E-Paper
Advertisement

Trains CCTV Cameras: ఇక రైళ్లలో సీసీటీవీ కెమెరాలు.. దేశవ్యాప్తంగా మొత్తం 74,000 బోగీలలో నిఘా

Trains CCTV Cameras: ఇక రైళ్లలో సీసీటీవీ కెమెరాలు.. దేశవ్యాప్తంగా మొత్తం 74,000 బోగీలలో నిఘా
Advertisement

Trains CCTV Cameras| రైల్వే ప్రయాణికుల భధ్రతను మెరుగుపరచడానికి, రైల్వే మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం దాని గురించి అధికారికంగా ప్రకటించింది. అన్ని ప్యాసెంజర్ కోచ్‌లు, లోకోమోటివ్‌లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

దేశంలోని మొత్తం 74,000 కోచ్‌లు, 15,000 లోకోమోటివ్‌లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆమోదం తెలిపారు. అంతకుముందు ఉత్తర రైల్వేకు చెందిన లోకో ఇంజన్లు, కోచ్‌లలో నిర్వహించిన ప్రయోగాత్మక పరీక్షలకు సానుకూల స్పందన రావడంతో ఇక దేశ వ్యాప్తంగా ఉన్న రైళ్లలో కూడా సిసిటీవి కెమెరాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

Advertisement

దొంగలు, వ్యవస్థీకృత గుండా గ్యాంగ్‌లు.. సామాన్య ప్రయాణికులపై దాడులు చేయడం, వారిని దోచుకోవడం వంటి సంఘటనలను సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ద్వారా గణనీయంగా తగ్గించడం రైల్వే శాఖ లక్ష్యం. “ప్యాసెంజర్ కోచ్‌లలో సీసీటీవీ కెమెరాల ప్రయోగాత్మక ఏర్పాటు సానుకూల ఫలితాలను ఇచ్చింది. అందుకే, అన్ని కోచ్‌లలో కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాము. ఈ చర్య ప్రయాణికుల సురక్షను గణనీయంగా మెరుగుపరుస్తుంది,” అని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.

రైలు ప్రయాణ సమయంలో భద్రత కోసం ప్రతి రైలు కోచ్‌లో నాలుగు డోమ్ రకం CCTV కెమెరాలు ఏర్పాటు చేస్తారు. రెండు కెమెరాలు ప్రతి ద్వారం వద్ద ఉంటాయి. ఇక లోకోమోటివ్‌లలో ఆరు కెమెరాలు ఉంటాయి.. ముందు, వెనుక, రెండు వైపులా ఒక్కో కెమెరా.

Advertisement

రైల్వే మంత్రి వైష్ణవ్.. ఉన్నతాధికారులతో సమావేశంలో పాల్గొన్నాక ఈ నిర్ణయం గురించి ప్రకటించారు. గంటకు 100 కి.మీ. వేగంతో ప్రయాణించే రైళ్లలోనూ, తక్కువ వెలుతురు పరిస్థితుల్లోనూ అధిక నాణ్యత గల వీడియో ఫుటేజ్ అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కెమెరాల ద్వారా సేకరించిన డేటాను ఇండియాAI మిషన్‌తో కలిసి కృత్రిమ మేధస్సు (AI) ఉపయోగించి విశ్లేషించబడుతుందని ఆయన వెల్లడించారు. ఈ AI టెక్నాలజీ.. రైలు ప్రయాణికుల భద్రతను మరింత పటిష్టం చేస్తుంది. ఈ ప్రణాళిక రైల్వే వ్యవస్థలో సురక్షిత, సమర్థవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని ఆయన అన్నారు.

Also Read: అమెరికాలో మాంసాహారం తినే ఈగల బెడద.. చనిపోతున్న పశువులు..

డేటా ప్రైవెసీ కోసం జాగ్రత్తలు
సిసిటీవి కెమెరాలు ఏర్పాటు చేసినా.. ప్రయాణికుల గోప్యతను కాపాడేందుకు రైల్వే శాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. సీసీటీవీ కెమెరాలను కేవలం సామాన్య ప్రాంతాల్లో, తలుపుల సమీపంలోనే ఏర్పాటు చేస్తారు. “కోచ్‌లలో సామాన్య ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడమే మా లక్ష్యం,” అని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ సీసీటీవీ కార్యక్రమంలో డేటా ప్రైవెసీ కి అత్యంత ప్రాధాన్యం ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×