E-Paper
Advertisement

IRCTC Free Food: ట్రైన్ ఆలస్యం అయితే ఫ్రీ ఫుడ్.. ఆ ప్రయాణికుడు భలే లక్కి

IRCTC Free Food: ట్రైన్ ఆలస్యం అయితే ఫ్రీ ఫుడ్.. ఆ ప్రయాణికుడు భలే లక్కి
Advertisement

IRCTC Free Food: రైలు ప్రయాణాల్లో ‘ఆలస్యం’ అనే మాట తరచూ వినిపిస్తుంటుంది. అదే మనం ఎక్కాల్సిన ట్రైన్ ఆలస్యం అని తెలిస్తే.. ఇక అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందా? అని చెవులు పెద్దవి చేసుకుని వింటుంటాం. అలాగే వాచ్, ఫ్లాట్ ఫామ్ పై బోర్డులు పదే పదే చూస్తుంటాం. రైల్వే ప్రయాణాల్లో కొన్ని రూల్స్ ప్రయాణికుల పక్షాన కూడా ఉంటాయ్. ఒకవేళ ట్రైన్ ఆలస్యం అయితే కొన్ని రైళ్ల ప్రయాణికులు ఉచితంగా ఆహారం అందిస్తారు.

ఎక్స్ లో ప్రయాణికుడి పోస్ట్

ఐఆర్సీటీసీ క్యాటరింగ్ ప్రకారం.. రాజధాని, శతాబ్ది, దురంతో ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లు.. వాటి షెడ్యూల్ కంటే రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఆలస్యమైతే ప్రయాణికులు ఉచిత భోజనం పొందేందుకు అర్హులు. ఈ రూల్ పై ఇటీవల ఓ ప్రయాణికుడు ఎక్స్ వేదికగా పోస్టు చేశాడు.

Advertisement

జనవరి 8న ఓ ప్రయాణికుడు.. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే ఆ రైలు ఆరు గంటలు ఆలస్యం అయింది. దీంతో తనకు ఉచితంగా భోజనం లభించిందని వెల్లడించాడు. “మీ రైలు 2 గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే.. మీకు ఉచిత భోజనం (అల్పాహారం/భోజనం/విందు) లభిస్తుంది” అని ప్రయాణికుడు తెలిపారు.

రైలు ఆలస్యమైతే అందించే ఆహారం

ఐఆర్సీటీసీ క్యాటరింగ్ ప్రకారం.. ప్రీమియం రైళ్లు ఆలస్యంగా నడిస్తే ప్రయాణికులు ఆహారాన్ని ఉచితంగా అందిస్తారు.

  1. టీ/కాఫీ: ప్రయాణికులకు టీ లేదా కాఫీని బిస్కెట్లతో అందిస్తారు. అలాగే మిల్క్ క్రీమ్, షుగర్ సాచెట్లతో పానీయాలు అందిస్తారు.
  2. బ్రేక్ ఫాస్ట్/ఈవెనింగ్ టీ: నాలుగు బ్రెడ్ ముక్కలు, జ్యూస్ లేదా టీ లేదా కాఫీ ఇస్తారు.
  3. లంచ్/డిన్నర్: లంచ్ లేదా డిన్నర్ మెనూలో ఎల్లో రైస్, రాజ్మా లేదా చోలే, పికెల్ సాచెట్, మిక్స్‌డ్ వెజిటేబుల్స్‌తో పాటు ఏడు పూరీలు ఇస్తారు.
Advertisement

Also Read:  IRCTC దుబాయ్ టూర్, తక్కువ ఖర్చుతో ఎంజాయ్ చేయండి గురూ!

రైళ్లు ఆలస్యమైతే ఇతర సౌకర్యాలు

రైలు ఎక్కువ సమయం ఆలస్యం అయితే.. ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకోవచ్చు. డబ్బులు మొత్తం వాపస్ ఇస్తారు. రైళ్లు మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే ఈ సదుపాయం కల్పిస్తారు. ఎక్కడ బుక్ చేసుకుంటే.. అదే ప్లాట్‌ఫామ్ లో వాపస్ ప్రాసెస్ చేస్తారు. ప్రయాణికులు ఎటువంటి ఎక్స్ ట్రా ఛార్జీ చెల్లించకుండా వెయిటింగ్ హాల్‌లను యాక్సెస్ చేయవచ్చు. ఫుడ్ కౌంటర్లను అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచుతారు.

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×