// // Indian Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..అందుబాటులోకి 1,000 కొత్త జనరల్ కోచ్‌లు! -->
E-Paper
Advertisement

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..అందుబాటులోకి 1,000 కొత్త జనరల్ కోచ్‌లు!

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..అందుబాటులోకి 1,000 కొత్త జనరల్ కోచ్‌లు!
Advertisement

Railways To Add 1,000 New General Coaches: రైల్వే ప్రయాణికులకు రైల్వేశాఖ అదిరిపోయే న్యూస్ చెప్పింది. ముఖ్యంగా జనరల్ కోచ్‌ లలో ప్రయాణించే లక్షలాది మంది ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులోగా దేశంలోని 370కి పైగా రైళ్లకు దాదాపు 1,000 కొత్త జనరల్ కోచ్‌లను జోడించనున్నట్లు ప్రకటించింది.

జనరల్ కోచ్ లలో రద్దీని తగ్గించేలా..

ప్రస్తుతం పండుగలు, సెలవులు, ఉద్యోగాలు, విద్యా అవసరాల కోసం ప్రతిరోజూ కోట్లాది మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా జనరల్ కోచ్‌లలో రద్దీ అధికంగా ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా సందర్భాల్లో నిలబడి ప్రయాణించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజాగా మీడియాతో మాట్లాడిన రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ కీలక వివరాలు వెల్లడించారు. దేశంలోని ప్రధాన రైళ్లలో ప్రయాణికుల రద్దీని విశ్లేషించిన తర్వాత అదనపు జనరల్ కోచ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కొత్తగా జోడించే కోచ్‌ల వల్ల సాధారణ ప్రయాణికులకు మరిన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో జనరల్ బోగీల్లో ఉండే ఒత్తిడి కొంత మేర తగ్గే అవకాశం ఉంది. ప్రయాణికుల భద్రత, సౌకర్యం కూడా మెరుగుపడుతుందన్నారు.

370 రైళ్లలో 1,000 కొత్త జనరల్ కోచ్ లు

ఇటీవలి కాలంలో రైల్వేలు ప్రయాణికుల సౌకర్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఒకవైపు కొత్త వందే భారత్ రైళ్లను ప్రవేశపెడుతుండగా, మరోవైపు సాధారణ ప్రజలు ఎక్కువగా ఉపయోగించే జనరల్ కోచ్‌ల సంఖ్యను కూడా పెంచుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు, కార్మికులు, విద్యార్థులు ఎక్కువగా జనరల్ కోచ్‌లలోనే ప్రయాణిస్తారు. వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపడుతున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. 370కి పైగా రైళ్లలో వెయ్యి కొత్త జనరల్ కోచ్‌లను జోడించడం వల్ల దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా ఎక్కు రద్దీ ఉండే మార్గాల్లో ఈ నిర్ణయం ఉపయోగకరంగా ఉంటుంది.

Advertisement

ప్రయాణికుల సంఖ్య ఏడాది ఏడాదికి పెరుగుతున్న నేపథ్యంలో రైల్వేలు మౌలిక సదుపాయాల విస్తరణ, కొత్త కోచ్‌ల ఏర్పాటు, భద్రతా చర్యలపై మరింత దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలో తీసుకున్న తాజా నిర్ణయం సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు లేని ప్రయాణాన్ని అందించనుంది.

Read Also: చెన్నై-తిరుపతి మార్గంలో 8 రైళ్లు రద్దు.. ఎన్ని రోజులు అంటే?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×