// // Elephant Deaths: రైలు ప్రమాదాల్లో బలవుతున్న గజరాజులు.. ఏడాదిలో ఎన్ని ప్రాణాలు కోల్పోయాయంటే? -->
E-Paper
Advertisement

రైలు ప్రమాదాల్లో బలవుతున్న గజరాజులు.. ఏడాదిలో ఎన్ని ప్రాణాలు కోల్పోయాయంటే?

రైలు ప్రమాదాల్లో బలవుతున్న గజరాజులు.. ఏడాదిలో ఎన్ని ప్రాణాలు కోల్పోయాయంటే?
Advertisement

రైలు ప్రమాదాల్లో గజరాజుల మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా అస్సాంలో రైలు ప్రమాదాలు, విద్యుదాఘాతం, విషప్రయోగం లాంటి కారణాలతో ఏనుగుల చావులు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఏనుగుల దాడుల కారణంగా పలువురు మనుషులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.

తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి!

Advertisement

పర్యావరణ, అటవీ శాఖ, వైల్డ్‌ లైఫ్ ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్  నిర్వహించిన తాజా అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2009 నుంచి 2024 వరకు 16 ఏళ్ల కాలానికి సంబంధించిన గణాంకాలను పరిశీలించి ఈ నివేదిక రూపొందించారు. ఈ కాలంలో దేశ వ్యాప్తంగా మొత్తం 1,653 ఏనుగులు చనిపోయాయి. విద్యుత్ షాక్, రైలు ప్రమాదాలు, వేట, విషప్రయోగం కారణంగా ఏనుగులు చనిపోతున్నట్లు గుర్తించారు.  ఒడిశా తర్వాత అత్యధిక ఏనుగుల మరణాలు అస్సాంలో నమోదయ్యాయి.

అస్సాంలో 82 ఏనుగులు మృతి

రైలు ప్రమాదాల కారణంగా దేశ వ్యాప్తంగా 225 ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. అందులో అస్సాంలోనే 82 మరణాలు నమోదయ్యాయి. ఇది అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ. పశ్చిమ బెంగాల్‌ లో 62 ఏనుగులు రైలు ప్రమాదాల్లో మరణించాయి. విద్యుదాఘాతం వల్ల దేశ వ్యాప్తంగా 1,105 ఏనుగులు చనిపోయాయి. ఈ లిస్టులో ఒడిశా మొదటి స్థానంలో ఉండగా, కర్ణాటక, అస్సాం తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అస్సాంలో 172 ఏనుగులు విద్యుదాఘాతంతో మరణించినట్లు నివేదిక వెల్లడించింది.  విషప్రయోగంతో దేశవ్యాప్తంగా 79 ఏనుగులు చనిపోగా, అందులో 45 మరణాలు అస్సాంలోనే నమోదయ్యాయి. వేట కారణంగా జరిగిన మరణాల్లో కూడా అస్సాం ముందువరుసలో ఉంది. అక్కడ 27 ఏనుగులు వేటగాళ్ల బారిన పడ్డాయి.

ఏనుగుల దాడిలో 7,868 మంది మరణం

Advertisement

మరోవైపు, ఏనుగుల దాడుల వల్ల మనుషులు కూడా పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. 2009 నుంచి 2024 వరకు దేశంలోని 16 రాష్ట్రాల్లో మొత్తం 7,868 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి ఏడాది సగటున దాదాపు 500 మంది మరణించారు.  ఈ మరణాల్లో ఎక్కువ మంది ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాంలోనే చోటుచేసుకున్నాయి. ఒక్క అస్సాంలోనే 1,161 మంది ఏనుగుల దాడుల కారణంగా చనిపోయినట్లు అధ్యయనం వెల్లడించింది.

ఏనుగుల ఆవాస ప్రాంతాలు తగ్గిపోవడం, అడవులు విచ్ఛిన్నం కావడం, వ్యవసాయ విస్తరణ, రహదారులు, రైల్వే మార్గాలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా ఈ మరణాలు జరుగుతున్నట్లు నివేదిక అభిప్రాయపడింది. అయితే, ఈ ప్రమాదణ నివారణ చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నట్లు అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా సౌరశక్తితో పనిచేసే ఫెన్సింగ్,  మొబైల్ ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు ఏనుగుల మరణాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది.  స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, సాంకేతికతను వినియోగించడం ద్వారా మానవులు, ఏనుగుల మరణాలను తగ్గించే అవకాశం ఉందని నివేదిక అభిప్రాయపడింది.

Read Also: రైల్వే స్టేషన్ లో పోలీస్ పరీక్ష అభ్యర్థుల రచ్చ రచ్చ.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసు!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×