// // Best Time to Book Flights: తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం.. సింపుల్ గా టికెట్లు ఇలా బుక్ చేసుకోండి! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Best Time to Book Flights: తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం.. సింపుల్ గా టికెట్లు ఇలా బుక్ చేసుకోండి!

Best Time to Book Flights: తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం.. సింపుల్ గా టికెట్లు ఇలా బుక్ చేసుకోండి!
Advertisement

Best Days to Book Flights from India: విమాన ప్రయాణం అనేది ఖరీదైన వ్యవహారం అని చాలా మంది భావిస్తారు. కానీ, అందులో కొంత నిజం ఉన్నా, పూర్తిగా నిజం కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తక్కువ ధరకు విమాన ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.  వాస్తవానికి విమాన టికెట్ ధరలు డైనమిక్ గా ఉంటాయి. అంటే డిమాండ్ కు అనుగుణంగా పెరుగతూ ఉంటాయి. అయితే, వారంలోని కొన్ని రోజులలో డిమాండ్ తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో తక్కువ ధరలో విమాన ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. విమాన టికెట్ బుక్ చేసుకోవడానికి బెస్ట్ రోజు ఏది? ఎందుకు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

విమాన టికెట్ బుక్ చేసుకోవడానికి బెస్ట్ డే ఫ్రై డే!

విమాన టికెట్ ధరలు హెచ్చు తగ్గుదలతో కొనసాగుతాయి. వారంలో తక్కువ డిమాండ్ రోజు బెస్ట్ డీల్ పొందే అవకాశం ఉంటుంది. కొన్ని విమానయాన నివేదికల ప్రకారం టికెట్ బుక్ చేసుకోవడానికి బెస్ట్ డే ఫ్రై డే. విమాన టికెట్ ఎంత ముందుగా బుక్ చేసుకున్నాం అనేది కాకుండా, ఎంత తక్కువ ధరకు టికెట్ పొందాం అనేది ముఖ్యం. అయితే, దేశీయ ప్రయాణాలకు ఒకటి నుంచి మూడు నెలల ముందుగా టికెట్ బుక్ చేసుకోవడం మంచిది. అంతర్జాతీయ ప్రయాణాలకు రెండు నుంచిఎనిమిది నెలల ముందుగా బుక్ చేసుకుంటే, తక్కువ ధరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది.

ప్రయాణానికి ఏ రోజు బెస్ట్?  

Advertisement

వాస్తవానికి వారంలో తక్కువ ధరలో విమాన ప్రయాణం చేయడానికి బెస్ట్ డే శుక్రవారం. 2026 ఎక్స్‌ పీడియా డేటా ప్రకారం వారంలోని ప్రతి రోజు సగటు ధర ర్యాంక్ చేస్తుంది. దేశీయ విమానాలకు చౌకైన ప్రయాణ రోజులను ఈ డేటా వెల్లడించింది.  అత్యంత చౌకైన రోజులు శుక్రవారం, గురువారం, మంగళవారం, బుధవారం, శనివారం, సోమవారం. అత్యంత ఖరీదైన ప్రయాణ రోజు ఆదివారం.

సోమవారం, ఆదివారం విమానాల్లో ప్రయాణం వద్దు!   

ఆదివారం, సోమవారం దేశీయంగా ప్రయాణించడానికి అత్యంత ఖరీదైన రోజులుగా ఉంటాయి. శుక్రవారం లేదంటే మంగళవారం ప్రయాణించలేకపోతే, మంగళవారం నుంచి గురువారం వరకు ప్రయాణించడం వల్ల చౌకగా వెళ్లొచ్చు. ఇక అంతర్జాతీయ ప్రయాణానికి ఈ నిబంధనలు వర్తించవు. కానీ, వారం మధ్యలో బయలుదేరేవి ఇప్పటికీ చౌకైన ఆప్షన్స్ గా చెప్పుకోవచ్చు.

విమాన ప్రయాణానికి చౌకైన, ఖరీదైన నెలలు

Advertisement

విమాన ప్రయాణానికి చౌకైన నెలలు సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్, జనవరి కాగా, విమాన ప్రయాణానికి అత్యంత ఖరీదైన నెలలు డిసెంబర్, జూన్, జూలైగా చెప్పుకోవచ్చు. జనవరి, సెప్టెంబర్ నెలలు ఎక్కువ డిమాండ్ ను కలిగి ఉంటాయి.

2026 సెలవులకు ఎప్పుడు టికెట్ బుక్ చేసుకోవాలి?  

కచ్చితంగా, సెప్టెంబర్ సాధారణంగా విమాన ప్రయాణానికి చౌకైన నెలలలో ఒకటి. కానీ, లేబర్ డే వీకెండ్ లో ఈ నియమాలు వర్తించవు. సెలవు రోజుల్లో సాధారణంగా ఎక్కువ మంది ప్రయాణిస్తారు. కాబట్టి తక్కువ విమాన సీట్లు అందుబాటులో ఉంటాయి. అధిక ధరలు ఉంటాయి.

Read Also:ఫ్లైట్ టికెట్ కొనేందుకు డబ్బులు లేవా? నో టెన్షన్, హ్యాపీగా ట్రావెల్ చెయ్యొచ్చు!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×