E-Paper
Advertisement

హైబ్రిడ్ కార్లపై మారుతి సూపర్ ఆఫర్లు.. ఏకంగా రూ. 2.15 లక్షల తగ్గింపు!

హైబ్రిడ్ కార్లపై మారుతి సూపర్ ఆఫర్లు.. ఏకంగా రూ. 2.15 లక్షల తగ్గింపు!
Advertisement

Maruti June 2026 Discounts: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో హైబ్రిడ్ కార్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇంధన సామర్థ్యం, తక్కువ కాలుష్యం, మెరుగైన పనితీరు కారణంగా వినియోగదారులు హైబ్రిడ్ వాహనాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం టయోటా, మారుతి సుజుకి, హోండా సహా పలు కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో మారుతి సుజుకి జూన్ 2026 నెలకు సంబంధించి తన హైబ్రిడ్ మోడళ్లపై  క్రేజీ ఆఫర్లను ప్రకటించింది. విక్టోరిస్, గ్రాండ్ విటారా, ఇన్విక్టో లాంటి మోడళ్లపై భారీగా తగ్గింపులు అందిస్తోంది.

మారుతి విక్టోరిస్‌పై క్రేజీ తగ్గింపులు

మారుతి విక్టోరిస్ హైబ్రిడ్ ఎస్‌యూవీపై కంపెనీ మొత్తం రూ.90,000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్లపై రూ.60,000 వరకు, సీఎన్‌జీ వేరియంట్లపై రూ.80,000 వరకు తగ్గింపులు లభిస్తున్నాయి.  ప్రస్తుతం విక్టోరిస్ ధర రూ.10.50 లక్షల నుంచి రూ.19.99 లక్షల వరకు ఉంది. మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఈ మోడల్ మంచి ఆదరణ పొందుతూ లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని కూడా దాటింది.

గ్రాండ్ విటారాపై ప్రత్యేక ప్రయోజనాలు

Advertisement

మారుతి గ్రాండ్ విటారా హైబ్రిడ్ వేరియంట్లపై కూడా కంపెనీ మంచి డిస్కౌంట్లు ప్రకటించింది. స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడళ్లపై మొత్తం రూ.90,000 వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. జీటా, ఆల్ఫా వేరియంట్ల కొనుగోలుదారులకు డిస్కౌంట్లతో పాటు 5 సంవత్సరాల వరకు ఎక్సెండెడ్ వారంటీని ఉచితంగా అందిస్తున్నారు. సిగ్మా మాన్యువల్ వేరియంట్‌ పై అత్యధికంగా రూ.1.35 లక్షల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో కన్స్యూమర్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్, డీలర్ డిస్కౌంట్, లాయల్టీ బెనిఫిట్, కార్పొరేట్ బెనిఫిట్స్ ఉన్నాయి. డెల్టా పెట్రోల్ వేరియంట్లపై రూ.1.25 లక్షల వరకు, సీఎన్‌జీ, హైబ్రిడ్ వేరియంట్లపై రూ.70,000 వరకు తగ్గింపులు లభిస్తున్నాయి.

ఇన్విక్టోపై భారీ డిస్కౌంట్

మారుతి ప్రీమియం హైబ్రిడ్ ఎంపీవీ అయిన ఇన్విక్టోపై అత్యధిక ప్రయోజనాలు ప్రకటించింది. ఈ మోడల్‌ పై మొత్తం రూ.2.15 లక్షల వరకు తగ్గింపులు పొందే అవకాశం ఉంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్,  కార్పొరేట్ బెనిఫిట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇన్విక్టో ధరలు రూ.24.97 లక్షల నుంచి రూ.28.70 లక్షల మధ్య ఉన్నాయి. పెద్ద కుటుంబాలకు అనుకూలంగా ఉండే ఈ హైబ్రిడ్ ఎంపీవీపై భారీ ఆఫర్ రావడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు.  హైబ్రిడ్ కారును కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి జూన్ నెలలో మారుతి అందిస్తున్న ఈ ఆఫర్లు మరింత ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

Read Also: 550 కి.మీ రేంజ్‌తో టాటా సియెర్రా EV.. మహీంద్రా BE 6కు గట్టి సవాల్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×