E-Paper
Advertisement

Gadwal District: దర్జాగా ఫుట్‌పాత్‌లపై అక్రమ దుకాణాలు ఏర్పాటు.. పట్టించుకోని అధికారులు

Gadwal District: దర్జాగా ఫుట్‌పాత్‌లపై అక్రమ దుకాణాలు ఏర్పాటు.. పట్టించుకోని అధికారులు
Advertisement

Gadwal District: స్వేచ్ఛ బ్యూరో: జోగుళాంబ గద్వాల జిల్లా‌ కేంద్రంలో పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లపై ఎలాంటి ఆక్రమణలు లేకుండా, పాదచారులు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకునే అంశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు వైఫల్యం చెందారన్న విమర్శలున్నాయి. కొత్త బస్టాండ్, పాతబస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, ఎంఅర్ఓ ఆపీస్, భీంనగర్, బీరొల్లి చౌరస్తా, తదితర ప్రాంతాలలో రోడ్డుకు ఇరువైపుల ఉన్న ఖాళీ జాగను ఆక్రమించి డబ్బాలతో దుకాణాలు ఏర్పాటు చేశారు.

ప్రశ్నిస్తే ఎదురుదాడి..

ప్రశ్నించిన వారికి దర్జాగా పెడ్తాం.. ఏం చేసుకుంటారో చేస్కోండని అంటున్నారని కొందరు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, నాయకులు అండదం డలతోనే ఫుట్‌పాత్‌లపై దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్డుకిరువైపులా కొన్నేళ్లుగా డబ్బాలతో స్థలాన్ని ఆక్రమించి, చివరికి పర్మినెంట్‌ స్ట్రక్చర్‌తో దుకాణాలను ఏర్పాటు చేసుకున్న సందర్భాలున్నాయి. ఈ నిర్మాణాలన్నీ ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగేవిధంగా ఉన్నా, నేటి వరకు ఆ దుకాణాలను తొలగించే ప్ర యత్నాలను అధికారులు చేపట్టకపోవడంతో ఆడిందే ఆటగా మారింది.

Advertisement

Also Read: Telangana Tourism: తెలంగాణ టూరిజంలో రసవత్తరంగా మారిన ఈడీ రాజకీయం..?

రోడ్డుపైనే నలుస్తున్న వాహనాలు

టిఫిన్ సెంటర్లు, కూరగాయల దుకాణాలు, మెకానిక్ షెడ్లు, పండ్ల దుకాణాలు సైతం రోడ్డు రాకపోకలకు అంతరాయం కలిగేలా ఇరువైపులా విచ్చలవిడిగా ఏర్పాటు చేయడంతో వాహనదారులు రోడ్డుపైనే వాహనాలను నిలిపి పళ్ళను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఫుట్‌పాత్‌లపై వెలిసిన షాపులను తొలగించాలని, పాదచారుల కోసం నిర్మించిన ఫుట్‌పాత్‌ను కేవలం పాదచారులే వినియోగించేవిధంగా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Also Read: Pakistan vs Sri Lanka: అమ్ముడుపోయిన శ్రీలంక‌..పాకిస్తాన్ చేతిలో ఓడిపోయేందుకు డీలింగ్‌..!ఇక ఇండియాలో నో ఫైన‌ల్స్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×