫ్ దేశాల్లో యుద్ధం కారణంగా పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను నిలిపిశాయి. పశ్చిమ ఆసియా నుంచి యుఎఇ, ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేశాయి. గల్ఫ్ ప్రాంతంలోని ఎమిరేట్స్, ఎతిహాద్, ఖతార్ ఎయిర్‌ వేస్ లాంటి విమానయాన సంస్థలు ఆదివారం సాయంత్రం వరకు దాదాపు 1,600 విమానాలను రద్దు చేశాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, అకాసా లాంటి భారతీయ విమానయాన సంస్థలు 350 విమానాలను రద్దు చేశాయని విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఉత్తర అమెరికా, యూరప్ కు విమాన సర్వీసులు

Advertisement

అటు ఎయిర్ ఇండియా ఉత్తర అమెరికాతో పాటు యూరప్ దేశాలకు విమాన సర్వీసులను నడిపించనున్నట్లు ప్రకటించింది. “ఉత్తర అమెరికా, యూరప్‌ కు విమానాలను నడిపేందుకు ప్రయత్నిస్తున్నాం. పశ్చిమాసియాలో అందుబాటులో ఉన్న గగనతలాలపై ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగిస్తాం. ఇది విమాన ప్రయాణ సమయాన్ని పెంచుతున్నా, తప్పడం లేదు” అని వెల్లడించింది. న్యూయార్క్ (జెఎఫ్‌కె), నెవార్క్ (లిబర్టీ ఇంటర్నేషనల్) విమానాలు రోమ్ (ఫియుమిసినో విమానాశ్రయం) లో టెక్నికల్ స్టాప్‌లతో నడుస్తాయని తెలిపింది.

125 అంతర్జాతీయ విమానాలు రద్దు  

ఎయిర్ ఇండియా ఆదివారం పశ్చిమ దేశాలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే దాదాపు 125 అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. టాటా యాజమాన్యంలోని ఈ క్యారియర్ మార్చి 2 రాత్రి 11.59 గంటల వరకు యుఎఇ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్‌ కు వెళ్లే విమానాల సస్పెన్షన్‌ ను పొడిగించినట్లు స్పష్టం చేసింది. మార్చి 2న యూరప్‌ కు వెళ్లే కొన్ని విమానాలు రద్దు చేసినట్లు తెలిపింది.

విమానాల రద్దుపై ఇండిగో కీలక ప్రకటన

Advertisement

అటు పశ్చిమాసియా వైమానిక ప్రాంతాన్ని ఉపయోగించే అంతర్జాతీయ విమానాలను మార్చి 2, 2026, రాత్రి 11.59 గంటల వరకు నిలిపివేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది.

Read Also:  మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తతలు, 850 ఇండియన్ ఫ్లైట్స్ క్యాన్సిల్!

విమానాల రద్దు నేపథ్యంలో అబుదాబి కీలక నిర్ణయం

విమానాల రద్దు కారణంగా చిక్కుకున్న ప్రయాణీకుల బసను పొడిగించాలని అబుదాబి తమ దేశంలోని హోటళ్లకు సూచించింది. పొడిగించిన బస ఖర్చును DCT భరిస్తుంని అబుదాబి సంస్కృతిక, పర్యాటక శాఖ (DCT) ఓ సర్క్యులర్‌లో తెలిపింది.

Read Also:  మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తతలు, ఈ టైమ్ లో దుబాయ్‌ కి వెళ్లడం సేఫేనా?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×