E-Paper
Advertisement

పొద్దున్నే వెళ్లి సాయంత్రానికి రావచ్చు.. హైదరాబాద్ దగ్గర్లోని టాప్ 4 టూరిస్ట్ స్పాట్స్!

పొద్దున్నే వెళ్లి సాయంత్రానికి రావచ్చు.. హైదరాబాద్ దగ్గర్లోని టాప్ 4 టూరిస్ట్ స్పాట్స్!
Advertisement

One day trip places near hyderabad 2026: హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు, స్టూడెంట్స్, ఫ్యామిలీస్‌కు వారం అంతా ఆఫీసులు, చదువులతో లైఫ్ బోర్ కొట్టేస్తుంది. అందుకే శని, ఆదివారాలు రాగానే కాస్త ప్రశాంతత కోసం, మైండ్ రిఫ్రెష్ చేసుకోవడానికి పొద్దున్నే కార్ లేదా బైక్ వేసుకుని బయలుదేరి.. సాయంత్రానికి ఇంటికి వచ్చేసే వన్ డే ట్రిప్ ప్రదేశాల కోసం విపరీతంగా వెతుకుతుంటారు. అలాంటి వారి కోసం తక్కువ టైమ్‌లో ఎక్కువ ఎంజాయ్ చేయగలిగే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న టాప్ 4 ట్రెండింగ్ ప్లేసెస్, వాటి రూట్ మ్యాప్, ఖర్చుల పూర్తి వివరాలు మీకోసం.

హైదరాబాద్ దగ్గరలో.. బెస్ట్ వన్ డే ట్రిప్స్:

1.అనంతగిరి కొండలు (వికారాబాద్)-పచ్చదనానికి కేరాఫ్ అడ్రస్:

హైదరాబాద్ జనాభాకు ఊటీ ఫీలింగ్ ఇచ్చే ఏకైక ప్రదేశం వికారాబాద్‌లోని అనంతగిరి కొండలు. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో ఇక్కడి వ్యూ పాయింట్లు, దట్టమైన అడవి మధ్యలో పొగమంచు భలే ఆకట్టుకుంటాయి. ట్రెకింగ్ ఇష్టపడేవారికి, నేచర్ లవర్స్ కి ఇది బెస్ట్ ప్లేస్. ఇక్కడి అనంత పద్మనాభ స్వామి గుడి కూడా చాలా ఫేమస్. చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ ఉంటాయి.

Advertisement

ఎలా వెళ్ళాలి: హైదరాబాద్ గచ్చిబౌలి లేదా మెహదీపట్నం నుంచి చేవెళ్ల మీదుగా వికారాబాద్‌కు రోడ్డు మార్గంలో ఈజీగా వెళ్ళవచ్చు. ఇది దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సొంత వెహికిల్ లేదా బస్సుల్లో కూడా వెళ్ళవచ్చు. సికింద్రాబాద్ నుంచి వికారాబాద్ వరకు ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది.

ఖర్చులు: బైక్ లేదా కారు ఫ్యూయల్, అక్కడ చిన్నపాటి ఫుడ్ ఖర్చులతో కలిపి ఒక వ్యక్తికి కేవలం రూ.600 నుంచి రూ.1,200 లోపు ట్రిప్ అయిపోతుంది.

Advertisement

బెస్ట్ టైమ్: జులై నుంచి జనవరి మధ్య కాలంలో వెళ్తే ఇక్కడి ప్రకృతి అందాలను, చలి గాలులను ఫుల్లుగా ఎంజాయ్ చేయవచ్చు.

2. భోంగీర్ ఖిల్లా (భువనగిరి)-అడ్వెంచర్ లవర్స్ అడ్డా:

మీకు కొంచెం అడ్వెంచర్, ట్రెకింగ్, హిస్టరీ ఇష్టమైతే భోంగీర్ ఖిల్లా పర్ఫెక్ట్ ఆప్షన్. ఒకే ఒక పెద్ద ఏకశిలా రాతి కొండపై నిర్మించిన ఈ కోట ఎక్కడం ఒక క్రేజీ ఫీలింగ్ ఇస్తుంది. ఇక్కడి రాక్ క్లైంబింగ్ స్కూల్‌లో అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ట్రై చేయవచ్చు. కొండ పైకి వెళ్ళాక చుట్టుపక్కల కనిపించే వ్యూస్ ఫోటోలకు అద్భుతంగా ఉంటాయి.

ఎలా వెళ్ళాలి: హైదరాబాద్ ఉప్పల్ నుంచి వరంగల్ హైవే (NH 163) మీదుగా భువనగిరికి ఈజీగా చేరుకోవచ్చు. ఇది ఉప్పల్ నుంచి కేవలం 50 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఉప్పల్ బస్ స్టాండ్ నుంచి ప్రతి 10 నిమిషాలకో ఆర్టీసీ బస్సు ఉంటుంది. లోకల్ ట్రైన్స్ కూడా ఉన్నాయి.

ఖర్చులు: ఎంట్రీ టికెట్ చాలా తక్కువ. ట్రావెలింగ్, ఫుడ్ అన్నీ కలుపుకొని ఒక వ్యక్తికి రూ.500 నుంచి రూ.800 బడ్జెట్ సరిపోతుంది.

