E-Paper
Advertisement

కప్పలకు అండర్‌ పాస్‌ లు నిర్మిస్తున్న ఫ్రాన్స్.. భలే ఐడియా గురూ!

కప్పలకు అండర్‌ పాస్‌ లు నిర్మిస్తున్న ఫ్రాన్స్.. భలే ఐడియా గురూ!
Advertisement

Unique Wildlife Project: మనుషుల కోసం ఫ్లైఓవర్లు, అండర్‌ పాస్‌ లు నిర్మించడం సాధారణమే. కానీ, చిన్న చిన్న కప్పలు, సాలమండర్లు, టోడ్ ల ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేకంగా భూగర్భ సొరంగాలు నిర్మిస్తున్న దేశం గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ వినూత్న ఆలోచనను అమలు చేస్తోంది ఫ్రాన్స్. ప్రతి సంవత్సరం వేలాది ఉభయచర జీవుల ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

కప్పల కోసం ప్రత్యేక అండర్‌పాస్‌లు

వసంతకాలం ప్రారంభమైన వెంటనే కప్పలు, టోడ్‌లు, న్యూట్‌ లు, సాలమండర్లు అడవుల్లోని తమ ఆశ్రయాలను విడిచిపెట్టి సంతానోత్పత్తి కోసం చెరువులు, చిత్తడి ప్రాంతాలకు వెళ్తాయి. అయితే, వాటి సహజ మార్గాల మధ్య ఇప్పుడు రహదారులు రావడంతో, రోడ్లు దాటే సమయంలో చాలా జీవులు వాహనాల కింద పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ సమస్యను తగ్గించేందుకు ఫ్రాన్స్ అధికారులు ‘క్రాపౌడక్స్’ అనే ప్రత్యేక భూగర్భ సొరంగాలను నిర్మిస్తున్నారు. ఇవి రోడ్డు కింద ఏర్పాటు చేసిన చిన్న అండర్‌ పాస్‌లు. కప్పలు, ఇతర ఉభయచరాలు రోడ్డుపైకి రాకుండా నేరుగా ఈ సొరంగాల గుండా మరో వైపుకు వెళ్లేలా వీటిని రూపొందించారు. అంతేకాదు, జంతువులు సొరంగం వైపే వెళ్లేలా రోడ్ల పక్కన చిన్న కంచెలు కూడా ఏర్పాటు చేశారు. దీంతో అవి చక్కగా సొరంగ మార్గం ద్వారా రోడ్డుకు అటు ఇటుగా రాకపోకలు కొనసాగిస్తున్నాయి.

ఉభయచర జాతులకు చట్టపరమైన రక్షణ

Advertisement

ఫ్రాన్స్‌ లో అన్ని ఉభయచర జాతులకు చట్టపరమైన రక్షణ ఉన్నప్పటికీ, ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాల వల్ల భారీ సంఖ్యలో  చనిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో, వర్షం, తేమ ఎక్కువగా ఉన్న సమయంలో ఇవి నెమ్మదిగా రోడ్లు దాటుతాయి. అలాంటి సమయంలో వాహనదారులకు అవి కనిపించకపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు దాటే ఉభయచరాల్లో దాదాపు 40 శాతం వరకు ప్రాణాలు కోల్పోతున్నట్లు అధికారులు అంచనా వేశారు.

ఇంతకుముందు కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక ప్లాస్టిక్ కంచెలు ఏర్పాటు చేసి, వాటి వెంట బకెట్లు ఉంచేవారు. వాటిలో పడిన కప్పలను స్వచ్ఛంద సేవకులు ప్రతి ఉదయం చేతులతో తీసుకుని రోడ్డు అవతలికి చేర్చేవారు. అయితే,  ప్రతిరోజూ మనుషుల సహాయం అవసరమయ్యే పని కావడంతో, శాశ్వత పరిష్కారంగా ఈ భూగర్భ సొరంగాలను నిర్మించారు.

క్రాపౌడక్ ప్రాజెక్టు కోసం భారీగా ఖర్చు

Advertisement

ఫ్రాన్స్‌ లోని లా కాపెల్ ఎట్ మాస్మోలీన్ ప్రాంతంలో నిర్మించిన ఒక క్రాపౌడక్ ప్రాజెక్టుకు సుమారు 1.30 లక్షల యూరోలు ఖర్చు పెట్టింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సొరంగాలు కేవలం జంతువుల కోసమే కాకుండా వర్షపు నీరు బయటకు వెళ్లే డ్రైనేజీ మార్గాలుగా కూడా ఉపయోగపడుతున్నాయి. దీంతో వరదల ప్రమాదం కూడా తగ్గుతోంది. ప్రస్తుతం ఫ్రాన్స్‌ లోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి ప్రాజెక్టులు నిర్మిస్తోంది. చిన్న జీవుల ప్రాణాలను కాపాడేందుకు ఫ్రాన్స్ చేపట్టిన ఈ వినూత్న ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

Read Also: తొలకరి జల్లులు.. ఆరుద్ర పురుగులు.. ఈ ఎర్రని అతిథులంటే రైతులకు ఎందుకంత ప్రేమో తెలుసా?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×