E-Paper
Advertisement

Indian Railways: మీరు రిజర్వు చేసుకున్న సీట్లో వేరొకరు కూర్చున్నారా? ఇలా చేస్తే సీటు మీకు వచ్చేస్తుంది!

Indian Railways: మీరు రిజర్వు చేసుకున్న సీట్లో వేరొకరు కూర్చున్నారా? ఇలా చేస్తే సీటు మీకు వచ్చేస్తుంది!
Advertisement

Railway Rules:

ఆహ్లాదకరంగా రైలు ప్రయాణం చేయాలనుకుంటే ముందుగా బెర్త్ కన్ఫార్మ్ చేసుకోవాలి. ముందుగానే టికెట్ బుక్ చేసుకోవడం వల్ల హ్యాపీగా జర్నీ చేసే అవకాశం ఉంటుంది. అయితే, బెర్త్ బుక్ చేసుకున్నప్పటికీ, కొంత మంది టికెట్ లేని వాళ్లు ఆయా సీట్లలో కూర్చుంటారు. టికెట్ తీసుకున్న ప్రయాణీకులు వారిని లేవాలని చెప్పినా, అంగీకరించరు. ఒక్కోసారి గొడవకు దిగుతారు. అలాంటి సమయంలో వారితో ఎలాంటి గొడవ పెట్టుకోకుండా సీటు పొందేందుకు సాయం చేసేందుకు భారతీయ రైల్వే పలు రూల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE), రైల్‌ మద్దత్ పోర్టల్, హెల్ప్‌ లైన్ 139ని ఉపయోగించి మీ సమస్యకు పరిష్కారం పొందే అవకాశం ఉంటుంది.

రిజర్వేషన్ బెర్త్ కు సంబంధించి రైల్వే రూల్స్ ఏం చెప్తున్నాయంటే?

కన్ఫార్మ్ టికెట్ ఉన్న వారికి ప్రయాణ సమయంలో సదరు సీటు మీద పూర్తి హక్కులు ఉంటాయి. సరైన రిజర్వేషన్ లేకుండా ఎవరైనా సీటులో కూర్చున్నట్లయితే, వారిని ఆ సీటు నుంచి పంపించే అధికారం రైల్వే అధికారులకు ఉంటుంది. రిజర్వు చేయడిని బెర్త్ ఎలా పొందాలో చెప్పే రైల్వే రూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ TTEని సంప్రదించండి!

Advertisement

ఎవరైనా మీ సీటులో కూర్చున్నట్లు అయితే, వెంటనే ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE)కు చెప్పాలి. మీ టికెట్ ను తనకు చూపించి బెర్త్ ఇప్పించాలని కోరాలి. TTE ఇతర ప్రయాణీకుల టికెట్‌ను తనిఖీ చేసి తగిన యాక్షన్ తీసుకుంటారు.

⦿ RailMadadని ఉపయోగించండి!

రైల్ మద్దత్ అనేది ప్రయాణ సమయంలో ఫిర్యాదులు చేసే రైల్వే అధికారిక పోర్టల్. మీ మొబైల్ నంబర్, OTPతో లాగిన్ కావాలి. ముందుగా PNR వివరాలను ఎంటర్ చేయాలి. సంబంధిత ఫిర్యాదును సెలెక్ట్ చేయాలి. సమస్యను స్పష్టంగా రాసి సబ్మిట్ చేయాలి. మీ కంప్లైంట్ పరిష్కారం కోసం విధుల్లో ఉన్న రైల్వే సిబ్బందికి పంపబడుతుంది.

⦿ 139కి కాల్ చేయండి!

Advertisement

భారతీయ రైల్వే అధికారిక హెల్ప్‌ లైన్ 139కి కూడా కాల్ చెయ్యొచ్చు.  మీరు సమస్యను నేరుగా చెప్పడంతో పాటు SMS పంపే అవకాశం ఉంటుంది. ఇది ప్రయాణీకులను రైల్వే అధికారులతో అనుసంధానిస్తుంది. వారు రైల్లోని సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు.

Read Also: నదీ గర్భంలో 33 మీటర్ల లోతులో.. చిరుతలా దూసుకెళ్లే రైలు గురించి మీకు తెలుసా?

⦿ RPF, GRP సహాయాన్ని పొందండి!  

TTE ద్వారా సీటు వివాదం పరిష్కారం కాకపోతే.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) లేదంటే ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP) సహాయం కోరవచ్చు. వారి జోక్యంతో ద్వారా సీటును పొందే అవకాశం ఉంటుంది.

Read Also:మెట్రో ప్రారంభమైన 3 రోజులకే గుట్కా మరకలు, మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×