బెస్ట్ టైమ్: ఎండలు తక్కువగా ఉండే సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి నెలల మధ్య వెళ్లడం మంచిది. కొండ ఎక్కాలి కాబట్టి ఉదయం 7 గంటలకే అక్కడికి చేరుకుంటే ఎండ అలసట లేకుండా ఉంటుంది.

3. కొండపోచమ్మ సాగర్ & మల్లన్న సాగర్ -లేటెస్ట్ ట్రెండింగ్ స్పాట్స్:

రీసెంట్‌గా హైదరాబాద్ యూత్‌కు, బైక్ రైడర్స్‌కు మోస్ట్ ఫేవరెట్ స్పాట్‌గా మారాయి కొండపోచమ్మ, మల్లన్న సాగర్ రిజర్వాయర్లు. సువిశాలమైన నీటి నిల్వ, డ్యామ్ కట్టపై లాంగ్ డ్రైవ్స్, చల్లని గాలి అచ్చం సముద్ర తీరాన్ని తలపిస్తాయి. సన్‌రైజ్ చూడటానికి ఉదయం 5 గంటలకే బైక్‌ల మీద ఇక్కడికి గుంపులు గుంపులుగా జనం వస్తుంటారు.

ఎలా వెళ్ళాలి: సికింద్రాబాద్ లేదా జూబ్లీ బస్ స్టేషన్ నుంచి కరీంనగర్ హైవే మీదుగా ఈజీగా వెళ్ళవచ్చు. కొండపోచమ్మ సాగర్ హైదరాబాద్ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సొంత కారు లేదా బైక్ పై వెళ్లడం బెస్ట్ ఆప్షన్.

ఖర్చులు: ఇక్కడ ఎలాంటి ఎంట్రీ ఫీజులు ఉండవు. కేవలం పెట్రోల్ , హైవే పక్కన దొరికే టిఫిన్, టీ ఖర్చులు మాత్రమే ఉంటాయి. ఒక వ్యక్తికి రూ.400 నుంచి రూ.700 లోపే ఖర్చవుతుంది.

బెస్ట్ టైమ్: జూన్ నుంచి మార్చి వరకు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళవచ్చు. అయితే ఉదయం పూట లేదా సాయంత్రం వేళల్లో వెళ్తే క్లైమేట్ చాలా బాగుంటుంది.

Also Read: తెలంగాణలో టాప్ జలపాతాలు.. ఈ వర్షాకాలంలో అస్సలు మిస్ అవ్వకూడని క్రేజీ స్పాట్స్!

4. లక్నవరం చెరువు & రామప్ప గుడి (వరంగల్):

కాస్త ఎక్కువ దూరం లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి, నైట్ స్టే కూడా ప్లాన్ చేసుకోవాలి అనుకునే వారికి వరంగల్ లోని లక్నవరం, రామప్ప బెస్ట్ కాంబినేషన్. లక్నవరంలోని సస్పెన్షన్ బ్రిడ్జ్ (ఊగే వంతెన), బోటింగ్, దీవుల మధ్య ఉండే రిసార్ట్స్ అద్భుతమైన ఫీలింగ్ ఇస్తాయి. పక్కనే ఉన్న ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప గుడి శిల్పకళను కూడా చూడొచ్చు.

ఎలా వెళ్ళాలి: హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా ములుగు రోడ్డులో లక్నవరం వెళ్ళాలి. ఇది దాదాపు 210 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వరంగల్ వరకు ట్రైన్ లేదా బస్సులో వెళ్లి.. అక్కడ నుంచి లోకల్ వెహికల్స్ మాట్లాడుకోవచ్చు లేదా సొంత కారులో వెళ్లడం సౌకర్యవంతంగా ఉంటుంది.

ఖర్చులు: దూరం ఎక్కువ కాబట్టి ఫ్యూయల్, బోటింగ్, ఫుడ్ అన్నీ కలిపి ఒక వ్యక్తికి వన్ డే ట్రిప్‌కు రూ.1,500 నుంచి రూ.2,500 వరకు అవుతుంది (ఒకవేళ హరిత రిసార్ట్స్‌లో స్టే చేస్తే రూమ్ రెంట్ అదనం).

బెస్ట్ టైమ్: చెరువులో నీళ్లు ఫుల్లుగా ఉండే ఆగస్టు నుండి ఫిబ్రవరి నెలల మధ్య కాలం ఇక్కడికి వెళ్ళడానికి చాలా పర్ఫెక్ట్ టైమ్.

వారమంతా ఉండే వర్క్ స్ట్రెస్ నుంచి.. ప్రశాంతంగా గడపడానికి ఈ నాలుగు ప్రదేశాలు సూపర్ ఛాయిస్. తక్కువ టైమ్, తక్కువ బడ్జెట్ ఉంటే కొండపోచమ్మ లేదా భువనగిరి ప్లాన్ చేయండి. కాస్త ప్రకృతితో గడపాలి అనుకుంటే అనంతగిరి కొండలు, సరికొత్త బోటింగ్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే లక్నవరం వెళ్ళండి.

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×