E-Paper
Advertisement

Metro Trains: మెట్రో సరికొత్త నిర్ణయం, రైళ్లలో కొత్త డిస్ ప్లే సిస్టమ్ వచ్చేసింది!

Metro Trains: మెట్రో సరికొత్త నిర్ణయం, రైళ్లలో కొత్త డిస్ ప్లే సిస్టమ్ వచ్చేసింది!
Advertisement

మెట్రో ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభాన్ని అందించేందుకు మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సమయం ఎంత అవుతుంది? నెక్ట్స్ ఇంటర్ ఛేంజ్ స్టేషన్ వచ్చేందుకు ఎంత సమయం పడుతుంది? చివరి స్టేషన్ వెళ్లే వరకు ఎంత అవుతుందనే విషయాన్ని తెలుసుకునేలా ఈ డిస్ ప్లే సిస్టమ్ ఉపయోగపడనుంది. అయితే, ఈ ఏర్పాట్లు చేసింది హైదరాబాద్ మెట్రో కాదు, ఢిల్లీ మెట్రో అధికారులు. ఢిల్లీ మెట్రో 18 రైళ్లను కొత్త డిస్ ప్లే సిస్టమ్‌లతో అప్‌ గ్రేడ్ చేసింది. ఇవి ప్రస్తుత సమయం, నెక్ట్స్ ఇంటర్‌ ఛేంజ్ స్టేషన్‌ వచ్చే టైమ్, ఆ రూట్ లోని చివరి స్టేషన్ చేరుకునేందుకు పట్టే సమయం లాంటి వివరాలు ఈ డిస్ ప్లేలో ప్రదర్శించబడుతాయి. అంతేకాదు, డైనమిక్ రూట్ మ్యాప్స్ కూ కనిపిస్తాయి. ప్రయాణీకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించనున్నాయి.

మెట్రో రైళ్లకు కొత్త హంగులు

ఢిల్లీ మెట్రో ఫేజ్ I కోసం 2002- 2005 మధ్య కొనుగోలు చేయబడిన 70 రైళ్లను ప్రస్తుతం అప్ డేట్ చేస్తున్నారు. ఈ రైళ్లకు మొత్తం 30 ఏళ్ల లైఫ్ టైమ్ ఉంటుంది. ఇప్పటికే ఆ రైళ్లు 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో 2021 నుంచి ఈ రైళ్లకు ఆధునిక మెరుగులు అద్దుతున్నారు. పునరుద్ధరణలో భాగంగా, రైళ్లకు CCTV కెమెరాలు, మొబైల్, ల్యాప్‌ టాప్ ఛార్జింగ్ పాయింట్లు, LCD రూట్ డిస్ ప్లేలు, కొత్త ఎలక్ట్రికల్ ప్యానెల్స్, మెరుగైన ఫ్లోరింగ్, తాజా ఇంటీరియర్ పెయింట్‌ ను అమర్చుతున్నారు. ఇప్పటికే పునరుద్ధరించిన ఫస్ట్ బ్యాచ్ 12 రైళ్లకు పబ్లిక్ అడ్రస్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఏర్పాటు చేయలేదు. ఈ మెరుగైన ఫీచర్లు 18 రైళ్ల రెండవ బ్యాచ్‌ కు యాడ్ చేశారు. జోడించబడ్డాయి. 22 రైళ్ల మూడవ బ్యాచ్‌కు కూడా ఈ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు. ఈ రైళ్ల అప్ డేట్ ప్రక్రియ 2027 నాటికి పూర్తవుతుందని ఢిల్లీ మెట్రో అధికారులు వెల్లడించారు.

Advertisement

Read Also: ప్రపంచంలోనే అద్భుతమైన రైళ్లు, పట్టాలెక్కాయంటే రైల్వే రూపురేఖలు మారాల్సిందే!

చివరి బ్యాచ్ 18 రైళ్లకు ఒప్పందం ఖరారు   

18 రైళ్ల చివరి బ్యాచ్ కు సంబంధించి DMRC దాదాపు ఒప్పందాన్ని ఖరారు చేసింది. ఇవి రాబోయే రెండేళ్ల లోపు అప్‌ గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది. పునరుద్ధరణ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు మరిన్ని రైళ్లు అప్ డేట్ చేయబడిన ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ లను అందుకుంటాయని అధికారులు ధృవీకరించారు. అప్‌ గ్రేడ్ చేయబడిన రైళ్లు ఇప్పుడు ఫేస్ 2, 3 కింద ప్రవేశపెట్టిన కొత్త రైళ్ల ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. ప్రతి రైలును పునరుద్ధరించడానికి దాదాపు 40 రోజుల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.  రోజువారీ ప్రయాణీకుల సేవలకు సరిపడ రైళ్లు అందుబాటులో ఉండేలా, మెట్రో కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలుగకుండా DMRC జాగ్రత్తగా అప్ గ్రేడ్ షెడ్యూల్‌ ను ప్లాన్ చేస్తోంది.

Advertisement

Read Also: సూరత్‌ బుల్లెట్ రైలు స్టేషన్‌ కు ప్రధాని మోడీ, పనుల పురోగతిపై సమీక్ష!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×