E-Paper
Advertisement

CP Sajjanar: సజ్జనార్ పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతా.. సీపీ ఏం చేశారంటే?

CP Sajjanar: సజ్జనార్ పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతా.. సీపీ ఏం చేశారంటే?
Advertisement

CP Sajjanar: సైబర్ కేటుగాళ్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ ను వదల్లేదు. ఇటీవల ఫేక్ వాట్సాప్ ఖాతాను సజ్జనార్ పేరిట క్రియేట్ చేసిన సైబర్ నేరగాళ్లు తాజాగా ఫేస్ బుక్ పై పడ్డారు. సీపీ సజ్జనార్ పేరిట ఫేస్ బుక్ లో నకిలీ ఖాతాను క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్నారు. సజ్జనార్ ఫేస్ బుక్ ఫాలోవర్స్ కు డబ్బులు కోసం మేసేజ్ లు పంపారు. ఈ మెసేజ్ ను నమ్మిన ఒకరు రూ.20 వేల బదిలీ చేశారు. విషయం సీపీ సజ్జనార్ కు చేరాడంతో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

సజ్జనార్ పేరుతో నకిలీ ఫేస్ బుక్

‘నా పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ ఖాతాలు సృష్టించి, నా స్నేహితులకు ‘నేను ఆపదలో ఉన్నాను. డబ్బులు పంపించండి’ అని సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపిస్తున్నారు. దురదృష్టవశాత్తు, నిజమే అనుకుని నా స్నేహితుడు ఒకరు రూ.20,000 మోసగాళ్ల ఖాతాకు పంపారు. నా వ్యక్తిగ‌త ఫేస్ బుక్ పేజీ లింక్ ఇది https://facebook.com/share/1DHPndApWj/. ఇది మిన‌హా నా పేరుతో ఉన్న మిగ‌తా ఖాతాల‌న్నీ న‌కిలివే. ఈ ఫేక్ ఖాతాల‌ను మెటా స‌హ‌కారంతో హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైం టీం తొల‌గించే ప‌నిలో ఉంది. నా పేరుతో లేదా ఏ అధికారి/ ప్రముఖ‌ వ్యక్తి పేరుతో ఫేస్ బుక్‌లో వ‌చ్చే రిక్వెస్ట్‌ల‌ను స్పందించ‌కండి.

Advertisement

డబ్బులు పంపాలని వచ్చే సందేశాలను అసలు నమ్మకండి. ఒక‌వేళ అలా ఎవ‌రైనా మెసేజ్‌లు చేస్తే.. ముందుగా ఫోన్ ద్వారా వ్యక్తిని స్వయంగా సంప్రదించి పరిశీలించండి. అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లు, వీడియో కాల్‌ ల‌ను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి. సైబర్ మోసాలను వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా http://cybercrime.gov.in లో రిపోర్ట్ చేయండి. మనమంతా జాగ్రత్తగా ఉంటేనే… సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా మనల్ని, మన డబ్బును కాపాడుకోగలం’ అని ఎక్స్ వేదికగా సజ్జనార్ పోస్టు పెట్టారు.

Also Read: Mahabubabad News: ఇది ఎమ్మార్వో ఆఫీసుల్లో పరిస్థితి.. రూ.4వేలు ఇస్తేనే పట్టా ఇస్తాం.. ఈ రైతు ఆవేదన చూడండి..

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×