E-Paper
Advertisement

వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అనంతగిరిలో సరికొత్త ‘ఎకో పార్క్’ సిద్ధం.. ఇక సఫారీ, ట్రెకింగ్ ఎంజాయ్ చేయండి!

వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అనంతగిరిలో సరికొత్త ‘ఎకో పార్క్’ సిద్ధం.. ఇక సఫారీ, ట్రెకింగ్ ఎంజాయ్ చేయండి!
Advertisement

Ananthagiri Park: స్వేచ్ఛ బ్యూరో: నిత్యం ఉద్యోగాలు, బీజినెస్ లు వివిధ పనుల్లో నిమగ్నమవుతున్న ప్రజలు వీకెండ్ లో ప్రశాంతత కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. హైదరాబాద్ కు దగ్గరలో వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అటవీ ప్రాంతం ఆకట్టుకుంటుంది. ఇప్పటికే తెలంగాణ ఊటీగా పేర్కొందిన అనంతగిరిలో పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు అటవీశాఖ సరికొత్త హంగులతో ‘ఎకో అర్బన్ పార్కు’ను సిద్ధం చేసింది. అనంతగిరి అటవీ ప్రాంతంలో నందిఘాట్ సమీపంలో సుమారు 80 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.2.50 కోట్ల అంచనా వ్యయంతో ఏకో అర్బన్ ఈ పార్కును తీర్చిదిద్దారు. దీనిని సోమవారం పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ పార్కు పర్యాటకులను అమితంగా ఆకర్షించబోతుందని అధికారులు తెలిపారు.

పర్యాటకులను కట్టిపడేసే అనంతగిరి ఎకో పార్క్‌

Advertisement

అనంతగిరిలో పర్యాటకులకు కను విందు చేసేలా ఎకో అర్బన్ పార్కును నిర్మించారు. ఆకట్టుకునేలా ఎంట్రన్స్​ గేట్​తోపాటు ట్రెక్కింగ్ పాత్, సావనీర్​ షాపు, కొండల్లో గ్రాస్​ ల్యాండ్​ ఏరియాలో పెద్ద గజబోలు, అర్బన్​ పార్కులో రెండు గజబోలు, సముద్ర నీటిమట్టానికి 700 మీటర్ల ఎత్తున పెద్ద వాచ్​ టవర్​ ​ ఏర్పాటు చేశారు. తూర్పు వైపున మరో వాచ్​ టవర్​ నిర్మించారు. వీటి ద్వారా అనంతగిరి ఫారెస్ట్​ వ్యూను తలపించే వెసులుబాటు కల్పించారు. ఇది మూసీ జన్మస్థలం ఈ ప్రాంతంలో సుందరీకరణ పనులు చేపట్టారు. ఈ పార్కు ఏర్పాటుతో స్థానికం ప్రజలకు ఉపాధికి అవకాశం కలుగనుంది. అటవీ అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ) నిధులతో ఈ పార్కును అభివృద్ది చేశారు.

పర్యాటకులకు మరింత సౌకర్యం

Advertisement

పర్యాటకుల వసతి కోసం ఫారెస్ట్​ కార్పొరేషన్​ డెవలప్​మెంట్​ ఆధ్వర్యంలో పర్యాటకులు బస చేసేందుకు కాటేజీలు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం నాలుగు కాటేజీలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సందర్శకుల సంఖ్యకు అనుగుణంగా మరిన్ని కాటేజీలు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు. పర్యాటకుల కోసం ఉల్లాసభరితంగా ఉండేలా బుష్​ బ్రేక్​ ఫాస్ట్​, బార్డ్​ వాచ్​ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.

పర్యాటకులకు సఫారీ వాహనాలు

పర్యాటకులు ఆన్​లైన్​ తోపాటు నేరుగా కాటేజీల దగ్గరైనా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. గ్రాస్ ల్యాండ్ లో పర్యటించేందుకు సఫారీ వాహనాలు ఏర్పాటు చేశారు. కాటేజీల నిర్వహణ బాధ్యతలను ఎఫ్​డీసీ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. ఒకరోజు ఒక వ్యక్తికి రూ.3,800 నిర్ణయించారు. ఇందులోనే బ్రేక్​ ఫాస్ట్​, భోజనంతోపాటు వసతి కల్పిస్తున్నారు. ఇద్దరికి రూ.7,600 చొప్పున ఎంట్రీ ఫీజు నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉండటంతో వీకెండ్స్​లో ఎక్కువ మంది సందర్శకులు వస్తారని, వారికి ఆహ్లాదం అందించేలా మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. అనంతగిరి కొండలపై పర్యావరణం దెబ్బతినకుండా అభివృద్ధి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

వీకెండ్ టూరిజానికి కొత్త అడ్రస్

ప్రకృతి రమణీయం అనంతగిరి కొండలు. పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. పర్యాటకులను ఆకట్టుకునేందుకు అనంతగిరి ఎకో పార్కు అభివృద్ధి చేశాం. పర్యాటకులు రాత్రి సైతం చేసేలా సదుపాయాలు కల్పించాం. హైదరాబాద్ 60 కిలో మీటర్ల సమీపంలో ఉండటం చెట్లు ఉండటం, 50 రకాల ఔషధ మొక్కలు సైతం ఉన్నాయి. ఇవి ఆకట్టుకుంటున్నాయి. పర్యావరణంకు ఎలాంటి ఆటంకం కలుగకుండా అభివృద్ధి పనులను ఎఫ్డీసీ ఆధ్వర్యంలో పార్కును ఏర్పాటు చేశాం.

నేడు ఎకో అర్బన్ పార్కు ప్రారంభించనున్న స్పీకర్ అనంతగిరి కొండల్లో నిర్మించిన ఎకో అర్బన్ పార్కును ఈ నెల 20న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పీసీసీఎఫ్ సువర్ణ ప్రారంభిస్తున్నారు. అందుకోసం ఏర్పాట్లు చేసినట్లు వికారాబాద్ డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్ తెలిపారు.

Also Read: ట్రంప్ పంతం.. ఇరాన్ పట్టుదల.. గల్ఫ్ యుద్ధ మేఘాల మధ్య నలుగుతున్న ప్రపంచం!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×