// // Family Drama OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న కొత్త మూవీ... -->
E-Paper
Advertisement

Family Drama OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న కొత్త మూవీ… ఊటీ నేపథ్యంలో సాగే ఓ తండ్రి, ముగ్గురు కొడుకుల కథ

Family Drama OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న కొత్త మూవీ… ఊటీ నేపథ్యంలో సాగే ఓ తండ్రి, ముగ్గురు కొడుకుల కథ
Advertisement

Family Drama OTT : ఊటీ నేపథ్యంలో సాగే ఒక తమిళ ఫ్యామిలీ డ్రామా ఓటీటీలోకి వస్తోంది. ఇది ముగ్గురు పిల్లలు, ఒక కఠినమైన తండ్రి చుట్టూ తిరిగే ఒక ఎమోషనల్ జర్నీ. గత ఏడాది థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ప్రశంసలు వచ్చాయి. అయితే స్టార్ హీరోలు లేని కారణంగా ఈ సినిమా చాలా తక్కువ మందికి మాత్రమే రీచ్ అయింది. ఇక ఓటీటీలోకి వస్తుండటంతో చాలా మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి, డిజిటల్ లో ఈ సినిమాకి మరింత ఆదరణ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలోకి వస్తోంది ? అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ సినిమాను ఎక్కడ, ఎప్పుడు చూడచ్చు అంటే

ఈ తమిళ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘నాంగల్’ (Naangal). అవినాష్ ప్రకాష్ దర్శకత్వంలో కళా భవశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై జివిఎస్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఇందులో మిథున్ వి, రిత్విక్ ఎం, నితిన్ డి, అబ్దుల్ రఫే, ప్రార్థన శ్రీకాంత్, జాన్ ఇ, తనికా గురుప్రసాద్, కె. హరిహరన్ తదితరులు నటించారు. ఈ సినిమా 2025 ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలై, విమర్శకుల ప్రశంసలు అందుకుని ఉత్తమ తమిళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 2026 మార్చి 13 నుండి SunNXTలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఇది ముగ్గురు చిన్న పిల్లల చుట్టూ తిరిగే ఒక ఎమోషనల్ జర్నీ. ఎనిమిదేళ్ల వయసున్న కవలలు, వాళ్లకి తోడుగా ఉండే పన్నెండేళ్ల అన్నయ్య.. ఈ ముగ్గురూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. కానీ వాళ్ల పరిస్థితి అంత బాగోదు. వాళ్ల అమ్మ వీళ్లకు దూరమైపోతుంది.నాన్నేమో చాలా స్ట్రిక్ట్. పైగా ఆయనకు కోపం ఎక్కువ, కొంచెం గర్వం కూడా. ఒక పక్క రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో డబ్బులన్నీ పోయి అప్పుల్లో ఉంటాడు. మరోపక్క ఇంట్లో పిల్లలకు కనీసం ప్రేమ కూడా దొరకదు. అలాంటి కష్టాల్లో ఆ పిల్లలు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ చిన్న వయసులోనే నాన్న పెట్టే ఇబ్బందులు భరిస్తూనే, వాళ్లు తమకంటూ ఒక చిన్న లోకాన్ని క్రియేట్ చేసుకుంటారు. ఈ సీన్స్ మనసుకి హత్తుకునేలా ఉంటాయి. చివరికి అప్పుల బాధ నుంచి ఆ కుటుంబం బయటపడిందా ? ఈ ఫ్యామిలీ సంతోషంగా ఉంటుందా ? ఈ ముగింపు ఎలా ఉంటుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : మనవరాలికి లోకం చూపించే బామ్మ… ఓటీటీలో ఆకట్టుకుంటున్న ఆర్ట్ ఫిల్మ్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×