E-Paper
Advertisement

New Vande Bharat: ఒక వందేభారత్, రెండు అమృత్ భారత్ రైళ్లు, తెలుగు రాష్ట్రాలకు రైల్వే గుడ్ న్యూస్!

New Vande Bharat: ఒక వందేభారత్, రెండు అమృత్ భారత్ రైళ్లు, తెలుగు రాష్ట్రాలకు రైల్వే గుడ్ న్యూస్!
Advertisement

New Vande Bharat from Secunderabad: భారతీయ రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా ఓ వందేభారత్ రైలుతో పాటు రెండు అమృత భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ రైళ్లకు సంబంధించి రూట్, షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. వాస్తవానికి ఉభయ తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే వందేభారత్ రైళ్తో పాటు అమృత్ భారత్ రైళ్లకు మంచి ఆదరణ పెరిగింది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ కు అనుణంగా ఈ కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల్లో పలు వందేభారత్ రైళ్ల పరుగులు

వాస్తవానికి ఉభయ తెలుగు రాష్ట్రాలను కలుగుపుతూ ఇప్పటికే లు వందేభారత్ రైలు సర్వీసులు నడుస్తున్నాయి. ఈ రైళ్లు వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఇంకా కొన్ని రైళ్లు కావాలని ప్రయాణీకుల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న రైల్వేశాఖ.. కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రైల్వే ఆమోదం లభించినా అందుబాటులోకి రాని విజయవాడ-బెంగళూరు వందేభారత్ రైలు పైనా ఈ వారంలోనే రైల్వే అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. అదే సమయంలో సికింద్రాబాద్ నుంచి నాందేడ్ వరకు కొత్త వందేభారత్ సర్వీసును తీసుకురావాలని అధికారులు నిర్ణయించింది.

ఇకపై జస్ట్ మూడు గంటల ప్రయాణం

Advertisement

సికింద్రాబాద్- నాందేడ్ నగరాల మధ్య దూరం 280 కిలో మీటర్లు ఉంటుంది. ప్రస్తుతం సాధారణ రైళ్లలో ఈ నగరాల మధ్య ప్రయాణం కొనసాగించాలంటే ఏకంగా 7 గంటల సమయం పడుతుంది. కొత్తగా వందేభారత్ రైలు అందుబాటు లోకి వస్తే, ప్రయాణ సమయం ఏకంగా మూడు గంటలకు తగ్గనుంది.  అటు చర్లపల్లి- షాలీమార్, చర్లపల్లి – గోరఖ్ పూర్ నడుమ రెండు అమృత్ భారత్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల చివరిలోగా ఈ రైళ్లు ప్రారంభం అవుతాయని రైల్వే అధికారులు ఇప్పటికే వెల్లడించారు.

ప్రయాణీకులకు మరింత వెసులుబాటు

త్వరలోనే ఈ కొత్త రైళ్లకు సంబంధించిన అధికారికంగా షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి విశాఖ, తిరుపతి, యశ్వంత్ పూర్ మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. వీటికి మంచి డిమాండ్ ఉంది. సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందే భారత్ రైలు 575 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. జస్ట్ 7.15 గంటల్లో ఈ ప్రయాణం పూర్తి అవుతుంది. ఇప్పటికే ఉన్న ఈ వందే భారత్ రైళ్లతో పాటు సికింద్రాబాద్-నాందేడ్ వందే భారత్ రైలు ప్రారంభం అయితే, ప్రయాణీకులకు మరింత లాభం కలగనుంది.

Advertisement

అటు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న విజయవాడ-బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ కూడా త్వరలోనే పట్టాలు ఎక్కే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో విశాఖ నుంచి బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ పైన సమాచాలోచలు చేస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపైనా అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.

Read Also:  కాశీ To అయోధ్య… IRCTC అద్భుతమైన యాత్ర ప్యాకేజీ!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×